Akhanda 2: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ (Pawan Kalyan OG) సినిమాకు అందించిన సంగీతంతో కొణిదెల థమన్ అనిపించుకున్న మ్యూజిక్ సెన్సేషన్.. ఇప్పుడు నందమూరి థమన్ అనిపించుకునేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో నటసింహం బాలయ్య సినిమా కావడం, అంతకు ముందు వారిద్దరి కాంబోలో వచ్చి బంపర్ హిట్ అయిన ‘అఖండ’ (Akhanda)కు సీక్వెల్ కావడంతో.. థమన్ ఒకటి కాదు, రెండు కాదు.. రెడ్ బుల్స్ ఎక్కిస్తూనే ఉన్నాడనేలా.. వస్తున్న అప్డేట్స్‌ను చూస్తుంటే తెలుస్తుంది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ బొనాంజా ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2: Thandavam). ఇది వారి కాంబినేషన్‌లో వచ్చిన సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘అఖండ’కు సీక్వెల్ అనే విషయం తెలిసిందే. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ థమన్ నుంచి వచ్చింది. అదేంటంటే..
Also Read- Book My Show: ‘బాహుబలి ది ఎపిక్’తో మాస్ మహారాజాకు దెబ్బపడేలానే ఉందిగా..
గూస్‌బంప్స్ స్కోర్
‘అఖండ 2: తాండవం’కు సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా వచ్చిన బ్లాస్టింగ్ రోర్ గ్లింప్స్ కూడా పాన్ ఇండియా వైడ్‌గా సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు వచ్చిన అప్డేట్‌తో థమన్ ఈ సినిమాను ఏదో చేయబోతున్నాడనేలా టాక్ నడుస్తుందంటే.. ఆయన ఎంతగా వర్క్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్‌ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లే పనిలో ఉన్నాడీ సెన్సేషనల్ కంపోజర్. ఇటీవల సంస్కృత శ్లోకాలను అద్భుతంగా పఠించే నైపుణ్యం వున్న పండిట్ శ్రవణ్ మిశ్రా, పండిట్ అతుల్ మిశ్రా సోదరులను తీసుకుని వారితో గూస్‌బంప్స్ స్కోర్‌ని రికార్డ్ చేసిన థమన్.. ఇప్పుడు కొత్తగా సర్వేపల్లి సిస్టర్స్‌ని కూడా ఈ సినిమాకు యాడ్ చేయబోతున్నారు. అందుకు సంబంధించిన అఫీషియల్ సమాచారాన్ని కూడా ఆయన విడుదల చేశారు.
Also Read- Jaanvi Ghattamaneni: ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో వారసురాలు.. మహేష్‌కు ఏమవుతుందో తెలుసా?
సర్వేపల్లి సిస్టర్స్ ఎనర్జిటిక్ వోకల్స్
సర్వేపల్లి సిస్టర్స్ (Sarvepalli Sisters).. భారతదేశంలోని ప్రసిద్ధ కర్ణాటక సంగీతకారులైన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ‘అఖండ 2: తాండవం’ కోసం తమ డివైన్ వోకల్స్ అందించినట్లుగా థమన్ పేర్కొన్నారు. థమన్ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ పవర్ ఫుల్ స్కోర్‌లో సర్వేపల్లి సిస్టర్స్ ఎనర్జిటిక్ వోకల్స్‌తో నెక్స్ట్ లెవల్ స్కోర్ లోడ్ అవుతోందని చిత్రయూనిట్ కూడా ప్రకటించింది. మొత్తంగా చూస్తే.. థమన్ రూపంలో వస్తున్న అప్డేట్స్ మాత్రం ఈ సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తున్నాయి. థియేటర్ల వారు కూడా వారి సౌండ్ బాక్సులను మెరుగుపరుచుకునే పనిలో ఉన్నారు.. లేదంటే ‘అఖండ’కు ఏమైందో తెలుసుగా! సంయుక్త హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్న ఈ చిత్రాన్ని.. 5 డిసెంబర్, 2025న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
