Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు (సెప్టెంబర్ 2)ను పురస్కరించుకుని ఆయన చేస్తున్న సినిమాల నుంచి అప్డేట్స్ మొదలయ్యాయి. ముఖ్యంగా హరీష్ శంకర్ (Harish Shankar) ఒక రోజు ముందే, అభిమానులకు ఫుల్ మీల్స్ అంటూ తను డైరెక్ట్ చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) నుంచి ఓ అద్భుతమైన పోస్టర్‌ను ఇచ్చేశాడు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. ఎందుకంటే, ఇప్పటి వరకు తను ఎందులో వీక్ అని పవన్ కళ్యాణ్ చెబుతూ వస్తున్నాడో.. దానినే ప్లస్ చేసి ఈ పోస్టర్‌లో చూపించాడు హరీష్. అంతే, ‘హరీషన్న ఈసారి కూడా ఏదో మ్యాజిక్ చేయబోతున్నాడు.. అదే జరిగితే మాత్రం అన్నకు ఈసారి టెంపుల్ పక్కా’ అనేలా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Also Read- Telugu Director: చెప్పుతో కొట్టుకుంటూ.. భోరున విలపించిన తెలుగు దర్శకుడు.. వీడియో వైరల్!
పోస్టర్ ఎలా ఉందంటే..
ఈ పోస్టర్‌ను గమనిస్తే.. ఇందులో పవన్ కళ్యాణ్ టోపీ ధరించిన స్టైల్ మైకల్ జాక్సన్‌ని తలపిస్తోంది. వెనుక గడియారం కనిపిస్తుంటే, పవన్ కళ్యాణ్ వేస్తున్న స్టెప్‌ను డ్యాన్సర్స్ ఆశ్చర్యంగా చూస్తున్నారు. మొత్తంగా అయితే హరీష్ చెప్పినట్లుగానే ఈ పోస్టర్‌తో ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ ఇచ్చేశారు. ‘స్టైల్, స్వాగ్, బాక్సాఫీస్‌లలో ఉస్తాద్… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు! ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అభిమానులకు, ప్రేక్షకులకు కనుల పండుగ కానుంది.’ అంటూ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. వాస్తవానికి మేకర్స్ చెప్పిన టైమ్ కంటే కూడా ముందే ఈ పోస్టర్‌ను రిలీజ్ చేయడంతో.. నిర్మాణ సంస్థకు, హరీష్ శంకర్‌కు ఫ్యాన్స్ ధన్యవాదాలు చెబుతున్నారు. ఈ పోస్టర్‌లో ఒక్కసారిగా సినిమాపై హైప్‌ని పెంచారు దర్శకుడు హరీష్ శంకర్. తన సినిమాలలో హీరోలను అద్భుతంగా చూపించడంలో హరీష్ శంకర్‌కు మంచి పేరుంది. పవన్ కళ్యాణ్ కోసం తనలోని అభిమానిని మరోసారి బయటకు తీసుకువచ్చి, ఓ పాట స్టిల్‌తో అభిమానులందరికీ మరిచిపోలేని పుట్టినరోజు విందును ఇచ్చారని చెప్పుకోవచ్చు. అభిమానులు మరియు ప్రేక్షకుల నాడి మరెవరికీ తెలియనంతగా తనకు తెలుసని, ఈ పోస్టర్‌తో మరోసారి పవన్ కళ్యాణ్ పట్ల అభిమానం చాటుకున్నారు హరీష్ శంకర్.
Also Read- Nenu Ready Film: హవీష్, కావ్య థాపర్ రామోజీ ఫిల్మ్ సిటీలో..
ఫ్యాన్స్‌కు కొత్త ఆశలు
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా తమిళ్‌తో విజయ్, అట్లీ కాంబోలో వచ్చిన ‘థేరీ’ సినిమాకు రీమేక్ అనేలా అప్పట్లో వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ మధ్య పవన్ కళ్యాణ్ అన్నీ రీమేక్సే చేస్తుండటంతో పాటు, హరీష్ శంకర్ వంటి దర్శకుడితో మరోసారి రీమేక్, అందులోనూ తెలుగులో కూడా వచ్చిన సినిమాను మళ్లీ రీమేక్ చేయడంతో.. అసలీ ప్రాజెక్ట్‌పై ఫ్యాన్స్ ఆశలు వదిలేసుకున్నారు. కాకపోతే హరీష్ శంకర్ మేకింగ్ స్టైల్‌పై ఉన్న నమ్మకంతో ఎక్కడో కొద్దిగా ఆశలు పెట్టుకున్నారు. కానీ, చిత్ర టీజర్, ఎన్నికలకు ముందు గ్లాస్ డైలాగ్, ఇప్పుడు వచ్చిన పోస్టర్‌తో ఈ సినిమాపై ఫ్యాన్స్‌కు కొత్త ఆశలు మొదలయ్యాయి. హరీష్ శంకర్ కచ్చితంగా హిట్ సినిమానే తీస్తాడు అంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ హరీష్ శంకర్‌కి కూడా ఇప్పుడు హిట్ అవసరం కాబట్టి.. ఒరిజినల్ వెర్షన్‌ని మ్యాగ్జిమమ్ మార్చి, సరికొత్త ఫీల్ తెప్పిస్తాడని అంతా ఆశపడుతున్నారు.
Happy Birthday to the USTAAD of style, swag and box office – POWER STAR @PawanKalyan ❤🔥#UstaadBhagatSingh will be a feast for fans and a delight for the audience 💥💥#HBDPawanKalyan@harish2you @sreeleela14 #RaashiiKhanna @ThisIsDSP @DoP_Bose #AnandSai @MythriOfficial… pic.twitter.com/Yvtjw7BORL
— Mythri Movie Makers (@MythriOfficial) September 1, 2025
శ్రీలీల – దేవిశ్రీ
సెప్టెంబర్ 6 నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు చిత్రీకరణలో పాల్గొంటారు. ఈ షెడ్యూల్‌తో టాకీ భాగం దాదాపు పూర్తవుతుందని మేకర్స్ తెలిపారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటిస్తుండగా, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) చాలా గ్యాప్ తర్వాత మరోసారి పవన్ కళ్యాణ్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానిక సంబంధించిన విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు