Surekha Vani Tatto: సురేఖా వాణి గత కొన్ని రోజుల నుంచి వార్తల్లో నిలుస్తుంది. అయితే, తాజాగా మళ్లీ కొత్త వీడియోతో ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈమె చేసిన పనికి జనాలు ఒక రేంజ్ లో ఏకిపారేస్తున్నారు. సాధారణంగా చాలా మంది టాటూలు వేపించుకుంటారు. కాకపోతే వాళ్ళు నార్మల్ వి వేయించుకుంటారు. ఈ మేడమ్ గారు అందరి కంటే స్పెషల్ గా ఉండాలనుకుని దేవుడికి సంబందించిన టాటూలు వేయించుకుంది. ప్రస్తుతం, దీనికి సంబందించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
Also Read: MP Etela Rajender: రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించ లేదనడం దారుణం.. ఈటల రాజేందర్
చేతిపై గోవింద నామాలు, శ్రీవారి పాదాల్ని టాటూగా వేయించుకుంది . ఈ నేపథ్యంలోనే ఆమె షేర్ చేసిన వీడియోను జనాలు చూసి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అంతే కాదు, ఆమె టాటూ వేయించుకునే టప్పుడు ఒకటే అరుపులు, గోల గోల చేసింది. ఆ టాటూను చూసి ఒక్కరూ కాదు, చాలా మంది విమర్శిస్తున్నారు. అసలు మీకు ఈ ఏజ్ లో టాటూ అవసరమా? భక్తి అనేది మనసులో ఉండాలి? ఇలా బయటకు చూపిస్తే మీకు వచ్చేదేంటి? అయినా ఇక్కడ భక్తి ఎక్కడా కనిపించడం లేదు. టాటూ మాత్రమే కనిపిస్తుంది? దేవుడితోనే ఆటలు ఎందుకు ఆడుతున్నారు? అంటూ.. ఇలా ఒక్కరూ కాదు.. చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు రక రకాల కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Thammudu Trailer: మాటపోయి మనిషి బతికినా మనిషిపోయినట్టే లెక్క.. అదే మనిషి పోయి మాట బతికితే..!
సోషల్ మీడియాలో సురేఖా వాణి, సుప్రితల గురించి చిన్న టాక్ బయటకు వచ్చినా కూడా నెటిజన్లు ఆడేసుకుంటున్నారు.వీళ్ళు చేసే పనులు అలాగే ఉంటాయి. వారిద్దరినీ కలిపి ట్రోలింగ్ చేస్తుంటారు. అందరి లాగే వీరు కూడా వెకేషన్‌లకు వెళతారు. కానీ, పొట్టి బట్టలు వేసుకుని పార్టీలు చేసుకుంటారు. పార్టీ చేసుకుంటే చేసుకున్నారు. అవి పబ్లిక్ లోకి ఎందుకు తీసుకురావడం అని నెటిజన్లు ట్రోలింగ్ చేస్తూనే ఉంటారు.
Also Read: UPSC Recruitment 2025: లైఫ్ సెట్ అయ్యే జాబ్స్.. యూపీఎస్సీలో ఉద్యోగాలు.. వెంటనే, అప్లై చేసుకోండి!
ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఇది నీకు మంచిగా అనిపిస్తుందా.. ఎందుకంత ఓవర్ యాక్షన్ ఆపుతావా? అంటూ ఫైర్ అవుతున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.