Kannappa: శుక్రవారం (జూన్ 27) థియేటర్లలోకి వచ్చిన మంచు విష్ణు (Vishnau Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa).. విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుని సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది. ఈ సినిమాను చూసిన వారంతా టీమ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా సెకండాఫ్‌లో ప్రభాస్ ఎంట్రీ తర్వాత సినిమా ఎక్కడికో వెళ్లిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సక్సెస్‌తో మంచి ఫ్యామిలీ కూడా కాస్త ఊపిరి పీల్చుకుంటోంది. ఇంతకు ముందు ఈ ఫ్యామిలీ హీరోల నుంచి వచ్చిన సినిమాలు ఘోర పరాభావాన్ని ఎదుర్కొన్నాయి. ఆ పరాభావాలకు, పరాజయాలకు చెక్ చెబుతూ.. మంచు ఫ్యామిలీకి చాలా కాలం తర్వాత ఓ మంచి హిట్ పడింది. ఈ హిట్‌ని ‘కన్నప్ప’ టీమ్ అంతా ఎంజాయ్ చేస్తుంది. ఈ సినిమాను చూసిన సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడు కె. రాఘవేంద్రరావు, హీరో సూర్య, దర్శకుడు అజయ్ భూపతి వంటి వారంతా ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ.. టీమ్‌కు శుబాభీనందనలు తెలిపారు. ఇప్పుడు మంత్రుల వరకు ఈ సినిమా చేరింది. తాజాగా ఈ సినిమాను చూసిన డిప్యూటీ సీఎం, సినిమాటోగ్రఫీ మినిస్టర్ సినిమాపై పొడగ్తల వర్షం కురిపించారు.
Also Read- AN63: రణబీర్ కపూర్‌కు ‘యానిమల్’.. మరి అల్లరి నరేష్‌కు?
డిప్యూటీ సీఎం అనగానే అంతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుకుంటారేమో.. కాదండోయ్.. ఇక్కడ ‘కన్నప్ప’ సినిమాను చూసింది తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ వంటి వారంతా ఆదివారం స్పెషల్ స్క్రీనింగ్‌లో ఈ సినిమాను వీక్షించారు. వీరితో పాటుగా మోహన్ బాబు, విష్ణు వంటి వారు కూడా ఈ స్పెషల్ స్క్రీనింగ్‌లో సందడి చేశారు. సినిమా చూసిన అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. నేను ఊహించిన దానికంటే గొప్పగా ‘కన్నప్ప’ చిత్రం ఉంది. అర్జునుడిగా, తిన్నడిగా, కన్నప్పగా విష్ణు చాలా అద్భుతంగా నటించారు. ఇంత గొప్ప చిత్రం నిర్మించిన మోహన్ బాబుకు అభినందనలు. కథ, కథనం, విజువల్స్, యాక్టింగ్ అన్ని ఇలా గొప్పగా అనిపించాయి. ఇదొక మైల్ స్టోన్ చిత్రమవుతుందని అన్నారు.
Also Read- Snigdha: గుడ్ న్యూస్ చెప్పిన మిరపకాయ్ క్యూట్ గర్ల్.. వీడియో వైరల్
సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత ఒక మంచి చిత్రాన్ని చూశాను. ఇంత గొప్ప చిత్రాన్ని నిర్మించిన మోహన్ బాబుకు, విష్ణుకు అభినందనలు. ఈ సినిమాలో ఇతర పాత్రలలో నటించిన అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్ వంటి వారందరితో సినిమాను రూపొందించి.. ఈ రోజు శివ భక్తులే కాదు.. అందరూ పరవశించి పోయేలా మూవీని తీశారు. అందుకే, ముగ్గురు మంత్రులం సినిమా చూడటానికి వచ్చాం. ‘కన్నప్ప’ వంటి కథలు అందరికీ తెలియాలి. ముఖ్యంగా పిల్లలకు, యువతకు, ఇప్పటి జనరేషన్‌కు తెలియాలి. ఇలాంటి గొప్ప ప్రయత్నం చేసిన టీమ్‌కు మరోసారి నా అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు. సినిమా చూసి, టీమ్‌ని అభినందించిన మంత్రులకు మోహన్ బాబు, విష్ణు ధన్యవాదాలు తెలిపారు.
Deputy Chief Minister of Telangana, Shri @Bhatti_Mallu garu, and Minister of Roads & Buildings, Shri @KomatireddyKVR garu, Transport Minister of Telangana, Shri @Ponnam_INC garu attended the screening of #Kannappa and applauded the film’s grandeur and storytelling. 🏹#Kannappa… pic.twitter.com/Yehvsx42jv
— Sai Satish (@PROSaiSatish) June 30, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు