Ustaad Bhagat Singh
ఎంటర్‌టైన్మెంట్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే..

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస పరాజయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్‌కు ఆ సినిమా ప్రాణం పోసింది. ఆ సినిమాతో చాలా మంది లెక్కలు తేలాయి. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కబోతున్న విషయం కూడా తెలిసిందే. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ పేరుతో రూపుదిద్దుకోబోతున్న ఈ సినిమా ఆల్రెడీ కొంత మేర షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకుంది. మొదట ఈ చిత్రం విజయ్ ‘థేరి’ రీమేక్ అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఫ్రెష్ సబ్జెక్ట్‌తో హరీష్ శంకర్ ఈ సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. ఈ విషయాన్ని హరీష్ శంకర్ కూడా కన్ఫర్మ్ చేశారు.

Also Read- Peddi: ‘పెద్ది’ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్‌కి పండగే!

వాస్తవానికి ఈ సినిమా సజావుగా షూటింగ్ సాగి ఉంటే, ఈ పాటికే విడుదలకు దగ్గరలో ఉండేది. మధ్యలో పవన్ కళ్యాణ్ పొలిటికల్‌గా బిజీ కావడం, ఆ తర్వాత ఎన్నికలు, అనంతరం మంత్రిగా ప్రమాణ స్వీకారం.. ఇలా క్షణం గ్యాప్ లేకుండా పవన్ కళ్యాణ్ ఉండటం కారణంగా ఈ సినిమాకు టైమ్ కేటాయించలేకపోతున్నారు. ఇటీవలే ‘హరి హర వీరమల్లు ఎలాగోలా షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ‘ఓజీ’ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఆ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ కూడ కన్ఫర్మ్ చేసింది. తాజాగా పవన్ కళ్యాణ్ కమిటైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్ర అప్డేట్‌ని కూడా మేకర్స్ వదిలారు. అసలీ సినిమా ఆగిపోయినట్లుగా ఇటీవల వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. మేకర్స్ మాత్రం మొదటి నుంచి ఈ ప్రాజెక్ట్‌పై ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఆ నమ్మకమే నిజమైంది.

Also Read- Jr NTR: ‘వార్ 2’ టీజర్‌ స్పందనపై ఎన్టీఆర్ ఆసక్తికర కామెంట్స్

‘ఉస్తాద్ భగత్ సింగ్’ జూన్‌ నుంచి రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుందని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ తెలియజేశారు. భారీ బడ్జెట్‌తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది కంప్లీట్ రీలోడెడ్, రీ ఇమాజిన్డ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని వారు వెల్లడించారు. ఇందులో పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి కమర్షియల్ మాస్ అవతార్‌లో అలరించబోతున్నారని, ఇది అభిమానులకే కాదు, యావత్ ప్రేక్షకులకు హై-యాక్టేన్ కథనంతో గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్‌ను ఇస్తుందని వారు తెలిపారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఆశుతోష్ రానా, నవాబ్ షా, ‘కేజీఎఫ్’ ఫేమ్ అవినాష్, గౌతమి, నాగ మహేశ్, టెంపర్ వంశీ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి యంగ్ డైనమైట్ ఉజ్వల్ కుల్‌కర్ణి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇస్తామని ఈ సందర్భంగా మేకర్స్ వెల్లడించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

IAS Shailaja Ramaiyer: కమిషనర్ శైలజా రామయ్యర్ కు కీలక బాధ్యతలు..?

Mahabubabad District: యూరియా టోకెన్ల కోసం కిక్కిరిసి పోయిన రైతులు.. ఎక్కడంటే..?

Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?

Gadwal District: జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం.. నది ప్రవాహంలో బాలుడు గల్లంతు

Bigg Boss 9 Telugu Promo: డబుల్ హౌస్ తో.. డబుల్ జోష్ తో.. ప్రోమో అదిరింది గురూ!