Tamanna – Vijay Varma: ప్రేమ పక్షలు తమన్నా, విజయ్ వర్మల మధ్య బ్రేకప్ జరిగిందని, వారిద్దరూ ప్రస్తుతం ఎవరి దారి వారు చూసుకున్నారనేలా బాలీవుడ్ మీడియా సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ వార్త తెలిసి చాలా మంది సంతోషించి ఉంటారు కూడా. ఎందుకంటే, విజయ్ వర్మతో తమన్నా డేటింగ్ చేస్తుందనే వార్తలు వచ్చినప్పుడు చాలా మంది హృదయాలు బాధపడ్డాయి. తమన్నాను ఆరాధించేవారి సంగతి అయితే ఇక చెప్పే పనే లేదు.
అసలు విజయ్ వర్మకి తమన్నా ఎలా పడి ఉంటుందని అంతా తెగ సెర్చ్ కూడా చేశారు. అలాంటి అపురూప సౌందర్యవతిని దక్కించుకున్న వర్మ అదృష్టవంతుడు, నక్క తోక తొక్కాడు అనేలా అప్పట్లో ఓ రేంజ్‌లో వార్తలు వినిపించాయి. మరి ఎవరి దిష్టి పడిందో, ఏమో గానీ వారిద్దరూ విడిపోయారు. ఈ విషయం ఇన్ డైరెక్ట్‌గా తమన్నా కూడా తన లేటెస్ట్ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
Also Read- Ketika Sharma: కేతికా.. నీ పంట పండిందిపో! ‘అది ధ సర్‌ప్రైజ్’
ఇక వారు విడిపోయారనే వార్తలు వచ్చినప్పటి నుండి, ఎందుకు విడిపోయి ఉంటారనేలా అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ విషయంలో ఎవరికి నచ్చిన వెర్షన్‌లో వారు కథలు, కథనాలు అల్లేస్తున్నారు. తమన్నా పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో.. ఇద్దరు వ్యక్తుల మధ్య ఎప్పుడైతే కండీషన్స్ మొదలవుతాయో.. వారి మధ్య ప్రేమకు చోటుండదు. మన వెనుక ఉన్న మనీ చూసి కాకుండా, మనసును అర్థం చేసుకునే చోట ప్రేమకు ఎంతో విలువ ఉంటుంది.
నేను ఎవరినైనా ప్రేమిస్తే.. వారికి ఫ్రీడమ్ ఇవ్వాలి. వారికి నచ్చినట్లు వారిని బతకనివ్వాలి.. అంటూ తన డేటింగ్ లైఫ్‌లో ఏం కోల్పోయిందో చెప్పే ప్రయత్నం చేసింది. అయితే విజయ్ వర్మ వెర్షన్ మాత్రం వేరేలా ఉంది. అతని సైడ్ నుంచి వినిపిస్తున్న వార్తలు వింటుంటే తమన్నాదే తప్పు, బ్రేకప్‌కి ఆమెనే అన్నట్లుగా పిక్చర్ మారిపోతుంది. విజయ్ వర్మ వెర్షన్‌కి వస్తే..
ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాలన్నింటినీ పూర్తి చేసుకున్న తమన్నా.. ఇక ఇద్దరం పెళ్లి చేసుకుందామా? అని అడిగిందట. కానీ విజయ్ వర్మ మాత్రం అందుకు స్పందించలేదనేలా బాలీవుడ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తుంది. అందుకు కారణం ఏం చెబుతున్నారంటే, తమన్నా బిహేవియర్ అని అంటున్నారు. విజయ్ వర్మతో పోల్చుకుంటే.. తమన్నా స్టార్ హీరోయిన్. ఆస్తుల పరంగానూ, అందాల పరంగా అన్నీ ఎక్కువే.
అందుకే డేటింగ్ మొదలైనప్పటి నుంచి, ఆమె డామినేషనే ఎక్కువగా ఉంటూ వస్తుందట. పెళ్లి తర్వాత కూడా ఆమె డామినేషన్‌ని తట్టుకోవాలంటే తన వల్ల కాదనుకున్న విజయ్ వర్మ.. ‘పెళ్లి వద్దు, ఏం వద్దు.. ఫ్రెండ్స్‌గా ఉందాం’ అని అన్నాడట. అంతే, మిల్కీబ్యూటీకి ఆగ్రహం వచ్చేసి, ఇంక బ్రేకప్ అని చెప్పేసిందట. ప్రస్తుతం బాలీవుడ్‌లో తమన్నా, విజయ్ వర్మల బ్రేకప్‌పై ఇలానే వార్తలు సంచరిస్తున్నాయి. మరి ఈ వార్తలపై వారిద్దరిలో ఎవరైనా వివరణ ఇస్తారేమో చూద్దాం.
ఇవి కూడా చదవండి:
Jyothika: ‘కంగువ’పై కామెంట్స్ చేశారు, కానీ కొన్ని చెత్త సినిమాలకు.. ఇచ్చిపడేసిన జ్యోతిక
SSMB29: అడ్డడ్డే.. రాజమౌళికి ఎంత కష్టం వచ్చింది.. ఇక టార్చరే!