Rashmika Mandanna: ‘ఇదంతా మీ కష్టంతోనే సాధ్యమైంది’- రష్మిక
Rashmika Mandanna in Thamma
ఎంటర్‌టైన్‌మెంట్

Rashmika Mandanna: ‘ఇదంతా మీ కష్టంతోనే సాధ్యమైంది’.. రష్మిక పోస్ట్ వైరల్!

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నిశ్చితార్థం చేసుకున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కాకపోతే, అధికారికంగా వారు ఇంత వరకు రియాక్ట్ కాలేదు. అటు విజయ్ కానీ, ఇటు రష్మిక కానీ నిశ్చితార్థానికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు కానీ, వీరిద్దరి పెళ్లి ఫిబ్రవరిలో ఉంటుందనేలా టాక్ అయితే గట్టిగానే నడుస్తుంది. ఈ నేపథ్యంలో ‘ఇదంతా మీ కష్టంతోనే సాధ్యమైంది’ అని రష్మిక పోస్ట్ చేసిందంటే.. అందరూ నిశ్చితార్థం గురించేనని అనుకుంటారు. కానీ, ఇక్కడ విషయం అదికాదు. తాజాగా ఆమె నటిస్తున్న ‘థామా’ మూవీ సాంగ్ చిత్రీకరణ‌పై రష్మిక ఓ ఆసక్తికర విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఆయుష్మాన్‌ ఖురానా (Ayushmann Khurrana), రష్మిక హీరో హీరోయిన్లుగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘థామా’ (Thamma). హారర్‌ కామెడీగా రూపొందిన ఈ సినిమాకి ఆదిత్యా సర్పోత్దార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మాడాక్ ఫిల్మ్స్ సమర్పణలో దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ అక్టోబరు 21న దీపావళి స్పెషల్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. ఈ క్రమంలో రీసెంట్‌గా ఈ మూవీ నుంచి వచ్చిన ‘తుమ్ మేరా నా హుయే’ పాట చిత్రీకరణకు సంబంధించిన బ్యాక్ స్టోరీని రష్మిక ఇన్‌స్టా వేదికగా తెలియజేసింది.

Also Read- 80s Stars Reunion: 80స్ స్టార్స్ రీయూనియన్‌ పార్టీలో ఉన్న సెలబ్రిటీలు వీరే..

మూడు నుంచి నాలుగు రోజుల్లోనే

రష్మిక మందన్నా హాట్ ట్రీట్‌తో వచ్చిన ఈ పాట ఇంకా వైరల్ అవుతూనే ఉంది. ఈ పాట షూటింగ్‌ను అత్యంత అసాధారణమైన పరిస్థితుల్లో, కేవలం కొద్ది రోజుల్లోనే పూర్తి చేసినట్లుగా రష్మిక చెప్పుకొచ్చింది. ‘‘ఈ సినిమాకు సంబంధించి వేసిన సెట్‌లో దాదాపు 10 నుంచి 12 రోజుల పాటు చిత్రీకరణ జరిగింది. అయితే, షూటింగ్‌ చివరి రోజున, చిత్ర దర్శకనిర్మాతలకు ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఆ సెట్ లొకేషన్‌ చాలా అద్భుతంగా ఉంది. అందుకే ‘ఎందుకు ఇక్కడ ఒక పాట షూట్ చేయకూడదు’ అని వారు డిస్కషన్ చేసుకుని, పాట చిత్రీకరణ జరపాలని డిసైడ్ అయ్యారు. వారి ఊహించని నిర్ణయం నాకు కూడా ఉత్సాహాన్నిచ్చింది. కేవలం మూడు నుంచి నాలుగు రోజుల్లోనే ఆ పాట చిత్రీకరణకు సంబంధించిన ఏర్పాట్లు అన్నింటినీ పూర్తి చేసి, షూటింగ్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముగించాం. చివరికి, తెరపై పాట చూసినప్పుడు మేమంతా అవాక్కయ్యేంత గొప్పగా వచ్చింది’’ అని రష్మిక ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.

Also Read- Mandaadi: సుహాస్ ‘మందాడి’ మూవీ షూటింగ్‌లో ప్రమాదం.. భారీగా నష్టం!

మీ కష్టంతోనే సాధ్యమైంది

ఈ పాట చిత్రీకరణ ఇంత తక్కువ సమయంలో, ఇంత అద్భుతంగా సాగడానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. డ్యాన్స్ డిపార్ట్‌మెంట్, కాస్ట్యూమ్ డిపార్ట్‌మెంట్, సెట్ వర్కర్లు, లైట్స్ డిపార్ట్‌మెంట్, డైరెక్షన్, ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్ సభ్యులందరి కష్టమే ఈ విజయం వెనుక ఉందని రష్మిక వారిని ప్రత్యేకంగా అభినందించారు. ‘ఈ పాట మీ కష్టంతోనే సాధ్యమైంది’ అని తెలుపుతూ, ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆ పాటలోని పాత్రలను ‘తడక, అలోక్’గా ఆమె పరిచయం చేశారు. ఈ పాటను ప్రేక్షకులు ఆస్వాదించి, మనసుతో అనుభూతి చెంది, డ్యాన్స్‌ చేస్తూ ఎంజాయ్ చేస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఈ విషయం చెబుతూ ఆమె షేర్ చేసిన ఫొటోలు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇందులో అంత హాట్‌గా కనిపించి, నెటిజన్ల మతిపోగొడుతున్నారు.

">

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..

Sree Vishnu: శాకాహార ప్రియులందరికీ హీరో శ్రీ విష్ణు సజెషన్ ఇదే..

Crime News: జైలు నుంచి ఇటీవలే విడుదల.. అంతలోనే చంపేశారు.. దారుణ ప్రతీకార హత్య

Bandla Ganesh: ‘మోగ్లీ 2025’పై బండ్ల గణేష్ రివ్యూ.. ‘వైల్డ్’ అర్థమే మార్చేశారు

Bondi Beach Attack: యూదులే టార్గెట్.. బోండీ బీచ్ ఉగ్రదాడిలో సంచలన నిజాలు వెలుగులోకి