Gunasekhar: జూ ఎన్టీఆర్‌ను ఘోరంగా తిట్టిన స్టార్ దర్శకుడు..
Gunasekhar(X)
ఎంటర్‌టైన్‌మెంట్

Gunasekhar: జూనియర్ ఎన్టీఆర్‌ను ఘోరంగా తిట్టిన స్టార్ దర్శకుడు.. ఎందుకంటే?

Gunasekhar: టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ మొదట్లో ప్రముఖ దర్శకుడితో ఘోరంగా తిట్లు తిన్నారని మీకు తెలుసా. ఎన్టీఆర్ అభిమానులకు కోపం తెప్పించే విషయమే అయినా ఇది నిజం. టాలీవుడ్ లో నటనకు మారుపేరు అయిన జూనియర్ ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ లాగా ప్రతి సినిమాలో తన నట విశ్వరూపం చూపిస్తారు. కెరీర్ బిగినింగ్ లో గుణ శేఖర్ దర్శకత్వంలో బాల రామాయణంలో రాముని పాత్రలో నటించారు. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ ను దర్శకుడు గుణ శేఖర్ తిట్టాడట.. ఎందుకంటే అప్పుడు రాముడు విల్లు ను విరగ్గొట్టే సీన్ ఉండటంతో దానిని ప్రాక్టీస్ చేయడానకి తన స్నేహితుల ముందు ఎన్టీఆర్ ట్రైచేశారు. ఆ విల్లు అనుకోకుండా విరిగిపోయింది. దీంతో గుణ శేఖర్ కు విపరీతమైన కోపం వచ్చి ఎన్టీఆర్ ను ఘోరంగా తిట్టారట, అప్పుడు పక్కనే ఉన్న ఆయన తల్లి కూడా అది చూస్తే ఏమీ అనలేదని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు గుణ శేఖర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read also-Chiranjeevi Success: ‘మన శంకరవరప్రసాద్ గారు’ హిట్ అవ్వడానికి కారణం ఇదేనా?.. చిరు అంత పని చేస్తారా!

అంతే కాకుండా.. ఆ సమయంలో ఆల్టర్నేట్ ధనస్సు లేకపోవడంతో ఆ రోజు షూటింగ్ ఆగిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో గుణశేఖర్‌కు చాలా కోపం వచ్చి ఎన్టీఆర్‌ను గట్టిగా తిట్టారు . డైరెక్టర్ తిట్టడంతో చిన్నపిల్లవాడైన ఎన్టీఆర్ అలిగి, తన తల్లి దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ సమయంలో తను ఇక ఈ సినిమా చేయనని కూడా అనుకున్నారట. గుణశేఖర్ తిడుతున్నా ఎన్టీఆర్ తల్లి ఏమాత్రం అడ్డు చెప్పలేదు. ‘డైరెక్టర్ గారు ఏం చెబితే అది చేయాలి, ఆయన తిట్టినా కొట్టినా పడాల్సిందే’ అని ఎన్టీఆర్‌కు చెప్పి క్రమశిక్షణతో పెంచారని గుణశేఖర్ అభినందించారు. ఎన్టీఆర్ చిన్నప్పుడు అస్సలు కుదురుగా ఉండేవాడు కాదని, ఆయన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమయ్యేదని గుణశేఖర్ గుర్తుచేసుకున్నారు. నిజానికి ఆయన రాముడి క్యారెక్టర్ కంటే హనుమంతుడి క్యారెక్టర్‌కు సరిపోయేంత హుషారుగా ఉండేవారని సరదాగా వ్యాఖ్యానించారు. మొత్తానికి, ఆ రోజు తిట్టిన తిట్లే ఎన్టీఆర్‌ను ఒక క్రమశిక్షణ కలిగిన నటుడిగా తీర్చిదిద్దడానికి సహాయపడ్డాయని గుణశేఖర్ ఈ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

Read also-Vijay Career: విజయ్ దేవరకొండ గ్రాఫ్ తగ్గడానికి కారణం ఇదే.. తరుణ్ భాస్కర్

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?