Lavanya Tripathi’s Movie: అథర్వ, లావణ్య త్రిపాఠిల మూవీ వస్తోంది
Tunnel movie
ఎంటర్‌టైన్‌మెంట్

Lavanya Tripathi’s Movie: అథర్వ మురళి, లావణ్య త్రిపాఠిల గ్రిప్పింగ్ యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ డేట్ ఫిక్స్!

Lavanya Tripathi’s Movie: పెళ్లి అయిన తర్వాత కూడా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ భార్య, హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) కొన్ని సెలక్టెడ్ మూవీస్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్‌గా ఉన్నారు. ఇప్పుడామె పెళ్లికాక ముందు చేసిన ఓ మూవీ థియేటర్లలోకి వచ్చేందుకు డేట్ ఫిక్స్ చేసుకుంది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఎప్పుడు విడుదల అవుతుందనే వివరాల్లోకి వెళితే..

సెప్టెంబర్ 12న విడుదల
కోలీవుడ్ హీరో అథర్వ మురళీ (Atharva Murali) ఖాకీ చొక్కా వేసుకున్న సినిమాలు.. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్స్‌లో ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుని, బాక్సాఫీస్ వద్ద హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఈ క్రమంలో అథర్వ మురళీ మరోసారి తనకు కలిసి వచ్చిన యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ జానర్‌లో చేసిన చిత్రం ‘టన్నెల్‌’ (Tunnel Movie). రవీంద్ర మాధవ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అథర్వ సరసన లావణ్య త్రిపాఠి పోషించిన పాత్రకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇప్పటి వరకు లావణ్య త్రిపాఠి చేయని పాత్రని ఇందులో చేసిందని చెప్పుకోవచ్చు. అలాగే అశ్విన్ కాకుమాను చేసిన విలన్ పాత్ర కూడా ఈ సినిమాకు చాలా కీలకమని ఇటీవల వచ్చిన ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీని తెలుగులో ఎ. రాజు నాయక్ లచ్చురామ్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదల చేస్తున్నారు.

Also Read- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫుల్ మీల్స్ పోస్టర్.. హరీష్‌కు ఈసారి టెంపులే!

ట్రైలర్‌లో ఉన్న మ్యాటరిదే..
ఇటీవల తమిళ్‌లో వచ్చిన ట్రైలర్‌ని గమనిస్తే.. ఇందులో అథర్వ మురళీ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. ఒక టన్నెల్‌లో ఉంటూ క్రూరమైన హత్యలు చేస్తున్న ఓ గ్యాంగ్‌ని, వాటి వెనుకున్న సైకోని పట్టుకునేందుకు పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడు? సమాజాన్నే తన కుటుంబం అనుకునే ఆ పోలీస్.. చివరకు ఆ సైకోని పట్టుకున్నాడా? లేదా? అన్న అంశాలతో ఎంతో ఆసక్తికరంగా, గ్రిప్పింగ్, అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్‌తో ట్రైలర్‌ను కట్ చేశారు. జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. తెలుగు వెర్షన్‌కు సంబంధించి త్వరలోనే ప్రమోషన్స్‌ను ప్రారంభించనున్నారని తెలుస్తోంది. తెలుగు వర్షెన్ ట్రైలర్‌ను కూడా రెండు మూడు రోజుల్లో విడుదల చేసి, టాలీవుడ్‌లోనూ సినిమాపై అంచనాలు పెంచాలని మేకర్స్ భావిస్తున్నారు. చిత్ర హీరో అథర్వ మురళీ తెలుగు ప్రమోషన్స్‌లో సైతం పాల్గొననున్నారని తెలుస్తోంది.

Also Read- Viral Video: ఒరేయ్ బుడ్డోడా.. ఎంత పని చేశావ్‌రా.. నీ దెబ్బకు అంతా వణికిపోయారు!

‘మిరాయ్’కి పోటీగా..
సెప్టెంబర్ 12న పాన్ ఇండియా సినిమా ‘మిరాయ్’ గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్‌ను యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ సినిమాతో పాటు టాలీవుడ్‌లో మరో రెండు సినిమాలు కూడా రిలీజ్ కావాల్సి ఉంది. కాకపోతే ఆ సినిమాలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. కాబట్టి ఆ సినిమాలు వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. అదే జరిగితే ‘మిరాయ్’కి సోలో రిలీజ్ లభించినట్లే. ‘మిరాయ్’కి పోటీకి ‘టన్నెల్’ మాత్రమే రేసులో ఉండే అవకాశం ఉంది. ఇది ‘టన్నెల్’కి కూడా కలిసి వస్తుందని భావించవచ్చు. చూద్దాం.. ఏం జరుగుతుందో?

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం