Sigachi Pharma Company (imagecredit:swetcha)
తెలంగాణ

Sigachi Pharma Company: సిగాచి పరిశ్రమ అధికారులపై నో యాక్షన్.. విమర్శల్లో ప్రభుత్వం

Sigachi Pharma Company: నిర్లక్ష్యం ఎవరిదైనా ఇప్పటివరకు సిగాచి పరిశ్రమలో జరిగిన భారీ ప్రమాదం పై ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పందించిన తీరు మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటన విషయంలో ప్రతిపక్షాలతో సహా అందరూ హర్షించారు. ప్రమాదానికి కారణాలు, అన్వేషణ కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు(Ramakrishna Rao) నేతృత్వంలో హైలెవల్ కమిటీ ఏర్పాటును అందరూ హర్షిస్తున్నారు. కానీ పరిశ్రమ యాజమాన్యంపై నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. కానీ కళ్ళ ముందు అధికారుల నిర్లక్ష్యం కనబడుతున్నా ప్రమాదం జరిగి 6 రోజులు గడుస్తున్నా సంబంధిత అధికారు పై ప్రభుత్వం యాక్షన్ తీసుకోక పోవడంపై విమర్శలు వెళ్ళు వెత్తుతున్నాయి. సిగాచి పరిశ్రమలో మూడు యూనిట్లు, ప్రొడక్షన్ ప్లాంట్, ప్యాకింగ్ సెక్షన్, క్వాలిటీ కంట్రోల్ సెక్షన్‌లు అన్ని ఒకే భవనంలో ఉండడం చేత ప్రమాదంలో భారీ ప్రాణనష్టం జరిగింది.

కార్మికుల శవాలు వంద మీటర్ల దూరం
ఒక షిఫ్ట్‌లో 150 మందికి పైగా ఈ పరిశ్రమలో పనిచేయడం, ప్రమాదం సంభవించిన ఘటనలో 40 మంది ప్రాణాలు కోల్పోవడం,12 మంది కార్మికుల ఆచూకీ లభించక పోవడం ప్రమాద తీవ్రతను తెలియజేస్తుంది.సిగాచి కెమికల్‌ పరిశ్రమలో జరిగిన పేలుడు ప్రమాదం దేశంలోనే దిగ్భ్రాంతి కలిగించింది. ఈ ఘటనతో పారిశ్రామిక ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పరిశ్రమలో జరిగిన పేలుడు మూలంగా భారీ ప్రమాదం సంభవించింది. మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఆ ప్రాంతమంతా కూడా భూకంపం(Earthquake) వచ్చినట్టుగా కనిపిస్తున్నది. కార్మికుల శవాలు వంద మీటర్ల దూరం ఎగిరిపడ్డాయి. ఇప్పటివరకు అధికారిక లెక్కల ప్రకారం 40 మంది మృతి చెందారు. మరో 34 మంది కార్మికులు వివిధ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.12 మంది కార్మికుల ఆచూకీ లభించలేదు. వీరిలో కొందర మృత్యువుతో పోరాడుతున్నారు. ఇంకా కొంత మంది శిథిలాల కింద చిక్కుకునే అవకాశం ఉన్నది.

శరీర భాగాలు బయటపడుతున్నాయి
ప్రమాదంలో చనిపోయిన కార్మికుల శవాలు కాలిపోయి గుర్తు పట్టలేని విధంగా మాంసం ముద్దలుగా పడి ఉన్నాయి. డిఎన్‌ఏ పరీక్షల ద్వారా శవాలను గుర్తించి కుటుంబాలకు అందించే ప్రక్రియ కొనసాగుతున్నది. వీరంతా బతుకుదెరువు కోసం బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, ఒరిస్సా, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుండి నుండి వచ్చిన వలస కార్మికులు. శిథిలాల నుండి బయటికితీస్తున్న కొద్దీ ఎముకలు, కాళ్లు, చేతుల శరీర భాగాలు బయటపడుతున్నాయి. ఈ ఈ దృశ్యాలు హృదయ విధారకంగా కనిపిస్తున్నాయి. కార్మికుల కుటుంబాలు మొత్తం దయనీస్థితిలో దుఃఖ సాగరంలో మునిగినవి. కానీ రెగ్యులర్‌గా పరిశ్రమలను తనిఖీలు చేయాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో పడి తూతూ మంత్రంగా వ్యవహరించడంతో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read: Actress Lavanya: లావణ్య మెడకు చుట్టుకున్న మరో వ్యవహారం.. ఫోన్ స్విచాఫ్

యంత్రంలో పడి నలిగిపోయి
రంగారెడ్డి(Ranga Reddy) జిల్లా కాటేదాన్‌ పారిశ్రామిక ప్రాంతంలోని తిరుపతి రబ్బర్‌ పరిశ్రమలో పెద్ద ఎత్తున ఆగ్ని ప్రమాదం(Fire hazard) చోటుచేసుకుంది. ఆ సమయంలో కార్మికులు విధుల్లో లేరు, కాబట్టి ప్రాణ నష్టం తప్పింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ ప్రాంతంలోని ముంగి పరిశ్రమలో కార్మికుడి చేయి ప్రమాదవశాత్తు యంత్రంలో పడి నలిగిపోయింది. వైద్యులు చెయ్యి కొంత భాగాన్ని తొలగించారు. తమిళనాడు రాష్ట్రంలోని శివకాశిలో పేలుడు సంభవించి ఐదుగురు కార్మి కులు ప్రాణాలు కోల్పోయారు. గతేడాది సంగారెడ్డి(Sanga Reddy) జిల్లా హత్నూర మండలంలో ఎస్‌.బి కెమికల్‌ పరిశ్రమలో రియాక్టర్‌ పేలిన ఘటనలో ఏడుగురు కార్మికులు చనిపోయారు. ఇలాంటి పారిశ్రామిక ప్రమాదాలు ప్రతిరోజు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. అనేకమంది మృతిచెందుతూనే ఉన్నారు. వందలాదిమంది క్షతగ్రాతులు అవుతూనే ఉన్నారు. వీరి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తీవ్ర మనోవేదనకు గురవుతున్నాయి.

ప్రమాదాల నివారణలో సర్కార్‌ వైఫల్యం
పరిశ్రమల నిర్వహణలో భద్రత, ఆరోగ్యం, పర్యావరణం లాంటి అంశాలను పరిరక్షించడానికి చట్టబద్ధంగా యజమానులు తీసుకోవాల్సిన చర్యల గురించి నిర్దేశించడానికి ఫ్యాక్టరీల చట్టం 1948 అమల్లో ఉన్నది. ఈ చట్టం అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది. ప్రత్యేకించి కేంద్ర, రాష్ట్ర కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రులు బాధ్యత వహించాలి. వీరి పర్యవేక్షణలో ఫ్యాక్టరీ డైరెక్టర్లు, డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఇన్‌స్పెక్టర్లు తదితర యంత్రాంగం ఉంటుంది. ఈ యంత్రాంగం వివిధ పరిశ్రమలను, ప్రమాదాలు జరగడానికి గల అవకాశాల రిస్క్‌ను బట్టి కేటగిరీలుగా విభజిస్తారు. కెమికల్‌ పరిశ్రమలు, ఫర్నేసులు, బాయిలర్స్‌, హైరీస్కు క్యాటగిరీలో ఉంటాయి. ఈ పరిశ్రమలను కార్మికుల సంఖ్యను బట్టి వివిధ స్థాయి అధికారులు తరచుగా తనిఖీలు చేయాలి. భద్రతాపరమైన అంశాల పట్ల రెగ్యులర్‌గా ఆడిట్‌ జరిపి ప్రమాదాలను పసిగట్టాలి. కార్మికులను, యాజమాన్యాలను అప్రమత్తం చేయాలి. ప్రమాణాలను పాటించని యాజ మాన్యాలపై చట్టపరంగా చర్య తీసుకోవాలి. కానీ ఇవేమీ అమలు చేయడం లేదు. కనీసం సంబంధిత అధికారుల పైన చర్యలు తీసుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది.

Also Read: Triple R Project: హైదరాబాద్ వాసులకు అదిరిపోయే శుభవార్త.. ప్రభుత్వం కీలక హామీ!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!