RajaSaab Boxoffice: ‘ది రాజాసాబ్’ నాలుగు రోజుల గ్రాస్ ఎంతంటే?
the-rajasab-4-th-days-grass
ఎంటర్‌టైన్‌మెంట్

RajaSaab Boxoffice: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ నాలుగు రోజుల గ్రాస్ అదరగొట్టాడుగా.. మొత్తం ఎంతంటే?

RajaSaab Boxoffice: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ది రాజాసాబ్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఎకంగా నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాస్ రూ.201 కోట్లు దాటేసింది. తాజాగా ఈ కలెక్షన్లకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు నిర్మాతలు. అందులో వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.201 కోట్లు వసూలు చేసినట్లుగా ప్రకటించారు. దీంతో ప్రభాస్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మొదట ఈ సినిమాకు మిక్సుడ్ టాక్ వచ్చినా లాంగ్ రన్ లో సినిమా మంచి కలెక్షన్లు వసూలు చేస్తుందని దర్శకుడు థ్యాక్స్ మీట్ లో చెప్పుకొచ్చారు. అన్నట్లు గానే ఈ సినిమా లాంగ్ రన్ లో మంచి వసూళ్లు రాబట్టేటట్లు కనిపిస్తుంది. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అవ్వడంతో నార్త్ కలెక్షన్లు కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. అయితే రానున్న రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని కలెక్షన్లు వసూళ్లు చేస్తుందో చూడాలి మరి.

Read also-Ram Charan: మెగాస్టార్ సినిమా చూసిన రామ్ చరణ్ ఏం అన్నారంటే?.. ఇది హైలెట్..

‘ది రాజాసాబ్’ సినిమా సక్సెస్‌లో ప్రభాస్ సరికొత్త మేకోవర్, వింటేజ్ లుక్ ప్రధాన పాత్ర పోషించాయి. ‘బాహుబలి’ తర్వాత వరుసగా భారీ యాక్షన్ సినిమాల్లో కనిపిస్తూ వచ్చిన ప్రభాస్, చాలా కాలం తర్వాత తనలోని అసలైన ఎనర్జీని, కామెడీ టైమింగ్‌ను ‘రాజాసాబ్’ ద్వారా బయటపెట్టారు. మారుతి మార్క్ వినోదం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మరియు ఎస్.ఎస్. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను థియేటర్లలోకి రప్పిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా డాలర్ల వర్షం కురిపిస్తోంది. అమెరికాలో ఇప్పటికే ఈ చిత్రం మిలియన్ డాలర్ల క్లబ్‌ను దాటేసి దిగ్విజయంగా దూసుకుపోతోంది. ఈ భారీ వసూళ్లతో ప్రభాస్ వరుసగా తన సినిమాలతో రూ.100 కోట్ల మార్కును అతి తక్కువ సమయంలోనే దాటుతున్న రికార్డును సుస్థిరం చేసుకున్నారు.

Read also-Anaganaga Oka Raju: నవీన్ పొలిశెట్టి సినిమా టికెట్ ధరల పెంపుపై.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!

సినిమా మంచి టాక్ తెచ్చుకున్న సందర్భంగా మూవీ టీం థ్యాక్స్ మీట్ నిర్వహించింది. ఈ మీట్ లో దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. సినిమా అభిమానులకు నచ్చింది అని నేను అనుకోను, అసలు నచ్చలేదు అని కూడా అనుకోను ఎందుకంటే.. సినిమా డిఫరెంట్ జోనర్ లో తీయడం వల్ల కొంత మందికి అర్థం అయిఉండదు. అందుకే అలాంటి మాటలు వస్తున్నాయి. అర్థం చేసుకుంటే.. సినిమా చాలా బాగుంటుంది. ఈ సినిమా ఒక రోజులు ప్రక్షకులకు ఎక్కేది కాదు కొంచెం టైం అడుతోంది. పది రోజుల తర్వాత చూడండి సినిమా అందరికీ నచ్చుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ సినిమా చాలా నచ్చుతుంది, అంటూ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఈ సినిమా కొంత మందికి అసలు అర్థం కాలేదని అందుకు చాలా నెగిటివ్ గా మాట్లాడుతున్నారని, సినిమా చూసి చాలా మంది నాకు కాల్ చేసి చాలా బాగుందని చెప్పారన్నారు. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ది రాజాసాబ్’ మొదటి రోజు రూ.112 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. ప్రభాస్ ముసలి పాత్రకు సంబంధించిన ఓ ఫైట్ యాడ్ చేయడంతో సినిమాపై పాజిటివిటీ మరింత పెరిగింది.

Just In

01

SBI ATM charges: పెరిగిన ఎస్‌బీఐ ఏటీఎం ఛార్జీలు.. ఎంత పెరిగాయంటే?, పూర్తివివరాలివే

Vegetable Farming: మహబూబాబాద్ జిల్లాలో పెరుగుతున్న కూరగాయల సాగు విస్తీర్ణం.. అధికంగా పండించే పంట ఇదే..?

Samyuktha Menon: బీటెక్ చేయకపోవడం అదృష్టం అంటున్న సంయుక్తా మీనన్.. ఎందుకంటే?

Macha Bollaram: రైల్వే బ్రిడ్జ్ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో రసాభాస.. స్టేజ్‌పైనే ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే వర్గాలమధ్య ఘర్షణ..!

Mahesh Kumar Goud: శ్రీరాముడు బీజేపీలో సభ్యత్వం తీసుకున్నారా?: టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్