The Raja Saab Trailer: రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) నటిస్తున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘ది రాజా సాబ్’ (The Raja Saab). ఈ చిత్రాన్ని హారర్ కామెడీ జానర్‌లో ఎవర్ గ్రీన్ మూవీగా దర్శకుడి మారుతి (Director Maruthi) తెరకెక్కించారు. భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో అన్ కాంప్రమైజ్డ్‌గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) నిర్మాతలైన టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైంది. సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసేలా తాజాగా మేకర్స్ ‘ట్రైలర్ 2.ఓ’ను విడుదల చేశారు. వాస్తవానికి ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్.. ప్రేక్షకులకే కాదు అభిమానులకు కూడా అంతగా నచ్చలేదు. కానీ, ఈ ట్రైలర్‌తో అందరి అనుమానాలను తీర్చేశారు మారుతి. ఈ ట్రైలర్ తర్వాత ఈ సినిమా చూడాలనే ఆసక్తి రెట్టింపు అవుతుందంటే.. ఏ రేంజ్‌లో ఈ ట్రైలర్‌ని కట్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ట్రైలర్‌ని గమనిస్తే..
Also Read- Director Maruthi: మొన్న అన్ని నీతులు చెప్పావ్.. ఇదేంటి మారుతి?
గూజ్‌బంప్స్ తెప్పించారు
ఇందులో ప్రభాస్ నాలుగైదు వేరియేషన్స్‌లో కనిపిస్తాడనేది ఈ ట్రైలర్ తెలియజేస్తుంది. జరీనా వాహబ్, సంజయ్ దత్‌ల పాత్రలను ఇప్పటి వరకు అంతగా రివీల్ చేయలేదు. కానీ ఈ ట్రైలర్‌లో వారి పాత్రలే మెయిన్ హైలెట్ అనేది తెలుస్తోంది. ‘నానమ్మ.. ఈ ప్రపంచంలో అన్నీ మరిచిపోయే రోగం ఉన్నా.. ఆయనని మాత్రం అస్సలు మరిచిపోలేవు’ అంటూ ప్రభాస్ డైలాగ్‌తో ఈ ట్రైలర్ మొదలైంది. నానమ్మగా జరీనా వాహబ్‌ని చాలా చక్కగా చూపించారు. గంగమ్మ అని సంజయ్ దత్ పాత్ర పిలవడం, ప్రభాస్ మన టైమ్ స్టార్టయిందని చెప్పడం చూస్తుంటే.. ఇందులో మారుతి అద్భుతమైన కథని చెప్పబోతున్నారనే ఫీల్ కలుగుతోంది. అలాగే రాజా సాబ్ అని గంగమ్మ పలికిన తీరుతో టైటిల్‌కు ఫుల్ జస్టిఫికేషన్ ఇచ్చేశారు. ఆ తర్వాత సంజయ్ దత్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ… నిన్ను చాలా మిస్సవుతున్నా.. అని చెప్పే డైలాగ్, సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచేస్తోంది. ఇక ఆ డైలాగ్ తర్వాత సంజయ్ దత్‌ని చూపించిన తీరుకి అందరికీ గూజ్‌బంప్స్ రావడం పక్కా. అద్భుతమైన గ్రాఫిక్స్‌తో ‘మిస్ యు టూ రాజా సాబ్’ అని సంజయ్ దత్ పాత్ర చెబుతుంటే.. ఎప్పుడెప్పుడు థియేటర్‌లో ఈ సినిమా చూస్తామా? అనే క్యూరియాసిటీ కలుగుతుంది.
Also Read- Thalapathy Vijay: సినిమాలకు గుడ్‌బై.. అధికారికంగా ప్రకటించిన దళపతి విజయ్
ట్రైలర్ హైలెట్ ఇదే..
మయసభ లాంటి ఇంటిని చూపించి, ఇక్కడకు రావడమే కానీ, వెళ్లాలంటే మీ తాత సంతకం కావాలని చెప్పడం, ఆ తర్వాత వచ్చే సీన్ వావ్ అనిపించేలా ఉన్నాయి. ఆ ఇంటి గురించి బొమాన్ ఇరానీ చెప్పే విధానం, తాత వచ్చాడయ్యా అని ప్రభాస్ చెప్పిన తర్వాత మరోసారి సంజయ్ దత్‌ని చూపించి, బైరాగిని పరిచయం చేసిన తీరుకి ఫిదా అవ్వాల్సిందే. ఆ తర్వాత మరో ట్విస్ట్.. ప్రభాస్ నానమ్మ ఎవరో, ఆమె వృత్తాంతం ఏంటో పరిచయం చేశారు. అంతే, ఆ తర్వాత అభిమానులకు ఫుల్ ఫీస్ట్ ఇచ్చేలా యాక్షన్‌లోకి తీసుకెళ్లారు. మొసలి ఫైట్, ప్రభాస్ మ్యానరిజం అన్నీ కూడా అభిమానులకు ట్రైలర్‌తోనే పండగ వాతావరణం నింపాయంటే అస్సలు అతిశయోక్తి కానే కాదు. ముగ్గురు హీరోయిన్లతో రొమాంటిక్ సీన్స్‌ని సరదాగా పరిచయం చేసి, ఆ వెంటనే మళ్లీ గూస్‌బంప్స్ తెప్పించే విజువల్స్‌తో, ప్రభాస్‌లోని మరో కోణాన్ని చూపించారు. ‘ఇక్కడి నుంచి నీ కాలు కదలాలంటే’ అని సంజయ్ దత్ అనగానే.. ‘అయితే ఏందిరిప్పుడు?’ అని ప్రభాస్ పలికిన డైలాగ్.. ఈ ట్రైలర్‌కే హైలెట్ అని చెప్పొచ్చు. ఇక ట్రైలర్ చివరిలో ఇచ్చిన ట్విస్ట్ అయితే వేరే లెవల్. మొత్తంగా అయితే, ఇది కదా కావాల్సింది అనేలా.. ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఊగిపోయే కంటెంట్‌తో ఈ ట్రైలర్‌ని దింపారు. ఇక ఈ ట్రైలర్ తర్వాత ‘ది రాజా సాబ్’ టికెట్స్ ఓ రేంజ్‌లో తెగడం మాత్రం తధ్యం..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

