Chiranjeevi Success: మెగాస్టార్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ టాలీవుడ్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అసలు ఈ సినిమా విజయం సాధించాడానికి కారణం మెగాస్టార్ సినిమాలో వేలు పెట్టక పోవడమే అని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకు అంతే అంతకు ముందు చాలా సినిమాల్లో మెగాస్టార్ వేలు పెడతారని పెద్ద టాక్ ఉంది. అందుకే సినిమాలు ఆడకుండా పోతున్నయని కూడా ఇండస్ట్రీ లో పెద్ద చర్చ నడుస్తోంది. ఇటీవల సస్కెస్ మీట్ లో కూడా మెగాస్టార్ మాట్లాడుతూ.. అనిల్ రావిపూడి ఎలా చెప్తే అలాగే చేశానని అసలు తన ప్రమేయం ఏమీ లేదని ఆయన చెప్పుకొచ్చారు. దీనిని బట్టి చూసుకుంటే చిరంజీవి తన సినిమాల్లో వేలు పెట్టి వాటిని పాడు చేస్తారు అంటూ టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ఈ సినిమా విజయంలో అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, చిరంజీవి వింటేజ్ స్వాగ్ ప్రధాన పాత్ర పోషించాయి. అయితే, ఈ సినిమా ఇంతటి ఘనవిజయం సాధించడానికి ప్రధాన కారణం “చిరంజీవి మేకింగ్‌లో తలదూర్చకపోవడమే” అనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
Read also-Vijay Career: విజయ్ దేవరకొండ గ్రాఫ్ తగ్గడానికి కారణం ఇదే.. తరుణ్ భాస్కర్
డైరెక్టర్ ఫ్రీడమ్..
సాధారణంగా చిరంజీవి లాంటి సీనియర్ హీరోలు సినిమా అవుట్‌పుట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. కథనం, డైలాగులు, ఎడిటింగ్ వంటి విషయాల్లో తమ అనుభవంతో కొన్ని సూచనలు ఇస్తుంటారు. దీన్నే బయట నెగటివ్ కోణంలో ‘వేలు పెట్టడం’ అని పిలుస్తుంటారు. అయితే, ఈ సినిమా విషయంలో చిరంజీవి పూర్తి భిన్నంగా వ్యవహరించారని తెలుస్తోంది. అనిల్ రావిపూడి తన సినిమాల్లో టైమింగ్, బాడీ లాంగ్వేజ్‌ను చాలా విభిన్నంగా డిజైన్ చేస్తారు. ఈ క్రమంలో చిరంజీవి తన సహజశైలికి భిన్నంగా కొన్ని సీన్లు చేయాల్సి వచ్చినప్పుడు మొదట సంకోచించినా, అనిల్ రావిపూడి ఆయన్ని కన్విన్స్ చేయడంలో సఫలమయ్యారు. ‘సార్, ఇది నా స్టైల్.. నన్ను నమ్మండి’ అని అనిల్ కోరగా, చిరంజీవి దర్శకుడి విజన్‌కే ప్రాధాన్యతనిచ్చారు.
మార్పులకు నో..
గతంలో కొన్ని సినిమాల విషయంలో చిరంజీవి మార్పులు సూచించడం వల్ల ఫలితం తారుమారైందనే విమర్శలు ఉన్నాయి. ఈ సినిమా సెట్స్‌లో చిరంజీవి కేవలం నటుడిగానే పరిమితమయ్యారని, స్క్రిప్ట్ విషయంలో ఎలాంటి మార్పులు కోరలేదని యూనిట్ సభ్యులు చెబుతుంటారు. దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడమే సినిమాలోని ఫ్యాన్ మూమెంట్స్ పక్కాగా పండడానికి కారణమైంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘ఆచార్య’. ఈ సినిమా గురించి ఓ సందర్భంలో కొరటాల శివ మాట్లాడుతూ.. ‘ఎవరి పని వారిని చేసుకోనిస్తే ప్రపంచం చాలా ప్రశాతంగా ఉంటుందని చెప్పుకొచ్చారు’.
Read also-Chiranjeevi Fitness: మెగాస్టార్ ఫిట్నెస్ సీక్రెట్ తెలుసా?.. అయ్యబాబోయ్ ఏంటి బాసూ మీరు చేసేది..
కామెంట్స్ వెనుక అంతరార్థం
అనిల్ రావిపూడి పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ.. “చిరంజీవి గారు నాపై నమ్మకం ఉంచారు, నేను చెప్పింది చెప్పినట్టు చేశారు” అని పేర్కొన్నారు. ఇది వినడానికి సాధారణంగా ఉన్నా, ఇండైరెక్ట్ గా ఆయన సినిమా మేకింగ్‌లో జోక్యం చేసుకోలేదనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఒక స్టార్ హీరో దర్శకుడి ఆలోచనలకు లొంగి పనిచేసినప్పుడు అవుట్‌పుట్ ఎంత ఫ్రెష్‌గా ఉంటుందో ఈ సినిమా నిరూపించింది. ‘మన శంకరవరప్రసాద్ గారు’ విజయం కేవలం ఒక హిట్ మాత్రమే కాదు, అది దర్శకుడికి ఇచ్చే స్వేచ్ఛకు నిదర్శనం. చిరంజీవి తన అనుభవాన్ని పక్కన పెట్టి, నేటి తరం దర్శకుడి ఆలోచనలకు అనుగుణంగా మారడం వల్లనే ఆయనలోని పాత చిరంజీవిని ప్రేక్షకులు మళ్ళీ చూడగలిగారు.

