The Rajasaab: రెబల్ స్టార్ ప్రభాస్ (Rebal Star Prabhas) హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘ది రాజా సాబ్’ (The Rajasaab). ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్.. సినిమాపై స్కై రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేశాయి. ఈ మూవీ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా, అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను దసరా ఫెస్టివల్‌ను పురస్కరించుకుని మేకర్స్ విడుదల చేయగా, ఇప్పటికీ ఈ ట్రైలర్ ట్రెండ్ అవుతుండటం విశేషం. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరుగుతున్నాయి. ఈ ట్రైలర్‌లో రెండు డిఫరెంట్ షేడ్స్‌లో ప్రభాస్ కనిపించిన తీరు.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చేసింది. రాజా సాబ్ క్యారెక్టర్‌తో పాటు వింటేజ్ లుక్‌లో రెబల్ స్టార్ వెర్సటైల్‌గా కనిపించి.. సినిమా కోసం అందరూ వెయిట్ చేసేలా చేశారు.
Also Read- Kantara Chapter 1: వేట మొదలైంది.. నాలుగు రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
ఇప్పటి వరకు ట్రైలర్‌కు ఎన్ని వ్యూస్ వచ్చాయంటే..
ప్రస్తుతం ఈ ట్రైలర్ 40 మిలియన్ల ప్లస్ డిజిటల్ వ్యూస్‌ను రాబట్టినట్లుగా తెలుపుతూ మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్‌లో సింహాసనంపై ప్రభాస్ ఠీవీగా కూర్చుని ఉన్నారు. ఢిఫరెంట్ అవతార్‌లో, నోట్లో సిగార్ వెలిగిస్తూ ఉన్న ప్రభాస్ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. రెబల్ స్టార్‌తో దర్శకుడు మారుతి వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ అనిపించే సినిమా రూపొందించినట్లుగా ఈ ట్రైలర్ ప్రూవ్ చేస్తోంది. తనకు ఇష్టమైన రొమాంటిక్ హారర్ కామెడీ జానర్‌లో.. తన ఫేవరేట్ హీరో ప్రభాస్‌ను మారుతి చూపించిన విధానం అందరినీ ఆకర్షిస్తోంది. అలాగే మ్యూజిక్ సెన్సేషన్ థమన్ బీజీఎంలోని వేరియేషన్స్ రాజా సాబ్ ట్రైలర్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఇక టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వరల్డ్ క్లాస్ మేకింగ్ క్వాలిటీతో తమ ప్రొడక్షన్ స్టాండర్డ్స్‌ను మరోసారి పరిచయం చేసింది. అందుకే ఈ ట్రైలర్ జనాలకు పిచ్చపిచ్చగా నచ్చేసింది.
Also Read- Rashmika Mandanna: ‘ఇదంతా మీ కష్టంతోనే సాధ్యమైంది’.. రష్మిక పోస్ట్ వైరల్!
తాజా అప్డేట్ ఇదే.. (Rajasaab Latest Update)
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తూ.. సినిమాకు గ్లామర్ యాడ్ చేస్తున్నారు. పాన్ ఇండియా వైడ్‌గా 09 జనవరి, 2026న సంక్రాంతి స్పెషల్‌గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోన్న ఈ సినిమా తాజా అప్డేట్‌ని మేకర్స్ తెలియజేశారు. ప్రస్తుతం రెండు పాటల చిత్రీకరణ నిమిత్తం ‘రాజా సాబ్’ టీమ్ యూరప్ వెళుతున్నట్లుగా నిర్మాత ఎస్‌కెఎన్ అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఫ్లైట్‌లో మారుతితో కలిసి వెళుతున్న ఫొటోని షేర్ చేశారు. ఈ రెండు పాటల చిత్రీకరణలో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని ఆయన వెల్లడించారు. సో.. తాజాగా వచ్చిన ఈ అప్డేట్‌తో ‘ది రాజా సాబ్’ సంక్రాంతికి రావడం పక్కా అనేది మరోసారి క్లారిటీ ఇచ్చినట్లయిందని అంతా భావిస్తున్నారు.
Off to #Europe with Director Saab
For #TheRajaSaab pic.twitter.com/Q8L8oruEol— SKN (Sreenivasa Kumar) (@SKNonline) October 4, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
