tamanna ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Tamannaah Bhatia: బాహుబలి ఎపిక్‌లో మళ్లీ తమన్నా సీన్స్ కట్?

Tamannaah Bhatia: టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొన్నాళ్లు హవా కొనసాగించిన తమన్నా, ఆ తర్వాత బాలీవుడ్ వైపు అడుగుపెట్టింది. అక్కడ స్థిరపడినా, సౌత్ సినిమాల్లో అప్పుడప్పుడు మెరిసిపోతోంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 ఏళ్లు దాటినా, ఆమె గ్లామర్ మాత్రం అలాగే ఉంది. కానీ, బాహుబలి సిరీస్ మాత్రం తమన్నా గుండెకి గాయం చేసిందనే చెప్పుకోవాలి. కానీ, ఫ్యాన్స్ మాత్రం ఆమెకి అన్యాయం జరిగిందనే కామెంట్లు చేస్తున్నారు. గతంలో కూడా కొన్ని న్యూస్ రిపోర్టులు వచ్చాయి.

బాహుబలి ఎపిక్‌లో మళ్లీ తమన్నా సీన్స్ కట్?

Also Read: Warangal Montha Cyclone: ఓరుగల్లును ముంచిన మొంథా తుఫాన్.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం!

బాహుబలి 1లో అవంతిక చుట్టూ కథ ప్రధానంగా తిరిగింది. కానీ పార్ట్ 2లో ఆమె సీన్లు, యాక్షన్ సీక్వెన్స్‌లు ఎడిటింగ్ టేబుల్‌పైనే ఆగిపోయాయి. దీంతో, తమన్నా బాధపడిందనే వార్తలు వచ్చాయి. అయినా ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర విషయాలు చెప్పింది. ” సీన్లు కట్ అయినా నేను సంతోషంగానే ఉన్నా. సెకండ్ పార్ట్‌లో నా స్క్రీన్ టైమ్ తక్కువే అని ముందే చెప్పారు. బాహుబలి నాకు గొప్ప అవకాశం ఇచ్చింది. కానీ దాని సక్సెస్‌ను నేను పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాను. ప్రభాస్, రానాలకే ఎక్కువ గుర్తింపు వచ్చింది.” అని చెప్పింది.

Also Read: Mahabubabad SP: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ కీలక సూచనలు

ఇది అంతటితో ఆగలేదు. ఇప్పుడు బాహుబలి ఎపిక్.. రెండు పార్టుల్నీ కలిపి ఒక్క సినిమాగా అక్టోబర్ 31న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ప్రభాస్, రానా, రాజమౌళి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో రాజమౌళి ఒప్పుకున్నాడు. “రెండు సినిమాల్నీ ఒకటిగా చేయడానికి ఎడిటింగ్‌లో చాలా తీసేశాం.” ఆ లిస్ట్‌లో తమన్నా-ప్రభాస్ లవ్ ట్రాక్ మొత్తం, పచ్చబొట్టు సాంగ్ కూడా తీసేశాం అని చెప్పాడు. దీంతో, అందరూ మళ్లీ తమన్నానే సపోర్ట్ చేస్తున్నారు. నెటిజన్లు రెండోసారి కూడా ” తమన్నానే బలిపశువు చేశారు అంటూ సానుభూతి చూపిస్తున్నారు. ” కూరలో కరివేపాకు తీసేసినట్టు ప్రతిసారీ తమన్నా సీన్లు ఫ్లోర్‌కి పరిమితం చేస్తున్నారంటూ ” అంటూ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అయితే, ఇప్పుడైనా ఈ ఎపిక్ విషయంలో తమన్నా నోరు విప్పుతుందా? లేదా అనేది చూడాలి.
మొత్తంమీద, బాహుబలి ఫ్రాంచైజీలో ఆమెకు మాత్రం నిజంగానే అన్యాయం జరిగినట్టు ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Also Read: Sridhar Babu: తెలంగాణను ఏరో ఇంజిన్ రాజధానిగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు

Just In

01

Cyclone Montha: రాష్ట్రంలో వర్ష బీభత్సం.. డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ హిస్టరీలోనే తొలిసారి.. ప్రేక్షకులను భలే బురిడీ కొట్టిస్తున్నారుగా?

Seethakka: మైనార్టీలను మోసం చేసింది బీఆర్‌ఎస్‌.. మంత్రి సీతక్క కౌంటర్!

Bigg Boss Telugu 9 Re Enter: బిగ్ బాస్‌లో సంచలనం.. పర్మినెంట్ హౌస్‌మేట్‌గా భరణి? మరి శ్రీజ పరిస్థితేంటి?

Bhatti Vikramarka: జీసీసీలకు క్యాపిటల్ హైదరాబాద్.. సమానత్వంతో కూడిన వృద్ధి లక్ష్యం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క