Kubera Movie (Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Kubera Movie: కుబేర సినిమా చూస్తుండగా కూలిన థియేటర్ సీలింగ్.. గాయాలపాలైన ప్రేక్షకులు

Kubera Movie: మహబూబాబాద్ జిల్లాలోని ముకుందా థియేటర్‌లో జూన్ 25 న అర్ధరాత్రి జరిగిన ఒక సంఘటన చోటు చేసుకుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మన ముందుకు వచ్చిన ‘కుబేర’ సినిమా సెకండ్ షో రన్ అయ్యే సమయంలో థియేటర్ సీలింగ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో సినిమా చూస్తున్న ప్రేక్షకులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో సినిమా సెకండ్ షో ని మధ్యలోనే నిలిపివేశారు. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం పట్ల ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. థియేటర్ యాజమాన్యం నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తూ, ప్రేక్షకులు యాజమాన్యంతో గొడవకు దిగారు. వారు థియేటర్ నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read: Singer Pravasthi: మరో సంచలన వీడియో రిలీజ్ చేసిన సింగర్ ప్రవస్తి.. జనాలను ఫూల్స్ చేయడమే టార్గెట్?

ఊహించని ప్రమాదంతో ప్రేక్షకులు షాక్?

సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు ఈ ఊహించని ప్రమాదం జరగడంతో వాళ్ళు కూడా షాక్ అయ్యారు. “ ఆనందంగా సినిమా చూడాలని వచ్చాం, కానీ గాయాలతో ఇంటికి వెళ్లాల్సి వచ్చింది” అని కొందరు ప్రేక్షకులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. థియేటర్ భద్రతా ప్రమాణాలపై తీవ్ర చర్చ జరుగుతోంది.

Also Read: Anasuya Bharadwaj:యాంకర్ అనసూయ ఫోన్ ట్యాపింగ్.. రహస్యాలు మొత్తం బయటకు వస్తాయా?

థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వలనే ఈ ప్రమాదం

ఈ ఘటన థియేటర్ నిర్వహణలో లోపాలను బయటపెట్టింది. సీలింగ్ నిర్మాణం బలహీనంగా ఉండటం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. స్థానిక అధికారులు ఈ ఘటనపై విచారణ జరపనున్నట్లు సమాచారం. థియేటర్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

Also Read: Kuberaa: కుబేర సినిమాలో రష్మిక డబ్బు బ్యాగ్ ఎక్కడ ఉంది? శేఖర్ కమ్ముల సమాధానం చెప్పాల్సిందే?

” కుబేర ” సినిమా

‘కుబేర’ సినిమా జూన్ 20, 2025న ప్రేక్షకుల ముందుకొచ్చి, బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధిస్తోంది. ఈ మూవీ ఐదు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 100 కోట్ల రూపాయల మార్క్‌ను అందుకుంది. ధనుష్ ‘దేవా’ అనే బిచ్చగాడి పాత్రలో అదరగొట్టాడు. నాగార్జున ‘దీపక్’ అనే పాత్రలో నటించి, ప్రేక్షకులను మెప్పించాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీ, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ పై నిర్మించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు