Trivikram Srinivas: ‘ఈ సినిమా ఆడుద్ది’.. ఏ సినిమా అంటే?
Trivikram Patang (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Trivikram Srinivas: ‘ఈ సినిమా ఆడుద్ది’.. ఏ సినిమా అంటే?

Trivikram Srinivas: మాటల మాంత్రికుడు, సంచలన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) ఓ సినిమా గురించి మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సినీ పరిశ్రమలో నూతన టాలెంట్‌ ఎక్కడా కనిపించినా కొంత మంది దర్శకులు, హీరోలు ఆ టీమ్‌ క్రియేటివిటిని, వర్క్‌ను ఎంతగా అభినందిస్తుంటారో తెలియని విషయం కాదు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కూడా ఒకరు. తాజాగా ఆయన ఓ స్మాల్ బడ్జెట్ సినిమాను ఉద్దేశించి.. ‘ఈ సినిమా ఆడుద్ది’ అని అనడంతో, ఆ మాట ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంతకీ ఆ సినిమా ఏది? త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏ సినిమాను ఉద్దేశించి అలా అన్నారు? అని అనుకుంటున్నారు కదా.. ఆ మ్యాటర్‌లోకి వెళితే..

Also Read- The Raja Saab: ‘ది రాజా సాబ్’ క్రిస్మస్ గిఫ్ట్.. ‘రాజే యువరాజే..’ సాంగ్ ప్రోమో.. ఇక ప్రేయర్లే!

ఈ సినిమా ఆడుతుంది

ఆ సినిమా ఏదో కాదు.. ‘పతంత్’ (Patang). ఇటీవల పతంగ్‌ సినిమా ట్రైలర్‌ను, ఆ టీమ్‌ చేస్తున్న ప్రమోషన్‌ కంటెంట్‌, ఆ సినిమా కాన్సెప్ట్‌ గురించి విని ఇంప్రెస్సైన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌.. ఆ టీమ్‌ను పిలిచి అభినందించడంతో పాటు టీమ్‌కు తన బెస్ట్ విషెస్‌‌ను తెలియజేశారు. అందుకు సంబంధించిన వీడియోనే ఇప్పుడు వైరల్ అవుతోంది. పతంగుల పోటీ నేపథ్యంలో, సరికొత్త కాన్సెప్ట్‌తో.. సౌత్‌ ఇండియాలోనే మొదటిసారిగా టీమ్‌ చేస్తున్న ప్రయత్నం విజయవంతం కావాలని ఆయన కోరుకున్నారు. ‘నాకెందుకో ఈ సినిమా ఆడుతుందని అనిపిపిస్తుంది’ అని త్రివిక్రమ్‌ ఎంతో పాజిటివ్‌గా మాట్లాడటంతో పతంగ్‌ టీమ్‌ ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి. అవును మరి.. త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి దర్శకుడి నోటి వెంట అలాంటా మాట వస్తే.. ఎవరికైనా ఆనందమే. అందుకే టీమంతా తమ సంతోషాన్ని తెలియజేశారు.

Also Read- Peddi Song: ‘సరుకు సామాను చూసి మీసం లేచి వేసే కేక..’ లిరిక్ గమనించారా? ‘చికిరి’‌కి కూడా నోటీసులు ఇస్తారా?

క్రిస్మస్ స్పెషల్‌గా

త్రివిక్రమ్‌ను కలిసిన వారిలో పతంగ్‌ హీరోలు వంశీ పూజిత్‌, ప్రణవ్‌ కౌశిక్‌, దర్శకుడు ప్రణీత్‌ పత్తిపాటి, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ మేఘన శేషవపురి, చిత్ర నిర్మాతల్లో ఒకరైన రిషాన్‌ సినిమాస్‌ అధినేత సంతప్‌ మాక, చిత్ర విఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌ అండ్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ నిఖిల్‌ కోడూరు తదితరులు ఉన్నారు. ‘పతంగ్’ విషయానికి వస్తే.. టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఒకరైన నిర్మాత డి.సురేష్‌ బాబు సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘పతంగ్’. ఈ చిత్రాన్ని సినిమాటిక్ ఎలిమెంట్స్, రిష‌న్ సినిమాస్, మాన్‌సూన్‌ టేల్స్‌ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఈ స్పోర్ట్స్‌ డ్రామా చిత్రానికి విజ‌య్ శేఖ‌ర్ అన్నే, సంప‌త్ మకా, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మాతలు. పాపులర్‌ డైరెక్టర్, నటుడు గౌతమ్‌ వాసుదేవ మీనన్‌, ప్ర‌ముఖ సింగ‌ర్ కమ్ న‌టుడు ఎస్‌పీ చ‌ర‌ణ్ ఈ చిత్రంలో కీల‌క‌మైన పాత్ర‌ల్లో నటించారు. క్రిస్మస్ స్పెషల్‌గా డిసెంబర్ 25న ఈ చిత్రం గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Medak Cathedral Church: మెదక్ కేథడ్రల్ చర్చిలో అంగరంగ వైభవంగా క్రిస్మస్ వేడుకలు

Hindu Man Killed: హిందూ యువకుడిపై మూకదాడి.. హత్య.. బంగ్లాదేశ్‌లో మరో ఘోరం

Ravi Teja: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. మాస్ రాజా క్రిస్మస్ అవతార్ చూశారా!

Special Trains: దక్షిణమధ్య రైల్వే గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో స్పెషల్ ట్రైన్స్ ప్రకటన

Ganja Seizure: భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో ఆగని గంజాయి దందా.. మరో బ్యాచ్ దొరికింది