Love You Raa Audio Launch
ఎంటర్‌టైన్మెంట్

Telugu New Film: రామ్ చరణ్ సాంగ్‌ లిరిక్‌తో మూవీ టైటిల్.. హీరో ఎవరంటే?

Telugu New Film: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన మొదటి చిత్రం ‘చిరుత’ (Chirutha). ఈ సినిమాలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. ఇప్పుడీ సినిమాలోని సాంగ్ లిరిక్‌తో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ‘లవ్ యు రా.. లవ్ యు రా’ అంటూ సాగే పాట ఎంత పెద్ద హిట్టో తెలిసిందో. ఇప్పుడిదే టైటిల్‌ ‘లవ్ యు రా’ (Love You Raa)తో సముద్రాల సినీ క్రియేషన్స్ బ్యానర్‌‌పై సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో చిన్ను హీరోగా, గీతికా రతన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సముద్రాల మంత్రయ్య బాబు, కొన్నిపాటి శ్రీనాథ్ ప్రజాపతి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రసాద్ ఏలూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 5న విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఆడియో లాంచ్ (Love You Raa Audio Launch) ఈవెంట్‌ను సోమవారం మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. ‘ఏ మాయ చేశావే పిల్లా’, ‘వాట్సప్ బేబీ’, ‘యూత్ అబ్బా మేము’, ‘దైవాన్నే అడగాలా’ అనే పాటలను ఈ వేడుకలో విడుదల చేశారు.

Also Read- HHVM OTT: షాకింగ్ సర్‌ప్రైజ్.. ముందే ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘వీరమల్లు’.. ఇంకొన్ని గంటల్లోనే!

అనంతరం ఈ చిత్ర హీరో చిన్ను మాట్లాడుతూ.. ‘లవ్ యు రా’ నాకు మొదటి చిత్రం. ఈ సినిమాతో పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థాంక్స్. ఈ ప్రయాణంలో మా వెన్నంటే నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. దర్శకుడు ప్రసాద్ నన్ను నమ్మి ఈ పాత్రను ఇచ్చారు. ‘లవ్ యు రా’ ఆద్యంతం అందరినీ కడుపుబ్బా నవ్వించేలా ఉంటుంది. హీరోయిన్ గీతిక పాత్రకు ప్రాణం పోశారు. కృష్ణ సాయి కారెక్టర్ ఇందులో హైలైట్‌గా ఉంటుంది. ఇందులో హారర్, కామెడీ, లవ్ ఇలా అన్ని అంశాలుంటాయి. ఈశ్వర్ మాకు మంచి పాటలు ఇచ్చారు. సెప్టెంబర్ 5న మా చిత్రం రాబోతోంది. మీడియా సపోర్ట్ ఉంటేనే మాలాంటి వాళ్లు ఆడియెన్స్ వరకు చేరుకుంటాం. మా మూవీని అందరూ చూసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థ్యాంక్స్ చెబుతూ.. కచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది హీరోయిన్ గీతిక.

Also Read- Jagapathi Babu: ‘ఆ టాపిక్ తీసుకొస్తే.. నేను మీ టాపిక్ తీసుకొస్తా’.. జగ్గుభాయ్‌కి శ్రీలీల వార్నింగ్!

దర్శకుడు ప్రసాద్ ఏలూరి మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని ఈ స్థాయికి తీసుకు వచ్చిన నా టీమ్ మొత్తానికి థాంక్స్. మా మూవీని చూసి మెచ్చుకున్న డిస్ట్రిబ్యూటర్ దయానంద్‌కు థాంక్స్. సెప్టెంబర్ 5న మా చిత్రం రాబోతోంది. నాకు దర్శకులలో రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా స్ఫూర్తి. చిన్న చిత్రాల్ని కూడా మీడియా ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది. మా మూవీని ఆడియెన్స్ వరకు రీచ్ అయ్యేలా చేయాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, నిర్మాత శ్రీనాథ్ ప్రజాపతి, నటుడు కృష్ణ సాయి, దర్శక, నిర్మాత నాగేష్, నాగతేజ వంటి వారు ప్రసంగించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!