Trance of Kuberaa: కింగ్ నాగార్జున- కోలీవుడ్ స్టార్ ధనుష్ కాంబోలో రూపుదిద్దుకుంటోన్న హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ డ్రామా చిత్రం ‘కుబేర’. ఆదివారం ఈ చిత్రం నుంచి సెకండ్ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’ పేరుతో విడుదలైన ఈ వీడియో, ప్రేక్షకులను ‘కుబేర డార్క్ అండ్ హిప్నోటిక్ వరల్డ్’ లోకి తీసుకెళుతోంది. సినిమాలోని కీలక పాత్రలను, వారు క్రియేట్ చేయబోయే సునామీని ఇందులో అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ముగ్గురు నేషనల్ అవార్డ్ విన్నర్స్ ధనుష్, విజనరీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కలిసి గ్రేట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా లార్జర్ దెన్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుందని తాజాగా విడుదలైన ఈ ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’ చూస్తుంటే తెలుస్తోంది.
Also Read- Allu Aravind: పవన్ కళ్యాణ్ చెప్పింది 100 శాతం నిజం? ఆ నలుగురిలో నేను లేను!
ఈ ఎక్జయిటింగ్ టీజర్‌లో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ హైలైట్‌గా నిలుస్తోంది. ‘నాది నాది నాది నాదే ఈ లోకమంతా..’ అనే హిప్నాటిక్ కోరస్ టీజర్‌ని కమ్మేసింది. నంద కిషోర్ ఈ పాటను రచించగా.. ధనుష్, హేమచంద్ర వేదాల కలిసి తమ డైనమిక్ వోకల్స్‌తో అదరగొట్టారు. ఎస్.పి. అభిషేక్, శెణ్బగరాజ్, సాయి శరణ్, శ్రీధర్ రమేష్, భరత్ కె రాజేశ్ తమ ఎనర్జిటిక్ వోకల్స్‌ని జత చేశారు. ఈ పాట కుబేర వరల్డ్‌ని అద్భుతంగా తెలియజేస్తోంది. నాగార్జున పవర్ ఫుల్ అండ్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్‌తో ఇందులో కనిపించారు. ఆయన పాత్ర ఇందులో ఎంత బలంగా ఉంటుందో, అందులో ఎంత భావోద్వేగం నిండి ఉందనేది చాలా స్పష్టంగా ఈ గ్లింప్స్ తెలియజేస్తుంది. ఆయన విలువలతో నడుచుకునే వ్యక్తిలా కనిపించినా, అంతర్గతంగా ఎన్నో ప్రశ్నలు తలెత్తెలా శేఖర్ కమ్ముల ఆయన పాత్రను డిజైన్ చేశారనేది అర్థమవుతోంది.
Also Read- Manchu Manoj: నాన్న నన్ను క్షమించు.. కన్నప్ప సూపర్ హిట్ అవ్వాలి.. మనోజ్ సంచలన కామెంట్స్
నాగార్జున, ధనుష్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమాకు చాలా కీలకం అనేది ఈ టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. ధనుష్ మరోసారి తన నటనతో అందరి అటెన్షన్ తీసుకోబోతున్నాడనేది ఆయన ఈ టీజర్‌లో కనిపించిన ప్రతి షాట్ తెలియజేస్తుంది. ఇంకా ఈ టీజర్‌లో రష్మిక మందన్న, జిమ్ సర్భ్‌ల పాత్రలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రతి పాత్ర మిస్టీరియస్, డేంజరస్ గేమ్‌లో భాగమైనట్లుగా చూపించారు. ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’ రెగ్యులర్ టీజర్లకు భిన్నంగా, భావోద్వేగాలకు ప్రాధాన్యమిస్తూ కట్ చేసిన విధానం చూస్తుంటే.. మేకర్స్ ఈ సినిమా పట్ల ఎంత ధీమాగా ఉన్నారనేది తెలిసిపోతుంది. మొత్తంగా అయితే, ఈ పాన్ ఇండియన్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా జానర్‌ని రిడిఫైన్ చేసేలా పత్రి పాత్ర ఉందనడంలో అతిశయోక్తి లేనే లేదు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌లపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషలలో త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు