The Family Man S3 Trailer: రాజ్ అండ్ డీకే (Raj and DK) సృష్టి, మనోజ్ బాజ్‌పాయ్ (Manoj Bajpayee) నటన… ఈ కాంబినేషన్ అనగానే భారతీయ వెబ్ సిరీస్ అభిమానులకు ముందుగా గుర్తొచ్చే పేరు ‘ది ఫ్యామిలీ మ్యాన్’ (The Family Man). ఇప్పటికే రెండు సీజన్లతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ సిరీస్ మూడో సీజన్‌కు సిద్ధమైంది. తాజాగా ఈ సీజన్ 3 ట్రైలర్ (The Family Man Season 3 Trailer)ను విడుదల చేసి, ఈ సిరీస్‌పై అంచనాలను పెంచేశారు. ఈ ట్రైలర్‌ను చూస్తుంటే, శ్రీకాంత్ తివారీ (మనోజ్ బాజ్‌పాయ్) జీవితంలో ఈసారి ప్రమాదం, హాస్యం, కుటుంబ కలహాలు మరింత పెరిగాయనేది స్పష్టమవుతోంది. ఈ ట్రైలర్‌ను గమనిస్తే..
Also Read- Bigg Boss Telugu 9: వార్ ఫర్ పవర్.. మరోసారి టార్గెట్ తనూజ.. హౌస్ సపోర్ట్ ఎవరికి?
వాంటెడ్ క్రిమినల్
ఈ సీజన్‌లో కామెడీకి పెద్ద పీట వేసినట్లుగా అర్థమవుతోంది. స్టార్టింగ్ సీనే కామెడీతో స్టార్ట్ చేశారు. కొత్త ప్రమాదం, పెరిగిన సవాళ్లు ట్రైలర్ ప్రారంభంలో శ్రీకాంత్ తివారీ తన కుటుంబానికి తాను ఇప్పటికీ ‘ట్రావెల్ ఏజెంట్’ను కాదని, తానొక గూఢచారిని అని చెప్పే ప్రయత్నం చేయడం నవ్వు తెప్పిస్తుంది. కామెడీతో పాటు ఇందులో యాక్షన్, ఎమోషన్స్‌కు కూడా భారీగా స్థానం కల్పించారు. శ్రీకాంత్ తివారీపై ఏకంగా అరెస్ట్ వారెంట్ జారీ అవడం.. దాంతో అతను అధికారికంగా ‘వాంటెడ్ క్రిమినల్’గా మారడం చూస్తుంటే.. ఇందులో కావాల్సినంత డ్రామాను యాడ్ చేసినట్లుగా అర్థమవుతోంది. ఒక పెద్ద సంస్థ ఇందులో భాగమైందని, ఏదో పెద్ద గేమ్ నడుస్తోందని అధికారులు గుర్తించడంతో కథాంశం ఇంట్రెస్టింగ్‌గా మారింది. సీజన్ 3లో ప్రధాన ముప్పు ఈశాన్య భారతదేశం నుంచే వస్తుందని ట్రైలర్ తెలియజేస్తుంది. ఈ ప్రాంతంలో కార్యకలాపాలు సాగిస్తున్న ఒక పెద్ద డ్రగ్ స్మగ్లర్‌ను పట్టుకోవడానికి శ్రీకాంత్ బృందం రంగంలోకి దిగుతుంది. దీని వెనుక మొత్తం ‘సర్కస్’ను నడిపే అసలు సూత్రధారి ఎవరో కూడా ఇందులో చూపించారు.
Also Read- Rukmini Vasanth: ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు ఇలాంటి చిత్రం రాలేదు.. ‘టాక్సిక్’పై రుక్మిణి వసంత్!
మనోజ్ బాజ్‌పాయ్ నట విశ్వరూపం
ఈ మిషన్‌లో శ్రీకాంత్ తన కుటుంబాన్ని కూడా రిస్క్‌లో పెట్టాడనే విషయం.. ఆయన చెప్పిన ‘చాలా కాలం తర్వాత నాకిప్పుడు నిజంగా భయమేస్తోంది’ అనే డైలాగ్‌తో అర్థమవుతోంది. ఆయనలో ఏర్పడిన ఈ సంఘర్షణను చూస్తుంటే.. ఈసారి ముప్పు ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది. శ్రీకాంత్-జేకేల మధ్య హాస్యం మామూలుగా లేదు! ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌కు హాస్యాన్ని శ్రీకాంత్, జేకే (జయదీప్ అహ్లావత్) పాత్రల మధ్య చక్కగా నడిపించారు. జేకే తన డేటింగ్ వ్యవహారాలు ఇప్పుడే కొంచెం కుదుటపడే సమయంలో మిషన్ కారణంగా అన్నీ ఆగిపోయాయని చింతిస్తుంటాడు. ‘సింగిల్‌గా బతకడం, సింగిల్‌గా చావడం కంటే పెద్ద శాపం జీవితంలో లేదు’ అని జేకే చెప్పే డైలాగ్‌కు శ్రీకాంత్ ఇచ్చే కౌంటర్, ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని ట్రైలర్ హామీ ఇస్తుంది. మొత్తంగా అయితే.. ఈ సీజన్ 3లో మనోజ్ బాజ్‌పాయ్ నట విశ్వరూపం చూపించారని చెప్పుకోవచ్చు. యాక్షన్, థ్రిల్, కుటుంబ విలువలు, హాస్యం కలగలిసిన ఈ సీజన్ మరో బ్లాక్‌బస్టర్ అవుతుందని ట్రైలర్ హింట్ ఇచ్చేస్తుంది. ప్రైమ్ వీడియోలో నవంబర్ 21 నుంచి ఈ సీజన్ స్ట్రీమింగ్ కానుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
