HHVM OTT
ఎంటర్‌టైన్మెంట్

HHVM OTT: షాకింగ్ సర్‌ప్రైజ్.. ముందే ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘వీరమల్లు’.. ఇంకొన్ని గంటల్లోనే!

HHVM OTT: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా ఇంకొన్ని గంటల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ సినిమా ఓటీటీ విడుదల విషయంలో కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. జూలై 24న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. థియేటర్లలో అనుకున్నంతగా సక్సెస్ సాధించలేదు. టాక్ పరంగా పాజిటివ్‌గా వచ్చినా, కలెక్షన్ల పరంగా మాత్రం.. నిరాశపరిచిన సినిమాగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ విడుదల విషయంలో రకరకాల వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. అనుకున్న డేట్ కంటే ముందే స్ట్రీమింగ్‌కు అంగీకరిస్తే.. ప్రైమ్ వీడియో ఇంకాస్త అమౌంట్ ఎక్కువ ఇవ్వడానికి కూడా రెడీ అయిందంటూ ఈ మధ్య వార్తలు వచ్చాయి. దీంతో అసలు ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందనే దానిపై అనుమానాలు ఏర్పాడ్డాయి.

Also Read- Brahmanandam: నా దృష్టిలో అందమైన హీరో ఎవరో తెలుసా?.. బ్రహ్మానందం సంచలన వ్యాఖ్యలు

ఈ క్రమంలో అన్ని అనుమానాలకు తెరదించుతూ.. ‘హరి హర వీరమల్లు’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా ఆగస్ట్ 20 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు మరో రెండు భాషల్లో (తమిళం, మలయాళం) అందుబాటులోకి రానుంది. ఈ విషయం మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో తెలియజేశారు. వాస్తవానికి చిరు బర్త్ డే ట్రీట్‌గా ఆగస్ట్ 22 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌కు వస్తుందనేలా వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు బ్రేక్ వేస్తూ.. ఫ్యాన్స్‌కు షాకింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది సదరు ఓటీటీ సంస్థ. రెండు రోజుల ముందే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఓటీటీలో ఈ సినిమాకు బ్రహ్మాండమైన ఆదరణ లభిస్తుందని చిత్రయూనిట్, ఫ్యాన్స్ భావిస్తున్నారు. చూద్దాం.. ఎలాంటి ఆదరణ వస్తుందో..

Also Read- Vinayaka Chavithi 2025: వినాయకుడి మండపాన్ని ఎలా అలంకరించాలో తెలియట్లేదా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ ఇందులో నటించారు. నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్‌తో ఈ పీరియాడికల్ చిత్రాన్ని నిర్మించారు. ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా కథ 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఉంటుంది. హరి హర వీరమల్లు (పవన్ కళ్యాణ్) ఒక గజదొంగ, రాబిన్ హుడ్ లాగా ధనవంతుల నుండి దోచుకుని పేదలకు సహాయం చేస్తుంటాడు. ఈ క్రమంలో, మొఘల్ సైన్యం నుండి వజ్రాలను దొంగిలించి ఒక చిన్న దొర దృష్టిలో పడతాడు. ఆ దొర కోరిక మేరకు, గోల్కొండ నవాబుకు చెందిన వజ్రాలను దొంగిలించడానికి ఒప్పుకుంటాడు. ఈ ప్రయాణంలో కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావాలనే ఒక పెద్ద మిషన్‌లో చిక్కుకుంటాడు. ఈ మిషన్ వెనుక వీరమల్లుకు ఓ ప్రత్యేక స్టోరీ ఉంటుంది. అదేంటనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా చూడాల్సిందే. థియేటర్లలో విడుదలయ్యే విషయంలో పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా.. ఓటీటీ విషయంలో మాత్రం అనుకున్నదాని కంటే ముందే వచ్చేయడం విశేషంగా చెప్పుకోవాలి.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!