Ram Charan: తరచుగా కొడుకు విజయాన్ని చూసి తండ్రులు తెగ సంబర పడుతుంటారు. అయితే తండ్రి విజయం చూసిన రామ్ చరణ్ దీనిని మాటల్లో వర్ణించలేకపోతున్నారు. మెగాస్టార్ హీరోగా అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా థియేటర్ల వద్ద దూసుకుపోతుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులనుంచి మంచి స్పందన రాబడుతోంది. తాజాగా మెగాస్టార్ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఏఎమ్ బీ సినిమాస్ లో వరణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, బుచ్చిబాబులతో కలిసి వీక్షించారు. అనంతరం దర్శక నిర్మాతలను అక్కడే ఆయన్ను కలిశారు. అదే సందర్భంలో సినిమా గురించి రామ్ చరణ్ చెబుతూ.. ఈ సంక్రాంతికి అదిరిపోయే సినిమా అందించావంటూ అనిల్ రావిపూడిని పొగడ్తలతో ముంచెత్తారు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో పాటు సినిమా చూసిన ఉపాసన ఇది మెగా సంక్రాంతి మామయ్యా అందటూ తన రివ్యూను సోషల మీడియా ద్వరా పంచుకున్నారు.
Read also-Chiranjeevi Records: ‘మన శంకరవరప్రసాద్ గారు’ మొదటి రోజు కలెక్షన్లు ఇరగదీశారుగా.. ఎంతంటే?
ఇప్పటికే ఈ సినిమా రికార్బ కలెక్షన్లతో దూసుకుపోతుంది. మెగాస్టార్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తోంది. మొదటి రోజు ప్రీమియర్లతో కలిపి మొత్తం రూ.84 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు వచ్చిన సినిమాగా సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ విషయాన్ని సినిమా నిర్మాణ సంస్థ ‘షైన్ స్క్రీన్స్’ అధికారికంగా ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా అందుకు తగ్గట్లుగా భారీ వసూళ్లు కూడా రాబడుతోంది. దీంతో నిర్మాతల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఈ చిత్రం ప్రీమియర్స్ మొదటి రోజు కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా రూ.84 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేసింది. ఈ స్థాయి వసూళ్లు రావడం టాలీవుడ్‌లో ఒక అరుదైన ఫీట్‌గా నిలిచింది.
It’s a MEGA SANKRANTHI
hearty congratulations
Mamaya @KChiruTweets @NayantharaU @sushkonidela
❤️❤️❤️❤️❤️🧿🙌 pic.twitter.com/xFhxbcV8Sc— Upasana Konidela (@upasanakonidela) January 12, 2026
Read also-People Media Factory: ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’పై మెగా దెబ్బ.. మొన్న పవన్, ఇప్పుడు చిరు!
తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా రికార్డులను తిరగరాసింది. దాదాపు అన్ని సెంటర్లలో ‘ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనింగ్స్’ సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రానికి ఉన్న క్రేజ, పాజిటివ్ టాక్ కారణంగా రెండో రోజు కూడా థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. షైన్ స్క్రీన్స్ తమ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని షేర్ చేస్తూ, “మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ బద్దలుకొట్టేసారు” అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కేవలం ఒకే రోజులో రూ. 84 కోట్లు దాటడం చూస్తుంటే, లాంగ్ రన్ లో ఈ సినిమా మరిన్ని బెంచ్ మార్క్ రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమనిపిస్తోంది. మొత్తం మీద ‘మన శంకరవరప్రసాద్ గారు’ తన పవర్ ఫుల్ ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ వద్ద నిజమైన ‘సంక్రాంతి’ ముందే తెచ్చారని అభిమానులు సంబరపడుతున్నారు.
Mega Power Star #RamCharan watched #ManaShankaraVaraPrasadGaru and applauded Hit Machine #AnilRavipudi for showcasing Megastar #Chiranjeevi at his absolute best.🔥🔥🔥 #RamCharan𓃵 #MegaBlockbusterMSG #MSG #MSGonJan12th #chiranjeevikonidela #nayanthara #VenkateshDaggubati… pic.twitter.com/lSiqes07xm
— BIG TV Cinema (@BigtvCinema) January 13, 2026

