Telugu Releases: సంక్రాంతి తర్వాత తెలుగు ప్రక్షకులను అలరించందుకు అరడజనుకు పైగా సినిమాలు ఈ వారం విడుదల కానున్నాయి. జనవరి 30, 2026న థియేటర్లలో విడుదలవుతున్న తెలుగు సినిమాల వివరాలు ఎంటో ఇక్కడ చూద్దాం. ఈ వారం చిన్న చిత్రాలతో పాటు ఆసక్తికరమైన కాన్సెప్ట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి.
1. ఓం శాంతి శాంతి శాంతి
ఈ సినిమా ఒక మధ్యతరగతి వివాహిత తన భర్త నుంచి ఎదురయ్యే గృహహింసను మార్షల్ ఆర్ట్స్ ద్వారా ఎలా ఎదుర్కొన్నదనేది కథ.
నటీనటులు: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, బ్రహ్మాజీ
దర్శకత్వం: ఏఆర్ సజీవ్
విశేషం: తరుణ్ భాస్కర్ పూర్తిస్థాయి హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది.
Read also-Gunasekhar: జూనియర్ ఎన్టీఆర్‌ను ఘోరంగా తిట్టిన స్టార్ దర్శకుడు.. ఎందుకంటే?
2. జమానా (Zamana)
ఇది ఒక క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్. హైదరాబాద్ మ్యూజియం నుండి నిజాం కాలం నాటి ఒక విలువైన నాణేం చోరీకి గురైన నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.
నటీనటులు: సూర్య శ్రీనివాస్, స్వాతి కశ్యప్, మణిక్ రెడ్డి
దర్శకత్వం: భాస్కర్ జక్కుల
3. దేవగుడి
రాయలసీమ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా. నిజ జీవిత ఘటనల ఆధారంగా, వాస్తవిక లొకేషన్లలో చిత్రీకరించిన చిత్రమిది.
నటీనటులు: రఘు కుంచె (వీరారెడ్డి పాత్రలో), అభినవ శౌర్య, అనుశ్రీ
దర్శకత్వం: బెల్లం రామకృష్ణా రెడ్డి
4. వన్ బై ఫోర్ (One/4)
వైజాగ్‌కు చెందిన కిరణ్ అనే యువకుడు చేసిన ఒక చిన్న తప్పు అతని జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది అనే పాయింట్ మీద సాగే సైకలాజికల్ థ్రిల్లర్.
నటీనటులు: వెంకటేష్ పెద్దపాలెం, అపర్ణ మల్లిక్
దర్శకత్వం: బాహుబలి పళని
5. త్రిముఖ
ఒక మహిళా సిఐడి ఆఫీసర్ ఒక సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి చేసే ప్రయత్నాల చుట్టూ తిరిగే క్రైమ్ థ్రిల్లర్.
నటీనటులు: సుమన్, సన్నీ లియోన్, రవిప్రకాష్, షకలక శంకర్
దర్శకత్వం: రాజేష్ నాయుడు
Read also-Vijay Career: విజయ్ దేవరకొండ గ్రాఫ్ తగ్గడానికి కారణం ఇదే.. తరుణ్ భాస్కర్
6. దృతరాష్ట్రుడు
ఇది సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న సినిమా.
నటీనటులు: ధనరాజ్, నీ నే శేఖర్, నివా సహాయ్
దర్శకత్వం: సురేష్ గోమతి
7. ప్రేమ కడలి
కష్టాల మధ్య తన కలలను నెరవేర్చుకోవడానికి పోరాడే ఒక వ్యక్తి కథ. ఇది ఒక రొమాంటిక్ డ్రామా.
నటీనటులు: నాని పిల్లబోయన, యామిని నాగేశ్వర్
దర్శకత్వం: నాని పిల్లబోయన
8. గాంధీ టాక్స్ (Gandhi Talks)
ఇది ఈ వారం విడుదలవుతున్న అత్యంత ప్రత్యేకమైన సినిమా. డైలాగ్స్ లేని ఒక నిశ్శబ్ద చిత్రం (Silent Film). డార్క్ కామెడీ అండ్ సోషల్ డ్రామాగా వస్తోంది.
నటీనటులు: విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావు హైదరీ
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
9. లాక్ డౌన్
తమిళంలో అదే పేరుతో రూపొందిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్ర పోషించారు. లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన ఒక యువతి మానసిక స్థితిని ఈ చిత్రం వివరిస్తుంది. ఇప్పటికే పలు మార్లు విడుదల వాయిదా పడిన ఈ సినిమా ఈ వారం థియేటర్లలోకి రానుంది.
నటీనటులు: అనుపమ పరమేశ్వరన్
దర్శకత్వం: ఏఆర్ జీవా

