Sujeeth Birthday Poster (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Sujeeth Birthday: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘ఓజీ’ (OG) దర్శకుడు సుజీత్ నేడు (అక్టోబర్ 26) తన పుట్టినరోజు (Happy Birthday Sujeeth)ను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ నుంచి, అభిమానుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా, ‘ఓజీ’ సినిమాను నిర్మించిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ (DVV Entertainment) సంస్థ సుజీత్‌కు ప్రత్యేకంగా, హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెప్పింది. ‘హ్యాపీ బర్త్‌డే సుజీత్.. సంభవం.. థ్యాంక్యూ.. ఇంతకంటే ఏం చెప్పగలము’ అంటూ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ (Pawan Kalyan OG) ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా… బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఈ విజయాన్ని ఉద్దేశించే నిర్మాణ సంస్థ ‘సుజీత్ సంభవం’ అనే పదాన్ని ప్రస్తావించి, ఇంతకంటే ఏం చెప్పగలం అంటూ సుజీత్ పట్ల తమ కృతజ్ఞతను, ఆనందాన్ని వ్యక్తం చేసింది.

Also Read- Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

పోస్టర్ కూడా వైరల్

పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన సుజీత్, ‘ఓజీ’తో తన అభిమాన హీరోకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. దీంతో ఈ ట్వీట్ మెగా ఫ్యాన్స్‌ను మరింత ఆనందానికి గురిచేసింది. పవర్ స్టార్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున సుజీత్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ, ‘ఓజీ’ విజయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ డీవీవీ సంస్థ విడుదల చేసిన పోస్టర్ కూడా అందరినీ మెప్పిస్తోంది. ఈ పోస్టర్‌ను అభిమానులు షేర్ చేస్తూ.. They Call Him OG అనే ట్యాగ్‌ను వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్యాగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Also Read- Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది

నానితో చేస్తున్న సినిమా టీమ్ కూడా..

ఇదిలా ఉంటే.. ఒకవైపు ‘ఓజీ’ సక్సెస్ ఆనందాన్ని పంచుకుంటూనే, సుజీత్ తన తదుపరి ప్రాజెక్టును కూడా ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) హీరోగా ఒక సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన టీమ్ కూడా దర్శకుడికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ‘రన్ రాజా రన్’ తరహా ఎంటర్‌టైనర్‌గా, డార్క్ కామెడీగా ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఈ చిత్రంలో నానికి జంటగా పూజా హెగ్డేను ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది దీపావళి తర్వాత రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, 2026 చివరి నాటికి సినిమాను విడుదల చేయాలనే లక్ష్యంతో చిత్ర యూనిట్ ఉంది. పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరోతో భారీ విజయాన్ని అందుకున్న సుజీత్.. నానితో ఎలాంటి ఎంటర్‌టైనర్‌ను అందిస్తాడో అని సినీ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!