Kantara Chapter 1
ఎంటర్‌టైన్మెంట్

Kantara Chapter 1: వేట మొదలైంది.. నాలుగు రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Kantara Chapter 1: కన్నడ సినీ పరిశ్రమ స్థాయిని పెంచిన చిత్రాలలో ఒకటైన ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా వచ్చిన ‘కాంతార: ఎ లెజెండ్ – చాప్టర్ 1’ (Kantara: A Legend – Chapter 1) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 335 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ అద్భుతమైన మైలురాయిని చేరుకున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ (Hombale Films) అధికారికంగా పోస్టర్ విడుదల చేసి ప్రకటించింది. డివైన్ బ్లాక్‌బస్టర్‌గా ప్రేక్షకులు, సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ఈ పీరియడ్ మైథలాజికల్ డ్రామా.. దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ఏడు భాషల్లో (కన్నడ, హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, ఇంగ్లీష్) భారీ స్థాయిలో విడుదలైంది. తొలి భాగం ‘కాంతార’ (2022) సృష్టించిన సంచలనానికి మించిన అంచనాలతో వచ్చిన ఈ చిత్రం… ఆ అంచనాలను సునాయాసంగా అందుకుని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.

Also Read- Bad Boy Karthik Teaser: ‘బ్యాడ్ బాయ్’ కాదు.. అసలు మ్యాచ్ ఇప్పుడే మొదలైంది

రికార్డుల వేట ఇలా..

ట్రేడ్ నిపుణుల రిపోర్ట్స్ ప్రకారం, ‘కాంతార: చాప్టర్ 1’ (Kantara: Chapter 1) చిత్రం తొలి రోజునే ప్రపంచవ్యాప్తంగా రూ. 89 కోట్ల గ్రాస్ వసూలు చేసి, ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న చిత్రాలలో ఒకటిగా నిలిచింది. కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 235 కోట్ల క్లబ్‌లో చేరినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక నాల్గవ రోజు సండే కావడంతో.. సినిమా కలెక్షన్స్ మరింతగా ఊపందుకున్నాయి. మొత్తంగా ఈ సినిమా విడుదలై నాలుగు రోజులు ముగిసేసరికి రూ. 335 కోట్లకు పైగా వసూళ్లను సాధించడం… ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి లభిస్తున్న విశేష ఆదరణకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. నాలుగో రోజు ఒక్క భారతదేశంలోనే రూ. 61.5 కోట్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ సినిమాకు అసలు పరీక్ష ఈ సోమవారం నుంచి ఎదురు కానుంది. దసరాతో పాటు, మంచి వీకెండ్ లభించడంతో.. ఈ సినిమా కలెక్షన్ల సునామీకి తిరుగులేకుండా పోయింది. ఇప్పుడు వీక్ డేస్ ఈ సినిమా ఎలా థియేటర్లలో రన్ అవుతుందనే దానిపై ఈ చిత్ర సక్సెస్ ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read- Wedding: ఇది ఆరంభం మాత్రమే సోదరా.. ముందుంది ముసళ్ల పండగ.. పెళ్ళికి రూ.15 లక్షలు ఉండాల్సిందేనా.. వీడియో వైరల్

అద్భుతమైన సినిమా

దైవిక అంశాలు, అద్భుతమైన విజువల్స్, రిషబ్ శెట్టి నటన, దర్శకత్వ ప్రతిభ, అలాగే అజనీష్ లోక్‌నాథ్ అందించిన పవర్ఫుల్ మ్యూజిక్ ఈ చిత్ర విజయానికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. ఈ సినిమా చూసిన వారంతా, సినిమాపై.. అలాగే రిషబ్ శెట్టిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ముందుగా ఎన్టీఆర్ ఈ సినిమాపై స్పందించగా, సుకుమార్, అనుపమ్ ఖేర్ వంటివారు ‘అద్భుతమైన సినిమా’గా వర్ణిస్తున్నారు. మరీ ముఖ్యంగా నాలుగు రోజుల్లోనే ఈ సినిమా రూ. 300 కోట్ల‌కు పైగా కలెక్షన్స్ సాధించడం అంటే మాములు విషయం కాదు. చూద్దాం.. ముందు ముందు ఈ సినిమా ఇంకెన్ని రికార్డులను కొల్లగొడుతుందో..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?