Madharaasi Event
ఎంటర్‌టైన్మెంట్

Sivakarthikeyan: చిరు డైలాగ్ చెప్పమంటే బాలయ్య డైలాగ్.. సుమకి షాకిచ్చిన శివకార్తికేయన్!

Sivakarthikeyan: శివకార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఆయన చేసిన సినిమాలు తెలుగులో కూడా విడుదలై మంచి సక్సెస్ సాధించినవి ఉన్నాయి. ప్రస్తుతం ఆయన చేసే ప్రతి సినిమా తెలుగులో విడుదల అవుతూనే ఉంది. ఇప్పుడాయన హీరోగా సంచలన దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘మదరాసి’ (Madharaasi). హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మించింది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై భారీగా అంచనాలను పెంచుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5 గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు రెడీ చేస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యాంకర్ సుమ (Anchor Suma) హోస్ట్‌గా వ్యవహరించగా.. ఆమెకు షాకిచ్చారు హీరో శివకార్తికేయన్. ఆ వివరాల్లోకి వెళితే..

Also Read- Anushka Shetty: రానాతో అనుష్క ఫోన్ ఇంటర్వ్యూ.. స్వీటీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!

చిరు డైలాగ్ చెప్పంటే బాలయ్య డైలాగ్..

సుమ నార్మల్ ఏ హీరోనైనా రాపిడ్ క్వశ్చన్స్ అంటూ కొన్ని ప్రశ్నలు వేస్తుంటారు. శివ కార్తికేయన్‌ను కూడా ఓ మూడు ప్రశ్నలు అడిగారు. అందులో మొదటి ప్రశ్న ఒక స్టెప్ వేయాలి? అని అడిగితే.. శివకార్తికేయన్ ఒక అడుగు ముందుకు వేసి స్టెప్ వేశానని అన్నారు. కుర్రాడి దగ్గర చాలా టాలెంట్ ఉందని భావించిన సుమ.. రెండో ప్రశ్నగా ఏదైనా ఒక హమ్మింగ్ చేయమని సుమ అడిగారు. అందుకు ఏం సాంగ్? అని ఎస్‌కె ప్రశ్నించగా.. మీ ఇష్టం ఏదైనా ఓకే అని సుమ చెప్పారు. వెంటనే ‘వచ్చుండాయ్ ఫీలింగ్స్’ అని శివకార్తికేయన్ పాడారు. అంతా క్లాప్స్‌తో హోరెత్తించారు. ఇక మూడో ప్రశ్నకే సుమ షాకయింది. మూడో ప్రశ్నగా ఒక డైలాగ్ చెప్పమన్నారు సుమ. ఏం డైలాగ్? అని ఎస్‌కె ప్రశ్నించగా.. ‘మొక్కే కదా అని పీకేస్తే.. పీక కోస్తా ’ అని సుమ చెప్పారు. దీనిని మిమిక్రీ చేస్తూ.. రజినీ వాయిస్‌లో చెప్పమని సుమ అడిగారు. చిరంజీవి (Chiranjeevi) డైలాగ్ చెప్పమని సుమ డైలాగ్ కూడా చెబితే, శివకార్తికేయన్ మాత్రం.. ‘చూడు.. ఒక వైపే చూడు’ అని రజినీకాంత్ (Rajinikanth) వాయిస్‌లో వినిపించారు. అంతే.. సుమ వెంటనే తేరుకుని.. బాలకృష్ణ (Balakrishna) వాయిస్‌ని రజినీకాంత్ వాయిస్‌లో వినిపించారు అంటూ కామ్‌గా పక్కకి వెళ్లిపోయారు.. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నందమూరి ఫ్యాన్స్ ఈ వీడియోలను షేర్ చేస్తూ.. చిరంజీవిని ట్రోల్ చేస్తున్నారు.

Also Read- Ramanaidu Film School: రామానాయుడు ఫిలిం స్కూల్‌లో మహిళా ప్రొఫెసర్‌కు వేధింపులు.. వేధించిందెవరో తెలిస్తే షాకవుతారు?

ఆయన దగ్గర చాలా డబ్బుంది

ఇక ఈ ఈవెంట్‌లో శివకార్తికేయన్ మాట్లాడుతూ… ఇది ఎ.ఆర్. మురుగదాస్ సినిమా. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి పెద్ద స్టార్స్‌ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ మురుగదాస్. ఆయనతో కలిసి వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు సాలిడ్ ఫిల్మ్ ఇచ్చారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ నా ప్రాణ స్నేహితుడు రాక్ స్టార్ అనిరుద్. అనిరుద్ అంటే హిట్ మిషన్. ఆయన ఇచ్చే పాటలన్నీ హిట్టయ్యాయి. సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది. ఈ సినిమాకి నిర్మాత తిరుపతి ప్రసాద్. చాలా సింపుల్ పర్సన్. చాలా పెద్ద సినిమాలు తీశారు. ఆయన దగ్గర చాలా డబ్బుంది. కంటెంట్ ఉంటే ఆయన ఎంతైనా ఖర్చు చేస్తారు. ఆయనలో ఆ క్వాలిటీ నాకు చాలా ఇష్టం. అందుకే తెలుగు సినిమాలు తరచుగా వెయ్యి కోట్లకు రీచ్ అవుతున్నాయి. వెళ్తుంటాయి. ఈ సినిమాలో టాలెంటెడ్ హీరోయిన్ రుక్మిణి నటించింది. సినిమాలో లవ్, యాక్షన్ రెండు పిల్లర్స్. విద్యుత్ జమ్వాల్ అద్భుతంగా నటించారు. ఆయనతో చేసే యాక్షన్ సీక్వెన్స్ చాలా క్రేజీగా ఉంటాయి. సెప్టెంబర్ 5న థియేటర్స్‌కు వెళ్లి ‘మదరాసి’ చూడండి. ఎంజాయ్ చేయండని అన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ