Producer SKN ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Producer SKN: అన్నా లెజినోవా పై టాలీవుడ్ నిర్మాత ఆసక్తికర కామెంట్స్ .. వైరల్ అవుతున్న ట్వీట్

Producer SKN: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్  ( Mark Shankar  ) అగ్ని ప్రమాదం నుంచి బయట పడిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే, తన కొడుకు ప్రమాదం నుంచి బయటపడటంతో పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా(Anna Lezhneva) తిరుమలకు వెళ్లి శ్రీవారికి తలనీలాలు ఇచ్చారు. ఆదివారం సాయంత్రం తిరుమలకు వెళ్లిన ఆమెకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.

Also Read: Duddilla Sridhar Babu: మహిళలకు గుడ్ న్యూస్.. మీ కోసమే పారిశ్రామిక పార్కులు.. ఎక్కడంటే!

సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదకర ఘటనలో తన కొడుకు ప్రాణాలతో బయటపడాలని తిరుమల శ్రీవారిని మొక్కకుందట. మార్క్ శంకర్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇప్పుడిప్పుడే కోలుకున్నాడు. మొక్కు ఫలించడంతో తిరుమలకు వెళ్ళి తలనీలాలు ఇచ్చారు. ఆమె తన కొడుకు ప్రాణాల కోసం అన్ని పక్కన పెట్టి వెంకటేశ్వరస్వామికి మొక్కుకోవడం గొప్ప విశేషమనే చెప్పుకోవాలి. అయితే, ఆమె తలనీలాలు ఇవ్వడంపై టాలీవుడ్ నిర్మాత SKN ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా వేదికగా ఎక్స్ లో ట్వీట్ చేశారు.

Also Read:  Damodar Raja Narasimha: అడుగడుగునా అక్రమాలు.. సూపరిండెంట్ పై మంత్రి ఫైర్!

పవన్ కళ్యాణ్ గారి సతీమణి శ్రీమతి అన్నాలెజినోవా కొణిదెల గారు తన కుమారుడు క్షేమంగా ప్రమాదం నుండి బయటపడినందుకు స్వామివారి మొక్కులో భాగంగా తలనీలాలను సమర్పించడం జరిగినదని అన్నారు. హిందూ మతాన్ని అనుసరించే నేను మిమ్మల్ని చూసి ఎంతో గర్వపడుతున్నాను మేడం అని పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని భర్త పరిరక్షిస్తుంటే, అన్యమతం నుండి వచ్చి హిందూ మతాన్ని ఇంతలా గౌరవిస్తున్న మీ మనస్తత్వాన్ని ఖచ్చితంగా అభినందించాలి ” అని ట్వీట్ లో రాసుకొచ్చారు.

ట్వీట్ పై నెటిజన్స్ స్పందించిఅందరూ ఇలా ఉంటే ఎలాంటి సమస్యలు రావు, ఈమెను చూసి నేర్చుకోండిఅంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:  CM Revanth Reddy: నిరుద్యోగం తగ్గాలంటే నైపుణ్యాలు కావాలి.. యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీపై సీఎం దృష్టి

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం