Varanasi: ‘వారణాసి’ రిలీజ్ డేట్ చెప్పేసిన సూపర్ స్టార్..
Epic cinematic poster showing a massive cosmic impact symbolizing the global release of the movie Varanasi in April 2027.
ఎంటర్‌టైన్‌మెంట్

Varanasi: అఫీషియల్.. ‘వారణాసి’ రిలీజ్ డేట్ చెప్పేసిన సూపర్ స్టార్.. ఫ్యాన్స్‌కు పూనకాలే!

Varanasi: సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు (Super Star Mahesh Babu) హీరోగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి (SS Rajamouli) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘వారణాసి’ (Varanasi). శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తోన్న‌ ఈ చిత్రానికి ‘వారణాసి’ అనే టైటిల్‌ను ప్రకటించేందుకు భారీ ఫంక్షన్‌ను ఇటీవల నిర్వహించిన విషయం తెలిసిందే. గ్లోబ్ ట్రాట‌ర్‌ అంటూ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించిన చిత్రయూనిట్ ఈ కార్యక్రమంలోనే టైటిల్‌ను, హీరో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను, సినిమా స్థాయిని చాటేలా ఓ టీజర్‌ (వారణాసి టు ది వరల్డ్)ను కూడా విడుదల చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బజ్ క్రియేట్ చేసిన ఈ కార్యక్రమంలో చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్న ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటుగా చిత్రయూనిట్ పాల్గొంది. ఇక ఈ మూవీ విడుదలకు సంబంధించి కొన్ని రోజులుగా ఓ డేట్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

Also Read- Sonu Sood: సోషల్ మీడియా విషయంలో.. ప్రధానికి సోనూసూద్ సంచలన విన్నపం

ఆ తేదీనే ఫిక్స్ చేశారు

ఒక్క డేట్ మాత్రమే కాదు, రెండు రోజులుగా పోస్టర్స్ కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. దీంతో అలెర్ట్ అయిన చిత్రయూనిట్ అధికారికంగా విడుదల తేదీని ప్రకటించారు. ఆ పోస్టర్స్‌లో ఉన్నట్లుగానే ఈ సినిమా ఏప్రిల్ 7నే విడుదల కాబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు చిత్ర హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా ఈ చిత్ర రిలీజ్ డేట్‌ని తెలుపుతూ ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ పోస్టర్‌లో 7ను చాలా వైవిధ్యంగా డిజైన్ చేశారు. 2027, ఏప్రిల్ 7న ఈ సినిమా గ్లోబల్ రిలీజ్ (Varanasi Release Date) అని తెలుపుతూ విడుదల చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ విడుదల తేదీతో అందరికీ ఓ క్లారిటీ ఇచ్చినట్లయింది. ఆ డేట్‌కు ముందు, వెనుక రావాలనుకున్న సినిమాల దర్శకనిర్మాతలను అలెర్ట్ చేసినట్లయిందని చెప్పుకోవచ్చు.

Also Read- Amardeep Chowdary: ఒకే ఒక్క ఛాన్స్.. నేనేంటో నిరూపించుకుంటా!

ఇంకా 10,368 గంటల్లో చరిత్ర తిరగరాయబడుతుంది

మరోవైపు సూపర్ స్టార్ పోస్ట్ చేసిన ఈ పోస్టర్‌ని ఫ్యాన్స్ షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా వన్ ఇయర్ 2 మంత్స్ 8 డేట్స్, 432 రోజులు, 10,368 గంటలు, 622080 నిమిషాలు, 37324800 సెకన్లలో మనం చరిత్రను తిరగరాయబోతున్నామంటూ.. ఫ్యాన్స్, జియో హాట్‌స్టార్ వంటి సంస్థలు లెక్కలేస్తున్నారంటే.. ఏ స్థాయిలో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఫ్యాన్స్ సంగతి అయితే సరే సరి.. పూనకాలు లోడింగ్ అనే రేంజ్‌లో ఈ అప్డేట్‌కు ఊగిపోతున్నారు. ఎందుకంటే, రాజమౌళి సినిమా ప్రారంభం బాగానే ఉంటుంది కానీ, సినిమా ఎప్పుడు పూర్తవుతుందో చెప్పడం కష్టం. కానీ, ఈసారి చాలా స్పష్టంగా విడుదల తేదీని, హీరోతోనే రివీల్ చేయించడంతో, కచ్చితంగా ఈ సినిమా అనుకున్న తేదీకి వస్తుందని వారు ఫిక్సవుతున్నారు. అందుకే, వారి ఆనందానికి అవధులు లేవు. మొత్తంగా అయితే, ఈ అప్డేట్‌తో ‘వారణాసి’ ట్యాగ్ ట్రెండ్‌ని షేక్ చేస్తోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?