RajaSaab Collections: ‘ది రాజాసాబ్’ మూడురోజుల గ్రాస్ ఎంతంటే?
the-rajasab-collectioms
ఎంటర్‌టైన్‌మెంట్

RajaSaab Collections: ప్రభాస్‘ది రాజాసాబ్’ మూడురోజుల గ్రాస్ కలెక్షన్లు ఎంతంటే?..

RajaSaab Collections: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపొందిన భారీ హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘ది రాజాసాబ్’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ చిత్రం విడుదలైన మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో వసూళ్ల సునామీ మొదలైంది. తాజాగా ఈ సినిమా సాధించిన రికార్డు వసూళ్లపై చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.183 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి, ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినాను మరోసారి చాటిచెప్పింది. ఒక హారర్ కామెడీ జోనర్ సినిమా ఈ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టడం భారతీయ సినీ చరిత్రలో అరుదైన విషయమని, ముఖ్యంగా ప్రభాస్ క్రేజ్ వల్లనే ఇది సాధ్యమైందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read also-Parasakthi Controversy: విజయ్ ఫ్యాన్స్‌పై ఫైర్ అవుతున్న ‘పరాశక్తి’ సినిమా నిర్మాత.. ఎందుకుంటే?

సినిమా సక్సెస్‌లో ప్రభాస్ సరికొత్త మేకోవర్, వింటేజ్ లుక్ ప్రధాన పాత్ర పోషించాయి. ‘బాహుబలి’ తర్వాత వరుసగా భారీ యాక్షన్ సినిమాల్లో కనిపిస్తూ వచ్చిన ప్రభాస్, చాలా కాలం తర్వాత తనలోని అసలైన ఎనర్జీని, కామెడీ టైమింగ్‌ను ‘రాజాసాబ్’ ద్వారా బయటపెట్టారు. మారుతి మార్క్ వినోదం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మరియు ఎస్.ఎస్. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను థియేటర్లలోకి రప్పిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా డాలర్ల వర్షం కురిపిస్తోంది. అమెరికాలో ఇప్పటికే ఈ చిత్రం మిలియన్ డాలర్ల క్లబ్‌ను దాటేసి దిగ్విజయంగా దూసుకుపోతోంది. ఈ భారీ వసూళ్లతో ప్రభాస్ వరుసగా తన సినిమాలతో రూ.100 కోట్ల మార్కును అతి తక్కువ సమయంలోనే దాటుతున్న రికార్డును సుస్థిరం చేసుకున్నారు.

Read also-MSG Movie Review: సంక్రాంతికి వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ ప్రేక్షకులను నవ్వించారా?.. ఫుల్ రివ్యూ..

రానున్న రోజుల్లో కూడా ‘ది రాజాసాబ్’ జోరు ఇలాగే కొనసాగేలా కనిపిస్తోంది. సోమవారం నుంచి కూడా థియేటర్ల వద్ద బుకింగ్స్ ఆశాజనకంగా ఉండటం, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా పట్ల ఆసక్తి చూపడం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. కేవలం మూడు రోజుల్లోనే రూ.183 కోట్లు సాధించిన ఈ చిత్రం, ఫుల్ రన్ ముగిసే సమయానికి రూ.400 నుంచి రూ.500 కోట్ల మార్కును కూడా సులభంగా అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉండటం, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ వంటి స్టార్ కాస్ట్ ఉండటం సినిమాపై మరింత హైప్‌ను పెంచింది. మొత్తానికి ప్రభాస్ ఖాతాలో మరో భారీ కమర్షియల్ సక్సెస్ చేరినట్టేనని సినీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Just In

01

Veerabhadra Swamy Temple: కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు పూర్తయిన ఏర్పాట్లు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

Case filed On Tv Channel: మహిళా ఐఏఎస్‌పై ఆరోపణల వ్యవహారంలో కీలక పరిణామం.. ఓ ఛానల్, ట్విట్టర్ పేజీపై ఎఫ్ఐఆర్!

Huzurabad: విద్యార్థులు స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకోవాలి : ఏబీవీపీ నేత గోస్కుల అజయ్!

Chiranjeevi Comeback: మెగాస్టార్ సినిమా చూసి ఎమోషనల్ అవుతున్న సీనియర్ ఫ్యాన్స్.. ఏం చేశారంటే?

Black Jaggery: యథేచ్చగా నల్ల బెల్లం దందా.. పోలీసులు విధులు నిర్వహిస్తారా? భేరసారాలకు తావిస్తారా?