Napoleon Returns (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది

Napoleon Returns: ఆచార్య క్రియేషన్స్ బ్యానర్‌పై.. ఆనంద్ రవి (Anand Ravi) దర్శకత్వంలో భోగేంద్ర గుప్త నిర్మించిన ప్రొడక్షన్ నెంబర్ 4 చిత్రానికి సంబంధించిన టైటిల్, గ్లింప్స్‌ను ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో లాంఛ్ చేశారు. ఆనంద్ రవి, దివి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి ‘నెపోలియన్ రిటర్న్స్’ (Napoleon Returns) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టైటిల్, గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్‌కు ‘విశ్వంభర’ దర్శకుడు వశిష్ట, సాయి రాజేష్, వంశీ నందిపాటి, అనిల్ విశ్వంత్ గెస్టులుగా హాజరయ్యారు. ఈ టైటిల్ గ్లింప్స్‌ని గమనిస్తే.. పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ ఇవ్వడానికి వచ్చిన హీరో అండ్ బృందం.. కంప్లయింట్ ఎవరిదని పోలీస్ అడగగానే.. మాదు కాదు కాదు.. దెయ్యానిది అని చెప్పడం చూస్తుంటే.. ఈ సినిమా థీమ్ ఏంటో అర్థమవుతోంది. ఇంతకీ మగ దెయ్యమా? ఆడ దెయ్యమా? అని పోలీస్ అధికారి అడిగితే.. ఆడ దెయ్యమని హీరో సమాధానమిస్తాడు. ఎవరావిడ? అని పోలీస్ అడిగితే.. ఆవిడ కాదు సార్.. గేదె సార్ అని హీరో సమాధానం చెప్పిన విని పోలీస్ ఆశ్చర్యపోతే.. అవును సార్.. నిన్న గేదె దెయ్యం ఇంటికి వచ్చి పోలీస్ కంప్లయింట్ ఇవ్వమని చెప్పింది సార్ అని చెబుతాడు. ఇంతకీ ఏ లాంగ్వేజ్‌లో గేదె చెప్పింది అనగానే.. ‘అంబా…’ అని చెప్పింది సార్ అని హీరో చెబుతాడు. డౌటే లేదు.. ఇది చిన్నపిల్లాడి పుర్రె అని.. మెయిన్ కథాంశాన్ని రివీల్ చేశారు. గ్లింప్స్‌ని ప్రతి ఫ్రేమ్ భయానికి కేరాఫ్ అడ్రస్‌లా ఉండటం గమనించవచ్చు. మొత్తంగా అయితే ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ చిన్న గ్లింప్స్‌తోనే సినిమాపై భారీ స్థాయిలో మేకర్స్ అంచనాలను పెంచేశారని చెప్పుకోవచ్చు.

Also Read- Star Heroines: ఈ స్టార్ హీరోయిన్స్ వచ్చేస్తున్నారు.. రీ ఎంట్రీ‌లో నిలబడతారా?

ఆనంద్ రవి రైటింగ్ అంటే చాలా ఇష్టం..

టైటిల్, గ్లింప్స్ విడుదల అనంతరం దర్శకుడు వశిష్ట మాట్లాడుతూ.. నేను ఆనంద్ రవి కోసమే ఈ వేడుకకు వచ్చాను. నీడ పోయిందని ‘నెపోలియన్’ తీశాడు. జంతువుల ఆత్మతోనూ కథను రాసుకోవచ్చని నాకు ఇప్పుడే తెలిసింది. ఈ మూవీ కథ నాకు తెలుసు. సినిమా అద్భుతంగా ఉండబోతోంది. ‘నెపోలియన్ రిటర్న్స్’ పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ.. నేను, వశిష్ట, ఆనంద్ రవి మంచి స్నేహితులం. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ చాలా బాగుంది. ఈ మూవీతో ఆనంద్ రవికి పెద్ద విజయం దక్కాలి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. అనిల్ విశ్వంత్ మాట్లాడుతూ.. ఆనంద్ రవి మొదటి సినిమాకు నేను పని చేశాను. ఆయన నాకు గురువు లెక్క. ఆయన రైటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన తీసుకునే హుక్ పాయింట్ చాలా బాగుంటుంది. ఈ మూవీ కథ కూడా నాకు తెలుసు. ప్రేక్షకులను ఎంగేజ్ చేసే సబ్జెక్ట్ ఇది. నిర్మాత గుప్తా వల్లే ‘పొలిమేర’ కాన్సెప్ట్ పుట్టింది. త్వరలోనే పొలిమేర 3 అప్డేట్ వస్తుంది.. ఈ చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ అని అన్నారు.

Also Read- Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఇదేనా? ప్రేమికులకు పండగే!

అన్నివిధాలా సంతృప్తినిచ్చిన సినిమా..

చిత్ర నిర్మాత భోగేంద్ర గుప్తా మాట్లాడుతూ.. మా కోసం ఈ వేడుకకు వచ్చిన సాయి రాజేష్, వశిష్ట, అనిల్, ఇంకా మీడియాకు థాంక్స్. ఆనంద్ ఈ కథ కోసం చాలా కష్టపడ్డారు. ఏడాదిన్నర పాటు ప్రీ ప్రొడక్షన్ కోసమే పని చేశారు. మంచి సబ్జెక్ట్‌తో అందరి ముందుకు రాబోతోన్నాం. త్వరలోనే మరిన్ని విషయాలు తెలియజేస్తామని తెలిపారు. చిత్ర హీరో, డైరెక్టర్ ఆనంద్ రవి మాట్లాడుతూ.. పరమానందయ్య శిష్యుల కథ ఒకటి చెప్పాలి. ఇద్దరు శిష్యులు గారె తింటుంటే.. మూడో వాడు వచ్చి ఆకలిగా ఉందని అడగగానే ఒక గారె ఇచ్చి, ఆకలి తీరిందా అని అడుగుతారు. తిరలేదు అనగానే ఇంకోటి.. అలా 4 గారెల అనంతరం 5వ గారెకు ఆకలి తీరినట్లుగా మూడో వాడు చెప్పగానే మొదటి వాడు రెండో వాడిని ఉద్దేశించి ముందే ఈ 5వ గారె ఇచ్చేస్తే.. ముందు తిన్న నాలుగు గారెలు మిగిలేవి కదా అని అంటాడు. అలాగే ‘పేరెంట్స్’, ‘ప్రతినిధి’, ‘నెపోలియన్’, ‘కొరమీను’ చిత్రాల తర్వాత నా నుంచి వస్తున్న ‘నెపోలియన్ రిటర్న్స్’ నాకు ఐదవ గారెలాంటిది. అన్నివిధాలా సంతృప్తిని ఇచ్చిన సినిమా. మా కోసం వచ్చిన వశిష్ట, సాయి రాజేష్, అనిల్‌కు థాంక్స్. ఈ ప్రయాణంలో నాకు నిర్మాత గుప్తా ఎంతగానో సహకరించారు. ఇక్కడ ఎన్ని సినిమాలు చేసినా సక్సెస్ ఉంటేనే గుర్తింపు. ఈ సినిమాతో నాకు సక్సెస్, మంచి గుర్తింపు వస్తుంది. సినిమా అంతా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్‌గానే ఉంటుంది. తొమ్మిది నెలల పిల్లాడు ఆత్మగా మారే పాయింట్‌తో ఇంత వరకు ఎక్కడా సినిమా రాలేదు. మున్ముందు జరిగే వేడుకలలో ఈ మూవీ గురించి మరింతగా తెలియజేస్తానని చెన్నారు. ఇంకా ఆటో రామ్ ప్రసాద్, దివి.. తమకు మంచి పాత్రలు ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు చెప్పారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌ను పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు