Snigdha: రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం మిరపకాయ్. ఈ సినిమాని ఇప్పటికి కూడా రవితేజ ఫ్యాన్స్ చూస్తారు. అయితే, ఈ మూవీలో హీరోయిన్ ఫ్రెండ్ గా చేసిన అమ్మాయి మీకు గుర్తుందా..? డిఫరెంట్ వాయిస్ తో అందర్ని ఆకట్టుకన్న ఈ ముద్దుగుమ్మ పేరు ‘స్నిగ్థ’. ఈమె మిరపకాయ్ సినిమాలో చేసింది చిన్న పాత్రే కానీ, క్రేజ్ మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. తన క్యూట్ వాయిస్ తో అందర్ని ఆకట్టుకుంది. అంతేకాకుండా.. ఈ చిత్రంలో ఆమె మాటలకు ప్రేక్షకులందరు పడిపోయారు. కానీ, మిరపకాయ్ మూవీ తర్వాత స్నిగ్థ మళ్లీ ఏ తెలుగు సినిమాలోనూ కనిపించింది లేదు. సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ యాక్టివ్ గా ఉండదు. మిరపకాయ్ సినిమాకి దర్శకత్వం వహించిన డైరెక్టర్ హరీశ్ శంకర్ భార్య పేరు, ఈ చిత్రంలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ఈ బ్యూటీ పేరు స్నిగ్థ ఒకటి కావడంతో ప్రస్తుతం ఈమెకి సంబంధించిన ఫోటోస్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.
మాస్ మహారాజ రవితేజ నటించిన సూపర్ హిట్ సినిమా మిరపకాయ్ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రం 2011లో మకర సంక్రాంతి రోజు విడుదలై పెద్ద హిట్ అయింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో హీరోగా రవితేజ, రిచా గంగోపాధ్యాయ్, దీక్షా సేత్‌లు హీరోయిన్లగా నటించారు. ఈ సినిమా జులై 11 న రీ-రిలీజ్ కానుంది. ఇక ఇదే విషయాన్ని స్నిగ్థ చెబుతూ రవితేజ ఫ్యాన్స్ మళ్లీ థియేటర్లకి వెళ్ళి ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ను చూడలంటూ ఫ్యాన్స్ కు చెబుతూ వీడియో రిలీజ్ చేసింది.