Ranveer
ఎంటర్‌టైన్మెంట్

Supreme Court: ‘మీరు బూతులు మాట్లాడితే.. మేము రక్షణ కల్పించాలా’

Supreme Court: ప్రస్తుతం ఇండియన్ ఇంటర్నెట్ కమ్యూనిటీని కుదిపేస్తున్న ఘటన ‘ఇండియాస్‌ గాట్‌ లేటెంట్ ’ (India Got Latent) షోలో ప్రముఖ యూట్యూబర్ రణ్‌వీర్‌ అల్హాబాదియా (Ranveer Allahbadia) చేసిన అసభ్యకరమైన కామెంట్స్. ఇప్పటికే ఈ ఘటన ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం(Supreme Court) పరిధిలోకి వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుపై సుప్రీం స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మొదట తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. ఆ తర్వాత ఊరట కల్పించడమే కాకుండా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

ఇటీవల ప్రముఖ కమెడియన్ సమయ్ రైనా(Samay Raina) నిర్వహిస్తున్న ‘ఇండియాస్‌ గాట్‌ లేటెంట్ ’కు రణ్‌వీర్‌ జడ్జ్ గా హాజరయ్యాడు. షోలో ఓ కంటెస్టెంట్ తో ‘‘మీ తల్లిదండ్రులు శృంగారం చేయడం జీవితాంతం చూస్తావా..? లేదా ఒక సారి వారితో కలిసి దీన్ని శాశ్వతంగా ఆపేస్తావా..?’’ అంటూ ప్రశ్నించాడు. దీంతో ఈ వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపడంతో అస్సాం, మహారాష్ట్ర సీఎంలతో పాటు పార్లమెంట్ కమిటీ కూడా తీవ్రంగా ఖండించి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే రణ్‌వీర్‌ పై దేశవ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. దీంతో రణ్‌వీర్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.

రంగంలోకి చంద్రచూడ్‌ వారసుడు..

ఆయన సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ కుమారుడు అభినవ్‌ చంద్రచూడ్‌ ని న్యాయవాదిగా నియమించుకున్నాడు. ఆయన రణ్‌వీర్ తరఫున వాదనలు వినిపిస్తూ.. “నైతిక విలువల ప్రకారం నా క్లైంట్‌ కామెంట్స్ ను సమర్ధించాను. కానీ.. అతనిని, వారి కుటుంబాన్ని హత్య చేస్తామంటూ బెదిరింపులు చేస్తున్నారు. నా క్లైంట్‌ రక్షణ కల్పించాలని” కోరారు. దీనికి సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ..

‘‘మీరు చేసింది అసభ్యత కాకపోతే ఇంకేంటి..? మీ బ్రెయిన్ లోని ట్రాష్ అంతా ఆ షోలో బయటపెట్టారు. ఇలాంటి ప్రవర్తన ఖండించదగినది. మీరు పాపులర్ అని చెప్పి, ఏదైనా మాట్లాడతా అంటే సమాజం ఆమోదించదు. ఇలాంటి భాషను ఎవరైనా ఇష్టపడతారా..? ఇలాంటి వ్యక్తులకు కోర్టు ఎందుకు రక్షణ కల్పించాలి’’ అని ప్రశ్నించింది. అనంతరం ఇకపై ఈ వ్యవహారానికి సంబంధించి ఎక్కడ కేసులు నమోదు చేయొద్దని ఊరట కల్పించింది. అలాగే కోర్టు ఆదేశాలు లేకున్నా విదేశాలకు పారిపోయే ప్రయత్నాలు చేయొద్దని హెచ్చరించింది. పాస్‌పోర్టును మహారాష్ట్ర థానే పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేయాలనీ ఆదేశించింది. ఇక నుంచి కోర్టు ఆదేశించేంత వరకు ఎలాంటి షోలు నిర్వహించకూడదని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

Chhaava: ‘ఛావా’ నిజంగానే గొప్ప సినిమానా?

SKN Controversy: పోరా.. ఎస్‌కెఎన్‌‌పై మండిపడిన హీరోయిన్

 

 

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది