AN63 Alcohol
ఎంటర్‌టైన్మెంట్

AN63: రణబీర్ కపూర్‌కు ‘యానిమల్’.. మరి అల్లరి నరేష్‌కు?

AN63: అల్లరి నరేష్ (Allari Naresh) ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలన్నీ వైవిధ్యభరితమైనవే. కామెడీ హీరోగా కెరీర్ మొదలు పెట్టిన అల్లరి నరేష్.. ఆ తర్వాత సీరియస్ పాత్రలవైపు మొగ్గు చూపారు. అందులోనూ నటుడిగా ఆయన సక్సెస్ అవుతూనే ఉన్నారు. కానీ సినిమాల పరంగా మాత్రం సక్సెస్ రావడం లేదు. మధ్యలో ఒకటి రెండు సినిమాలు తప్పితే.. మిగతా సినిమాలన్నీ అల్లరి నరేష్‌కు నిరాశనే మిగిల్చాయి. కానీ, నటుడిగా మాత్రం ఆయనని ఒక్కో మెట్టు ఎక్కిస్తూనే ఉన్నాయి. ఈసారి నటుడిగానే కాదు, సినిమా పరంగా కూడా బ్లాక్ ‌బస్టర్ కొట్టి చూపిస్తాననేలా.. మరో వైవిధ్యభరితమైన చిత్రంతో వచ్చేందుకు రెడీ అవుతున్నారు అల్లరి నరేష్. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో అల్లరి నరేష్ తన 63వ చిత్రాన్ని చేయబోతున్నారు. అల్లరి నరేష్ బర్త్‌డే‌ని (Happy Birthday Allari Naresh) పురస్కరించుకుని సోమవారం ఈ చిత్ర టైటిల్‌తో పాటు ఇతర వివరాలను మేకర్స్ తెలియజేశారు.

Also Read- Kolli Veera Prakash Rao: అక్క బాటలోనే తమ్ముడు.. కళ్లు చిరంజీవి ఐ బ్యాంక్‌కి.. భౌతిక కాయం అపోలో ఆసుపత్రికి!

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రానికి ‘ఆల్కహాల్’ (ALCOHOL) అనే టైటిల్‌ని ఖరారు చేస్తూ.. ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. హాస్య చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న అల్లరి నరేష్, ఈసారి చేయబోయే చిత్రంతో నటుడిగా ఒకేసారి పది మెట్లు ఎక్కేస్తాడనేలా మేకర్స్ ఈ పోస్టర్‌ని డిజైన్ చేశారు. ‘ఫ్యామిలీ డ్రామా’ ఫేమ్ మెహర్ తేజ్ ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఆల్కహాల్’ టైటిల్‌తో వచ్చిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. పోస్టర్‌లో అల్లరి నరేష్ ఆల్కహాల్‌లో మునిగిపోయినట్లుగా సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ చూస్తుంటే.. ఇది భ్రమ, వాస్తవికత మధ్య జరిగే కథలా కనిపిస్తోంది. ఈ పోస్టర్ చూసిన అల్లరి నరేష్ అభిమానులైతే.. బాలీవుడ్‌లో రణబీర్ కపూర్‌కు ‘యానిమల్’ ఎలాగో.. ఈ సినిమా అల్లరి నరేష్ అలాగే.. అవుతుందని కామెంట్స్ చేస్తుండటం విశేషం.

Also Read- Naga Chaitanya: శోభిత, నేను ఆ రూల్స్ పెట్టుకున్నాం.. ఫస్ట్ టైమ్ పర్సనల్ మ్యాటర్ చెప్పిన చైతూ!

అల్లరి నరేష్ సరసన రుహాని శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. జిజు సన్నీ ఛాయాగ్రాహకుడిగా, రంజన్ దేవరమానే ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వెంకట్ ఉప్పుటూరి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో మరో ఘన విజయాన్ని తమ ఖాతాలో వేసుకోబోతున్నారనే నమ్మకాన్ని ఫస్ట్ లుక్ పోస్టర్‌తో మేకర్స్ కల్పించారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఈ సందర్భంగా మేకర్స్ వెల్లడించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!