Rana Daggubati and Anushka Shetty
ఎంటర్‌టైన్మెంట్

Anushka Shetty: రానాతో అనుష్క ఫోన్ ఇంటర్వ్యూ.. స్వీటీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!

Anushka Shetty: మంచి పీక్ టైమ్‌లో అనుష్క ‘సైజ్ జీరో’ (size zero) సినిమా చేసి.. తన కెరీర్‌కు ఆటంకాన్ని ఏర్పరచుకుంది. ఆ సినిమా కోసం లావు పెరిగి, తిరిగి సన్నగా మారడానికి ఎంతగానో ట్రై చేస్తుంది. కానీ, ఎంత ట్రై చేసినా, ఆమె మళ్లీ నార్మల్ స్థితికి రాలేకపోతుంది. దీంతో పబ్లిక్‌లో కనిపించడానికి కూడా ఆమె ముఖం చాటేస్తుంది. అలాగే సినిమాల విషయంలో కూడా తన ఫ్యాన్స్‌ని డిజప్పాయింట్ చేస్తుంది. అనుష్క (Anushka Shetty) ఓకే అంటే, ఆమెతో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు క్యూలో ఉంటారు. కానీ, ఆమె అవతారంలో ఛేంజ్ అయిన తర్వాత అవకాశాలు రావడం లేదో, లేదంటే.. అలా కనిపించడం ఇష్టం లేక వచ్చిన అవకాశాలను వద్దనుకుంటుందో తెలియదు కానీ, ఆమె నుంచి సినిమా రావడానికి సంవత్సరాల టైమ్ పడుతుంది. ఇకపై ఆ సమస్య లేదు.. అనుష్క నుంచి వరుస సినిమాలు ఆశించే వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. స్వయంగా అనుష్కే ఆ విషయాన్ని చెప్పింది. తాజాగా ఆమె దగ్గుబాటి రానా(Daggubati Rana)కు ఫోన్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో కొన్ని ఆసక్తికర విషయాలను అనుష్క చెప్పింది. ఆ సంభాషణను గమనిస్తే..

ప్రస్తుతం సమాజానికి చెందిన కథ
ముందుగా ‘ఘాటీ’ గురించి అనుష్క మాట్లాడుతూ.. ‘‘ఘాటి వైలెంట్, ఇంటెన్స్ చిత్రం. ఇందులోని వయోలెన్స్‌ను పక్కన పెడితే.. ఈ కథ ఇప్పటి సమాజ పరిస్థితులకు సరిపోతుంది. ఇలాంటి కథకు ఇది సరైన సమయం అని భావిస్తున్నాను. బాహుబలి, అరుంధతి సినిమాల తర్వాత వరుసలో ఘాటీ నిలిస్తుంది. ఈ కథ ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో జరుగుతుంది. ఈ బ్యాక్ డ్రాప్, విజువల్స్.. చూస్తున్న ప్రేక్షకులకి చాలా కొత్త అనుభూతిని ఇస్తాయి. ప్రారంభంలో ఇది ఒక గ్రూప్ స్టోరీగా ఉంటుంది. కథ నడిచే కొద్దీ వ్యక్తిగతంగా మారుతుంది. దేశీ రాజు, శీలావతి క్యారెక్టర్స్ జర్నీని క్రిష్ అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇందులో ప్రతీది ఆర్గానిక్‌గా ఉంటుంది.

Also Read- Lavanya Tripathi’s Movie: అథర్వ మురళి, లావణ్య త్రిపాఠిల గ్రిప్పింగ్ యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ డేట్ ఫిక్స్!

కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్ర
ఈ కథలో అద్భుతమైన ట్రాన్ఫర్మేషన్ వుంది. బాధితురాలు తన దారి తానే చూజ్ చేసుకుని, క్రిమినల్ అవుతుంది. కానీ ఆ ప్రయాణంలో ఒక లెజెండ్‌గా మారుతుంది. అదే రిడంప్షన్ ఆర్క్. మనం కోల్పోయిన దాంట్లోంచి మళ్లీ లేచినప్పుడే మనం మరింత గొప్పగా మారతామని ఈ కథ చెబుతుంది. ఈ కథలో ఆ విషయాన్ని చెప్పిన తీరు నిజంగా అద్భుతంగా ఉంది. క్రిష్‌ నాకెప్పుడూ గొప్ప పాత్రలే ఇస్తారు. ‘వేదం’లో చేసిన సరోజ పాత్ర కూడా చాలా సెన్సిటివ్ రోల్. అయినా ఆయన చాలా గొప్పగా చూపించారు. నా కెరీర్‌లో ఎప్పటికీ గుర్తిండిపోయే పాత్రల్లో అదీ ఒకటి. ఇప్పుడు వచ్చే ‘ఘాటీ’లో శీలావతి పాత్ర కూడా నాకు అలాంటి మెమరబుల్ క్యారెక్టర్ అవుతుంది’’ అని అనుష్క చెప్పుకొచ్చింది.

Also Read- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫుల్ మీల్స్ పోస్టర్.. హరీష్‌కు ఈసారి టెంపులే!

మా ఇళ్లల్లో జరిగే పెళ్లిళ్లకు వెళ్లట్లే!
అనంతరం రానా మాట్లాడుతూ.. ఇకపై కూడా ఇలానే మూడేళ్లకు ఒక సినిమా చేస్తావా ఏంటి? నిన్ను కలిసి సుమారు 10 ఏళ్లు అవుతోంది తెలుసా? అని రానా ప్రశ్నించగా.. ‘‘లేదు.. ప్రస్తుతం మంచి స్క్రిప్ట్‌లు ఎంపిక చేసుకుంటున్నా. ఈ ఏడాది చివరి నుంచి వరుస సినిమాలు చేస్తాను. ప్రజంట్ నేను మా ఇళ్లల్లో జరిగే పెళ్లిళ్లకు కూడా వెళ్లడం లేదు. మా బంధువులందరూ కూడా ఎప్పుడు కనిపిస్తావ్‌? అని అడుగుతున్నారు. త్వరలోనే అందరి ముందుకు వస్తాను’’ అని స్వీటీ తెలిపింది. ‘ఇటీవల చెన్నైలో డైరెక్టర్ క్రిష్‌ను డిన్నర్ టైమ్‌లో కలిసాను. అప్పుడు ఆయన ఈ ఘాటి గురించి చాలా ఎక్సైటెడ్‌గా చెప్పారు. ‘ఘాటి’ ప్రీమియర్‌కి తప్పకుండా వస్తాను’ అని రానా అనుష్కకు మాటిచ్చారు. కాగా, అటు అనుష్కకు.. ఇటు క్రిష్‌కు రానా దగ్గుబాటి స్నేహితుడనే విషయం తెలిసిందే. అనుష్క శెట్టి నటించిన రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఘాటి’ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ సమర్పిస్తోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?