The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి (Director Maruthi), టాలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న క్రేజీ మూవీ ‘ది రాజా సాబ్’ (The Raja Saab). ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్ సాంగ్‌పై ఎటువంటి కామెంట్స్ పడ్డాయో తెలియంది కాదు. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు థమన్‌ను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ కూడా చేశారు. ఆ సాంగ్ వారిని మెప్పించలేకపోయింది. అందుకే ఇప్పుడు రెండో సాంగ్ వదిలి, వారి కోపాన్ని చల్లార్చాలని మేకర్స్ భావించారు. అందులో భాగంగా సెకండ్ సింగిల్ ‘సహన సహన..’ అప్డేట్‌ను వదిలారు. ఈ బ్యూటిఫుల్ మెలొడీ సాంగ్ ప్రోమోను కూడా ఆదివారం మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రోమో (Sahana Sahana Promo) మాత్రం ప్రభాస్ అభిమానులు విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీంతో రెండో సాంగ్‌పై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి.
Also Read- Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది
‘సహన సహన..’ ప్రోమో ఎలా ఉందంటే..
‘సహన సహన..’ ఫుల్ లిరికల్ సాంగ్‌ను డిసెంబర్ 17న సాయంత్రం 6.35 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రోమో వీడియోలో మేకర్స్ తెలియజేశారు. ‘సహన సహన..’ సాంగ్‌లో ప్రభాస్ కలర్ ఫుల్ ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్‌తో ఆల్ట్రా స్టైలిష్ వైబ్ క్రియేట్ చేస్తున్నారు. ఈ సాంగ్‌ను మ్యూజిక్ సెన్సేషన్ థమన్ తన కెరీర్ బెస్ట్ మెలొడీగా కంపోజ్ చేశారని చెప్పొచ్చు. ప్రభాస్, నిధి అగర్వాల్‌లపై చిత్రీకరించిన ఈ పాటను స్టన్నింగ్ లొకేషన్స్‌లో చిత్రీకరించినట్లుగా ఈ ప్రోమో తెలియజేస్తుంది. ప్రస్తుతానికైతే ప్రభాస్ ఫ్యాన్స్ ఈ ప్రోమోతో చాలా హ్యాపీగానే ఉన్నారు. ఫుల్ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ పాటతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరుతాయని మేకర్స్ కూడా నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Also Read- Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!
సంక్రాంతి సందడిని తెచ్చే ‘రాజా సాబ్’
సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న ‘ది రాజా సాబ్’ సినిమాను వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకురాబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. హారర్ కామెడీ జానర్‌లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా ‘ది రాజా సాబ్’ను చిత్రాన్ని దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్నట్లుగా నిర్మాతలు చెబుతున్నారు. ఈ సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో అన్ కాంప్రమైజ్డ్‌గా నిర్మాణం జరుపుకుంటోంది. నిర్మాత టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఖర్చు విషయంలో వెనుకాడకుండా ఈ సినిమాతో ప్రేక్షకులకు అద్భుతమైన ట్రీట్ ఇచ్చేందుకు రెడీ చేస్తున్నారు. ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు వరల్డ్ వైడ్ ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలియంది కాదు. చూద్దాం.. ఆ ఎదురు చూపులకు తగిన ఫలితం వస్తుందో.. లేదో..!
#SahanaSahanaPromo 💕 IS HERE 🎛️♥️
See you Guys On 17 th 📈🎙️ pic.twitter.com/XJ4OHHeGqt
— thaman S (@MusicThaman) December 14, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

