Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన బ్లాక్ బాస్టర్ ‘గబ్బర్ సింగ్’ ఏ స్థాయి హిట్ అందుకుందే తెలిసిందే. అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులు కూడా బద్దలగొట్టింది. మరోసారి వీరి కాంబినేషన్ లో రాబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై కూడా అవే అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి నిర్మాతలు ఓ అప్డేట్ ఇచ్చారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ హైదరాబాద్‌లో పూర్తి చేసారు. ఈ క్లైమాక్స్ సన్నివేశం యాక్షన్, ఎమోషన్స్‌తో నిండి ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు నిర్వహిస్తూ.. ‘హరి హర వీరమల్లు’ ప్రమోషన్స్‌లో పాల్గొంటూ.. బిజీగా ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ ఈ షూటింగ్‌ను వేగంగా పూర్తి చేసినందుకు నిర్మాతలు పవన్ కళ్యాణ్ కు దన్యవాదాలు తెలిపారు. స్టంట్ కొరియోగ్రాఫర్ నబాకాంత్ పర్యవేక్షణలో క్లైమాక్స్ ఫైట్ పూర్తయింది. ఈ ఫైట్ చిత్రానికే హైలెట్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోలో సాంగ్ షూట్ జరుగుతోంది.
Read also- Vijay Deverakonda: ‘కింగ్‌డమ్’ యుద్ధం కూడా అలాంటిదే..
మణిపూర్‌కి చెందిన మైబం నబాకాంత్ మెతై (Maibam Nabakanta Meitei) దక్షిణాది సినిమల్లో చేసి ప్రముఖ యాక్షన్ డైరెక్టర్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు. చిన్ననాటి నుంచే తండ్రి వద్ద తాంగ్-తా అనే మణిపురి యుద్ధకళను అభ్యసించిన నబాకాంత్, 14 ఏళ్ల వయసులోనే హైదరాబాద్‌కి వచ్చి స్టంట్‌మెన్‌గా కెరీర్ ప్రారంభించారు. తన ప్రత్యేకతైన తాంగ్-తా కళను ఆధునిక యాక్షన్ సన్నివేశాలతో కంపోజ్ చేసిన ఫైట్స్ బాగా పేరు పొందాయి. ‘పుష్పా 2’ చిత్రానికి యాక్షన్ డైరెక్టర్‌గా పనిచేసిన నబాకాంత్ అల్లు అర్జున్, విజయ్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, టైగర్ ష్రాఫ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేశారు. ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో మూడు ఫైట్లను తనదైన శైలిలో కంపోజ్ చేశారు.
Read also- Rangareddy Murder Case: రాష్ట్రంలో ఘోరం.. ఫేమస్ కావాలని అక్కను చంపిన తమ్ముడు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతోంది. దర్శకుడు హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దేశభక్తుడైన ఓ స్టైలిష్ పోలీస్ ఆఫీసర్‌గా పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ గెటప్‌లో కనిపించనున్నారు. సినిమాటోగ్రఫీకి అయానక బోస్, ఎడిటింగ్‌కి ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు. దేశభక్తి, డైలాగ్ పంచ్‌లు, మాస్ ఎలిమెంట్స్ మేళవించిన ఈ సినిమా పవన్ ఫ్యాన్స్‌కి పండగలా ఉండనుంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. మరో హీరోయిన్ రాశీ ఖన్నా కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ సినిమా తమిళ సినమా ‘తెరి’ రిమేక్ అనుకున్నా పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగ్గట్టుడా మార్పులు చేశారని సమాచారం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.