Jr NTR on War 2 Teaser Response
ఎంటర్‌టైన్మెంట్

Jr NTR: ‘వార్ 2’ టీజర్‌ స్పందనపై ఎన్టీఆర్ ఆసక్తికర కామెంట్స్

Jr NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్న చిత్రం ‘వార్ 2’ (War 2). ఎన్టీఆర్ పుట్టిన రోజుని పురస్కరించుకుని తాజాగా ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్‌ను రాబట్టుకోవడమే కాకుండా, ఎన్టీఆర్‌కు బాలీవుడ్‌ అరంగేట్రానికి పర్ఫెక్ట్ పాత్ర లభించిందనేలా టాక్‌ని సొంతం చేసుకుంది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో రానున్న ‘వార్ 2’.. ఈ టీజర్ విడుదల తర్వాత ఇంటర్నెట్‌లో సంచలనంగా మారింది. ‘వార్ 2’ టీజర్ పై ప్రేక్షకులు, అభిమానులు కురిపిస్తున్న ప్రేమకు ఎన్టీఆర్ ఎంతగానో ఉప్పొంగిపోయారు. ఈ టీజర్‌కు వస్తున్న స్పందనపై ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Also Read- Samantha and Raj: రాజ్ నిడిమోరు మాజీ భార్య మరో సంచలన పోస్ట్!

ఈ మేరకు ఎన్టీఆర్ స్పందిస్తూ.. ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రేమ, ప్రశంసలను చూస్తుంటే.. నేను నటుడిని అయినందుకు చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఇంతటి ప్రేమ లభించడం చూస్తుంటే, నిజంగా ఇది నాకు లభించిన ఒక వరంలా అనిపిస్తుంది. నాపై అందరూ చూపించే ఈ ప్రేమ నాకు ఎంతో విలువైనది. ‘వార్ 2’ మీద మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. ఈ YRF స్పై యూనివర్స్ చిత్రంలో నన్ను పూర్తిగా కొత్తగా చూపించారు. ఈ మూవీ కోసం మేమంతా కూడా ఎంతో సరదాగా కలిసి పని చేశాం. దేశంలోని ప్రతి మూల నుంచి వస్తున్న ఈ ప్రేమను చూసి ఉప్పొంగిపోయాను.

ఈ సినిమాలో నేను పోషించిన పాత్ర నాకు చాలా ప్రత్యేకమైనది. ‘వార్ 2’ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో నాకర్థమైంది. థియేటర్లలో మీ స్పందన చూసేందుకు నేను మరింత ఆనందంగా, ఉత్సాహంగా వేచి చూస్తున్నాను. YRF స్పై యూనివర్స్ ఎప్పుడూ కూడా కొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది. YRF స్పై యూనివర్స్ బాక్సాఫీస్‌కు బెంచ్‌మార్క్‌లను సృష్టిస్తుంది. మా ‘వార్ 2’ నుంచి వచ్చిన ఒక్క టీజర్‌తోనే ఇంతటి ప్రభావం చూపించడం, ప్రేక్షకులపై అంచనాలను పెంచేలా ముద్ర వేయడం చూసి నేను నిజంగా హ్యాపీగా ఉన్నాను. ఆగస్టు 14 నుంచి థియేటర్లలో అభిమానుల సందడి చూసేందుకు నేను ఎంతగానో ఎదురు చూస్తున్నానని అన్నారు.

Also Read- Rana Naidu Season 2: బూతుల వెబ్ సిరీస్ సీజన్ 2 రిలీజ్‌కు డేట్ ఫిక్సయింది

ఇక ఈ టీజర్‌.. చేజింగ్ సీన్లు, భారీ యాక్షన్ స్టంట్స్‌ను ఇండియన్ ఆడియెన్స్ ఎక్స్‌పీరియెన్స్ చేయబోతున్నారనే ఫీల్‌ని ఇచ్చిన విషయం తెలిసిందే. హృతిక్ రోషన్ సరసన కియారా అద్వానీ నటించినట్లుగా ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇంతకు ముందు ఏ సినిమాలో చేయని విధంగా ఆమె ఎక్స్‌పోజ్ చేసిన అందాలు, బికినీ ట్రీట్ చూసి ప్రేక్షకులు అవాక్కవుతున్నారు. ఇందులో ఎన్టీఆర్ న్యూ లుక్, స్టైలీష్ యాక్షన్ సీక్వెన్స్‌ మాత్రం అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చాయని చెప్పుకోవచ్చు. YRF స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో ఆరవ చిత్రంగా ఈ సినిమా రాబోతోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తమిళం, తెలుగులో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్