Allu Aravind Press Meet
ఎంటర్‌టైన్మెంట్

Allu Aravind: పవన్ కళ్యాణ్ చెప్పింది 100 శాతం నిజం? ఆ నలుగురిలో నేను లేను!

Allu Aravind: టాలీవుడ్‌కు సంబంధించి ప్రస్తుతం ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతల మధ్య కాంట్రవర్సీ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇన్నాళ్ల నుంచి కామ్‌గా ఉండి, ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ సినిమా విడుదల టైమ్‌లోనే వారు థియేటర్ల బంద్‌కు పిలుపును ఇవ్వడంతో సర్వత్రా చర్చలు మొదలయ్యాయి. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్న కుట్రగా భావించిన ఏపీ డిప్యూటీ సీఎం.. తన కార్యాలయం తరుపు నుంచి శనివారం సీరియస్‌గా ఓ లేఖను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ లేఖపై ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బీభత్సంగా చర్చలు నడుస్తున్నాయి. థియేటర్లు బంద్ చేయడం లేదంటూ ఫిల్మ్ చాంబర్ అధికారిక ప్రకటన విడుదల చేసినా, అసలు ఇంత డిస్కషన్ రావడానికి వెనుక పెద్ద కుట్ర జరిగిందనే విషయం ఏపీ డిప్యూటీ సీఎం వరకు వెళ్లింది. అందుకే ఆయన తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ రియాక్షన్‌పై తాజాగా టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ మీడియా సమావేశం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి వచ్చిన లేఖలో ఉన్న ప్రతి అక్షరం నిజమేనంటూ ఆయన అసలు విషయం బయటపెట్టేశారు.

Also Read- Sardar 2: ‘సర్దార్ 2’ నుంచి కార్తి లుక్.. అదిరింది కదా!

పవన్ కళ్యాణ్ చెప్పింది వంద శాతం కరెక్ట్. డిప్యూటీ సీఎం అయిన తరువాత మేము వెళ్లి కలిశాము. అయితే ఎవరికి వారు తమకు పవన్ కళ్యాణ్ తెలుసు అని అనుకున్నారు. ఛాంబర్ వాళ్ళు కలుద్దామనే ఆలోచన చేయలేదు. థియేటర్స్‌కి సమస్యలు వున్నాయి. వాళ్ళందరూ కలసి ప్రభుత్వం‌తో చర్చిస్తే బాగుంటుంది. సమస్యల పరిష్కారానికి ఛాంబర్ ముందుకు రావాలి. పవన్ చెప్పినా ఎవరూ వెళ్లి కలవలేదు. పవన్ కళ్యాణ్ బాధ పడింది వంద శాతం నిజం. కష్టం వచ్చిందని గత సీఎంని కలిశారు కదా. థియేటర్లకు సంబందించిన మూడు మీటింగ్‌లకు నేను వెళ్లలేదు. బంద్ చేద్దాం.. మీటింగ్‌కు రమ్మన్నారు అందుకే నేను వెళ్ళలేదు. ఇప్పుడు సింగిల్ థియేటర్లకు చాలా కష్టాలున్నాయి. పవన్ ఆఫీస్ నుంచి వచ్చిన ప్రకటన సమర్ధనీయంగా ఉంది. థియేటర్ల యాజమాన్యాలు స్ట్రైక్ చేయాలనుకుంటే తర్వాత అయినా చేస్తారు. గత 50 ఏళ్లుగా సినిమాలు తీయడమే నా వృత్తి. పవన్ సినిమాకు ముందు ఇలా చేయడం ఏంటని నిర్మాత అల్లు అరవింద్ ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read- Kamal Haasan: ఏంటి.. ఆ హీరో ట్రాన్స్ జెండరా.. షాకింగ్ కామెంట్స్ చేసిన కమల్ హాసన్

ఇంకా ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి వచ్చిన లేఖలో ఉన్న విషయం 100 శాతం నిజమే. ‘ఆ నలుగురు’ అంటూ మళ్లీ వార్తలొచ్చాయి. వారి కబంధ హస్తాల్లోనే ఇండస్ట్రీ ఉన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు. ఆ నలుగురికి నాకు సంబంధం లేదు. ఆ నలుగురిలో నేను లేను. ‘ఆ నలుగురు’ అనే మాట 15 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. ఆ నలుగురు.. ఇప్పుడు పది మంది అయ్యారు. అది ఎవరికీ తెలియదు. అందరూ అనుకుంటున్నట్లుగా ఆ నలుగురిలో నేను లేను. నా దగ్గర కేవలం 15 థియేటర్లు మాత్రమే ఉన్నాయి. తెలంగాణలో నాకు ఒక్క థియేటరే ఉంది. ఆ థియేటర్ల లీజు పూర్తయ్యాక వాటిని కూడా రెన్యువల్‌ చేయవద్దని మా స్టాఫ్‌కి చెబుతుంటా. అవి కూడా త్వరలో ఉండవు. ఆ నలుగురి వ్యాపారం నుంచి కొవిడ్‌ టైమ్‌లోనే నేను బయటకు వచ్చేశా.

పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతుండగా, థియేటర్లు మూసి వేస్తామని చెప్పడం దుస్సాహసం. పవన్ కళ్యాణ్‌ను గతంలో కలిశాం. చంద్రబాబుని కలిశారా? అని పవన్ కళ్యాణ్ అడిగారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో గానీ ఎవరూ పట్టించుకోలేదు. ఇండస్ట్రీకి పవన్ కళ్యాణ్ హెల్ప్ చేస్తున్నారు. ఛాంబర్ నుంచి వెళ్లి చంద్రబాబుని కలవాలి కదా. సమస్య వచ్చినప్పుడు గత సీఎంను కలవలేదా? ప్రభుత్వం మారిన తర్వాత ఇండస్ట్రీ ప్రతినిధులు వెళ్లి కలవాలి కదా. ప్రభుత్వంతో సంబంధం లేదని చెప్పడం సరికాదు. ప్రభుత్వంలో సంబంధం లేకపోతే, గత సీఎంను ఎందుకు కలిసినట్టు? అని అల్లు అరవింద్ ప్రశ్నించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?