Manchu Manoj: తెలుగు సినీ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులు నుంచి మోహన్ బాబు ఫ్యామిలీ వివాదమే నడుస్తుంది. వీరు సినిమాల్లో కంటే వివాదాల్లోనే ఎక్కువ నిలుస్తున్నారు. ఇంట్లో కలిసి కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయాలను అందరికీ తెలిసేలా మీడియా ముందుకు వచ్చారు. ఇక ఇప్పుడు తమ్ముడు మంచు మనోజ్ కు, అన్న విష్ణుకు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఇక్కడి వరకే అంటే బాగానే ఉంటుంది. కానీ, సినిమా ఫంక్షన్లో కూడా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా 9 ఏళ్ల తర్వాత మంచు మనోజ్ ” భైరవం ” అనే కొత్త చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలోనే ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహన్ బాబు, మంచు విష్ణు గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు.
Also Read: Tollywood Heroine: ఆ హాట్ బ్యూటీ కోసం క్యూ కడుతున్న పెళ్ళైన హీరోలు.. ఆమే కావాలంటూ డిమాండ్?
ఏంటి భైరవం మీద మీకు అంత నమ్మకం? నేను ఈ సినిమాని కన్నప్ప మీద రిలీజ్ చేస్తా అని అన్నారని యాంకర్ అడగగా.. ” నేను చేద్దామని కాదు, ఆ డేట్స్ అలా వచ్చాయి తప్ప వేరేలా అనలేదు. కన్నప్ప కి , మా సినిమాకి సంబందం లేదు. అది వేరే జానర్, ఇది వేరే జానర్. రెండు వేరు వేరు కథలు. రెండు సూపర్ హిట్ అవుతాయని ఒక నమ్మకంతో, రెండు బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ఆల్ సెట్ అండ్ డన్.. ఏదో కోపంలో అలా అనేశాను, నాకు అయితే మొన్న నా ట్రైలర్ లాంచ్ అప్పుడు పెద్ద వెయిట్ వచ్చేసిందని ” చెప్పాడు.
Also Read: Hyderabad EV Buses: హైదరాబాద్‌కు మరో 800 ఈవీ బస్సులు కేటాయించండి.. కేంద్రానికి సీఎం విజ్ఞప్తి!
మనోజ్ ఇంకా మాట్లాడుతూ ” సినిమా అంటే నా మరో అమ్మ. ఇప్పుడు సభాముఖంగా కన్నప్ప సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నాన్న కూడా చాలా స్పెండ్ చేసి ఆ సినిమా తీశారు. అలాగే, ప్రభాస్, మోహన్ లాల్.. ప్రతి ఒక్కరూ వచ్చి సపోర్ట్ చేశారు. ఒకరి వల్ల అలా కాకూడదు. నేను కూడా ఇంతక ముందు ఏమైనా అంటే నన్ను క్షేమించాలి అందరూ. ముఖ్యంగా , నాన్న నన్ను క్షమించు.. వాళ్ళు బావుండాలి. అందరూ బావుండాలి.. ఇది మనస్పూర్తిగా భగవంతుని సాక్షిగా చెబుతున్నాను ” అంటూ సంచలన కామెంట్స్ చేశాడు.