Om Shanti Shanti shantihi Stills
ఎంటర్‌టైన్మెంట్

Tharun Bhascker: ఈషా రెబ్బాతో తరుణ్ భాస్కర్.. రూరల్ పాత్రల్లో! టైటిల్ ఏంటంటే?

Tharun Bhascker: డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ ఇప్పటికే పలు సినిమాలలో నటించారు. ఇప్పుడాయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఆయన హీరోగా, ఈషా రెబ్బా హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’ (Om Shanti Shanti Shantihi). తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్‌ని మేకర్స్ వదిలారు. ఈ సినిమాను ఆగస్ట్ 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లుగా మూవీ టీమ్ అధికారికంగా ప్రకటిస్తూ.. రెండు స్టిల్స్‌ని విడుదల చేసింది. ఈ స్టిల్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Also Read- Sigachi Pharma Company: సిగాచి పరిశ్రమ అధికారులపై నో యాక్షన్.. విమర్శల్లో ప్రభుత్వం

ఈ క్రేజీ కాంబినేషన్లో రూరల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాకు నూతన దర్శకుడు ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహిస్తున్నారు. సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు కలిసి ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇది ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ జాయింట్ ప్రొడక్షన్‌లో రూపుదిద్దుకుంటోంది. షూటింగ్ ఇప్పటికే పూర్తవడంతో నిర్మాతలు ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టారు. 2D యానిమేషన్ స్టయిల్‌లో ప్రజెంట్ చేసిన కాన్సెప్ట్ వీడియోతో పాటు.. ఆకట్టుకునే టైటిల్ పోస్టర్‌ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు.

Also Read- Google Map: గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా నమ్మితే కొంప కొల్లేరే.. ఇది తెలిశాక జన్మలో జోలికెళ్లరు!

ఈ కాన్సెప్ట్ వీడియోలో ఈషాను కొండవీటి ప్రశాంతి అనే పల్లెటూరి అమ్మాయిగా, తరుణ్‌ భాస్కర్‌ను వ్యాన్ యజమాని అంబటి ఓంకార్ నాయుడుగా పరిచయం చేశారు. వారి పెళ్లి తర్వాత కథ ఎలా మలుపు తిరుగుతుంది? ఇద్దరి మధ్య వాగ్వాదాలు ఎందుకు వచ్చాయి? పందెంకోళ్లు తలపించేలా మొదలైన వారి గొడవలు ఎలా సర్దుమణిగాయి? అనే అంశాలతో కథ సాగుతున్నట్టు అనిపిస్తుంది. ‘ఓం శాంతి శాంతి శాంతిః’ అనే టైటిల్ విజువల్స్‌ వారి మధ్య జరుగుతున్న గొడవలకు ఫన్ యాడ్ చేసింది. జై క్రిష్ అందించిన మ్యూజిక్ పల్లెల్లో కనిపించే వాతావరణాన్ని మరింత ఆస్వాదించేలా చేసింది. దీపక్ యెరగర సినిమాటోగ్రఫీ పల్లె వాతావరణాన్ని కళ్లకు కట్టేలా చేసింది. ఈ చిత్రం హ్యుమర్, కల్చర్, రిలేషన్షిప్ డ్రామాతో రానుండటంతో సగటు ప్రేక్షకుడికి మంచి వినోదం అందించనుంది. బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సురభి ప్రభావతి, గోపరాజు విజయ్, శివన్నారాయణ(అమృతం అప్పాజీ), బిందు చంద్రమౌళి, ధీరజ్ ఆత్రేయ, అన్ష్వీ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్న ఇతర తారాగణం. మలయాళంలో బ్లాక్ బస్టర్‌ హిట్ కొట్టిన ‘జయ జయ జయహే’ మూవీకి ఇది రీమేక్‌గా రాబోతుంది. బసెల్ జోసెఫ్, దర్శనా రాజేంద్రన్ జంటగా నటించిన ఈ మూవీ 2022లో విడుదలై సూపర్ హిట్ అందుకుంది. ఓటీటీలోనూ మంచి వ్యూస్ సంపాదించింది. మరోవైపు దర్శకుడిగా తరుణ్ భాస్కర్ ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ చేయబోతున్నట్లుగా ఇటీవల అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!