The Black Gold Samyuktha (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

The Black Gold: యాక్షన్ మోడ్‌లో సంయుక్త.. ‘ది బ్లాక్ గోల్డ్’ ఫస్ట్ లుక్ అదిరింది

The Black Gold: సంయుక్తా మీనన్ అలియాస్ సంయుక్త (Samyuktha).. టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా దూసుకెళుతోంది. సినిమాల విషయంలో కాస్త స్లోగా వెళుతున్నా, సక్సెస్ పరంగా మాత్రం ఈ అమ్మడి పేరు బాగానే వినబడుతోంది. ఇప్పటి వరకు హీరోల సరసన హీరోయిన్‌గా నటించిన సంయుక్త.. ఇప్పుడు ట్రెండ్ మార్చింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఆమెకు ఓ బంపరాఫర్ కూడా తగిలింది. ఒకవైపు హీరోల సరసన నటిస్తూనే.. మరోవైపు తన ఫస్ట్ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్‌ను యోగేష్ కెఎంసి (Yogesh KMC) దర్శకత్వంలో చేయబోతుంది. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’, తాజాగా వచ్చిన ‘కె-ర్యాంప్’ వంటి చిత్రాలను నిర్మించిన నిర్మాత రాజేష్ దండా (Razesh Danda) నిర్మిస్తున్నారు. హాస్య మూవీస్, మాగంటి పిక్చర్స్‌తో కలిసి చేస్తున్న ఆరవ సినిమా ఇది. సింధు మాగంటి సహ నిర్మాత. ‘ది బ్లాక్ గోల్డ్’ (The Black Gold) అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను దీపావళిని పురస్కరించుకుని మేకర్స్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్‌ని గమనిస్తే..

Also Read- Anaganaga Oka Raju: పటాకాయల షాప్‌లో పట్టు చీరలు దొరుకుతాయా.. ‘అనగనగా ఒక రాజు’ దీవాళి బ్లాస్ట్!

రైల్వే స్టేషన్‌లో రక్తపాతం

ఇందులో ఇంటెన్స్ యాక్షన్ మోడ్‌లో సంయుక్త కనిపిస్తున్నారు. రైల్వే స్టేషన్‌లో యుద్ధకాండను తలిపించే యాక్షన్‌తో సంయుక్త హీరోయిక్ లుక్‌లో కనిపించి, సినిమాపై అమాంతం అంచనాలను పెంచేశారు. ఇప్పటి వరకు ఆమెను ఈ తరహా పాత్రలో చూడలేదు. భారీ ఆకారంతో ఉన్న విలన్లను మట్టుపెట్టి.. స్టేషన్‌లో రక్తపాతం సృష్టించింది. అంతేకాదు, బ్యాక్‌గ్రౌండర్ ఓ వ్యక్తి బోర్డు పట్టుకుని వేలాడుతున్న తీరు చూస్తుంటే.. ఇందులో యాక్షన్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా అయితే, సంయుక్త ఫస్ట్ ప్రయత్నంలోనే అందరినీ తనవైపుకు ఆకర్షించుకునేలా చేసిందని చెప్పుకోవచ్చు. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అలాగే ఈ చిత్ర టైటిల్‌ని డిజైన్ చేసిన తీరు కూడా ఇంట్రస్టింగ్‌గా ఉంది. ఆమె ఈ పోస్టర్‌లో కనబడుతున్న తీరు చూస్తుంటే.. ఇందులో అద్భుతమైన స్టంట్స్ చేసినట్లుగా ఫిక్సయిపోవచ్చు.

Also Read- Kantara Chapter 1: ‘కాంతార: చాప్టర్ 1’ మూవీ 18 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే?

డైనమిక్ పాత్రలో

సంయుక్త డైనమిక్ పాత్రలో కనిపించనున్న ఈ చిత్రాన్ని థ్రిల్లర్ జానర్‌కి కొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తూ, ప్రేక్షకులకు దర్శకుడు యోగేష్ కెఎంసి థ్రిల్ ఇవ్వబోతున్నాడని మేకర్స్ చెబుతున్నారు. సంయుక్త స్వయంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటం చూస్తుంటే.. ఈ సినిమా కంటెంట్‌పై ఆమె ఎంత నమ్మకంగా ఉందో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుపుకుంటోంది. ‘ది బ్లాక్ గోల్డ్’ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కాకుండా ‘అఖండ 2: తాండవం’, ‘స్వయంభూ’, ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి చిత్రాలలో సంయుక్త నటిస్తోంది. వీటిలో ఏ రెండు సినిమాలు హిట్టైనా, సంయుక్త సక్సెస్ రేట్ మరింత పెరుగుతుందనడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు.

">

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది