Vijay Career: తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న నటుడు విజయ్ దేవరకొండ. ‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’ వంటి సినిమాలతో సెన్సేషన్ సృష్టించిన విజయ్, గత కొంతకాలంగా ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోతున్నారు. దీనిపై ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు తరుణ్ భాస్కర్ స్పందిస్తూ విజయ్ కెరీర్ తగ్గడానికి గల కారణాలు చెప్పుకొచ్చారు. తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ, విజయ్ ఒక అద్భుతమైన నటుడనడంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. ‘ఒక నటుడిగా విజయ్ పొటెన్షియల్ ఏంటో మనందరికీ తెలుసు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలు మన సంస్కృతిలో భాగమైపోయాయి. విజయ్ దేవరకొండ అనే పేరు ఐకానిక్‌గా నిలిచిపోతుంది,’ అని ఆయన ప్రశంసించారు. ప్రతి ఆర్టిస్ట్ తన కెరీర్లో ఏదో ఒక సమయంలో తన రెలవెన్స్ వెతుక్కోవాల్సి ఉంటుందని, విజయ్ కూడా ప్రస్తుతం ఆ ప్రక్రియలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రేక్షకులు మారుతున్న కొద్దీ, నటుడు కూడా తన కథల ఎంపికలో మార్పులు చేసుకోవాలని సూచించారు.
Read also-Chiranjeevi Fitness: మెగాస్టార్ ఫిట్నెస్ సీక్రెట్ తెలుసా?.. అయ్యబాబోయ్ ఏంటి బాసూ మీరు చేసేది..
ప్రేక్షకుల మనస్తత్వం
తరుణ్ భాస్కర్ ఒక ఆసక్తికరమైన పాయింట్ లేవనెత్తారు. ప్రేక్షకులు ఎప్పుడూ ఒక వ్యక్తి స్టార్‌గా ఎదగడం, ఆ తర్వాత కిందకి పడటం, మళ్ళీ శక్తివంతంగా పుంజుకోవడం చూడాలని కోరుకుంటారు. ‘కెరీర్ ఎప్పుడూ ఒకేలా సాగితే బోర్ కొడుతుంది. అది ఒక ECG గ్రాఫ్ లాగా ఉండాలి. పైకి వెళ్ళాలి, కింద పడాలి, మళ్ళీ లేవాలి. అప్పుడే ఆ ప్రయాణం బతికున్నట్టు కనిపిస్తుంది. విజయ్ ప్రస్తుతం ఆ జర్నీని అనుభవిస్తున్నాడు,’ అని తరుణ్ విశ్లేషించారు. ప్రస్తుతానికి విజయ దేవరకొండ ‘రౌడీ జనార్ధన’, ‘రణబలి’ వంటి సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు విజయ్ దేవరకొండ మాస్ లుక్ లో కనిపించనున్నారు.
Read also-Mega Twins: మెగా వారసులు వచ్చేందుకు డేట్ ఫిక్సయింది.. ఎప్పుడంటే?
సినిమా రంగంలో మార్పులకు అనుగుణంగా మారడం (Adaptability) అత్యంత ముఖ్యమైన ఆయుధం అని తరుణ్ భాస్కర్ అన్నారు. పరిస్థితులు అనుకూలించనప్పుడు వాటి నుండి పాఠాలు నేర్చుకొని, మరింత మెరుగ్గా ముందుకు రావాలని, విజయ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లైన్-అప్ చూస్తుంటే అతను త్వరలోనే గొప్ప విజయాలను అందుకుంటాడని నమ్మకం వ్యక్తం చేశారు. విజయ్ దేవరకొండ ఎదుర్కొంటున్న ప్రస్తుత దశ కేవలం ఒక తాత్కాలిక విరామం మాత్రమేనని, తనలోని నటుడిని సరైన రీతిలో ఆవిష్కరించే కథలు పడితే మళ్ళీ అతను బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతారని తరుణ్ భాస్కర్ మాటలు తెలియజేస్తున్నాయి.

