Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) హీరోగా రూపుదిద్దుకుంటున్న హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ బుచ్చి బాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షాట్ గ్లింప్స్ దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ క్రికెట్ టీమ్స్‌లోని క్రికెటర్లు కూడా ఈ వీడియోని ఉపయోగించి, స్పెషల్ వీడియోలు క్రియేట్ చేయడంతో.. ఒక్కసారిగా ‘పెద్ది’ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చలు మొదలయ్యాయి. పవర్ ఫుల్ కొలాబరేషన్, అద్భుతమైన టీమ్‌తో భారతీయ సినిమాలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడానికి ఈ సినిమా సిద్ధమవుతోంది. ఆల్రెడీ విడుదలైన గ్లింప్స్ చూసిన తర్వాత ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్ పక్కా రాబోతుందనే ఫీల్‌ని ఫ్యాన్స్‌కి ఇవ్వడంతో.. అంతా ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.
Also Read- Jr NTR: ‘వార్ 2’ టీజర్ స్పందనపై ఎన్టీఆర్ ఆసక్తికర కామెంట్స్
పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers), సుకుమార్ రైటింగ్స్ (Sukumar Writings) సమర్పణలో విజనరీ నిర్మాత వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్‌ని మేకర్స్ వదిలారు. ‘పెద్ది’ మూవీ లెన్తీ క్రూషియల్ షెడ్యూల్ హైదరాబాద్‌లోని మ్యాసీవ్ విలేజ్ సెట్‌లో ప్రారంభం కాబోతుందని తెలుపుతూ కొన్ని ఎక్స్‌క్లూజివ్ ఫొటోలను మేకర్స్ వదిలారు. ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం ప్రారంభమైన ఈ షెడ్యూల్‌తో ఈ సినిమా ఓ కీలక దశను చేరుకోనుందని మేకర్స్ ప్రకటించారు. (Peddi Latest Update)

Also Read- Bigg Boss Season 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హోస్ట్‌పై కీలక అప్డేట్!
‘పెద్ది’లోని రా అండ్ రస్టిక్ బ్యాక్ డ్రాప్, మూలకథను ప్రతిబింబించేలా, ఆడియెన్స్‌కు ఓ ప్రత్యేక అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో టీమ్ ఈ సినిమా కోసం ఎంతగానో ప్రయత్నం చేస్తోంది. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా నేతృత్వంలో మ్యాసీవ్ విలేజ్ సెట్‌ని ప్రస్తుత షెడ్యూల్ కోసం నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ భారీ యాక్షన్ సీక్వెన్స్, టాకీ పోర్షన్‌ని చిత్రీకరించనున్నారు. ‘ఉప్పెన’ విజయం తర్వాత బుచ్చి బాబు సానా మరింత ప్రతిష్టాత్మకంగా, ప్రతి విభాగాన్ని చాలా కేర్ తీసుకుంటూ గ్రాండ్ స్కేల్‌లో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ రస్టిక్ అండ్ రగ్గడ్ లుక్‌లో కనిపించనున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తుండగా, జాతీయ అవార్డు గెలుచుకున్న నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 27 మార్చి, 2026న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు