Ustaad Bhagat Singh (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఇదేనా? ప్రేమికులకు పండగే!

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) అభిమానులకు శుభవార్త! ‘ఓజీ’ విజయం తర్వాత పవన్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) విడుదల తేదీకి సంబంధించి టాలీవుడ్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. పవన్, డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను 14 ఫిబ్రవరి, 2026న ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదల తేదీపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ‘ఓజీ’తో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో హరీష్ శంకర్ సినిమా అంటే మ్యాగ్జిమమ్ ఉంటుందనే విషయం తెలియంది కాదు.

Also Read- Chiranjeevi: పేరు, ఫొటోల విషయంలో చిరంజీవి తీసుకున్న నిర్ణయానికి కారణం బాలయ్యేనా?

వాలెంటైన్స్ డేకి పవర్ స్టార్ సర్‌ప్రైజ్?

‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన ఈ కాంబినేషన్ నుంచి సినిమా వస్తుండటంతో, సహజంగానే అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ అంచనాలను దృష్టిలో ఉంచుకుని, చిత్ర యూనిట్ ఒక పండుగ వాతావరణంలో సినిమాను విడుదల చేయాలని భావిస్తోందట. అందుకే, యువతను, కుటుంబ ప్రేక్షకులను ఆకర్షించే వాలెంటైన్స్ డేని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. నిజంగా ఫిబ్రవరి 14న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ థియేటర్లలోకి వస్తే, పవన్ కళ్యాణ్ అభిమానులకు, సాధారణ ప్రేక్షకులకు అది పండగే అని చెప్పొచ్చు.

Also Read- Star Heroines: ఈ స్టార్ హీరోయిన్స్ వచ్చేస్తున్నారు.. రీ ఎంట్రీ‌లో నిలబడతారా?

పోటీలో నిఖిల్ ‘స్వయంభూ’

అదే రోజున యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభూ’ కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా ఇండస్ట్రీ టాక్ నడుస్తోంది. నిఖిల్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై కూడా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఉంది. పవన్ కళ్యాణ్ వంటి అగ్ర నటుడి సినిమాతో నిఖిల్ తలపడితే బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీ నెలకొంటుంది. కానీ, పవన్ కళ్యాణ్ సినిమా ఉంటే, నిఖిల్ వెనకడుగు వేస్తాడు. అందులో అనుమానమే లేదు. అయినా, ఈ సినిమా ఇంకా చిత్రీకరణలోనే ఉంది. ఎప్పుడు పూర్తవుతుందో మేకర్స్ క్లారిటీ ఇవ్వడం లేదు. ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయానికి వస్తే.. షూటింగ్ చివరి దశలో ఉందని, పవన్ కళ్యాణ్ తన పార్ట్‌ను పూర్తి చేసినప్పటికీ, ఇంకా 20-25 రోజుల చిత్రీకరణ మిగిలి ఉందని సమాచారం. మొత్తం షూటింగ్ పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేసి, ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మైత్రీ మూవీ మేకర్స్ గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

The Girlfriend: రష్మిక రెమ్యూనరేషన్ తీసుకోలేదు.. ఆసక్తికర విషయం చెప్పిన నిర్మాత

Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ నిడివి ఎంతో తెలుసా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఇదేనా? ప్రేమికులకు పండగే!

Dragon: ఎన్టీఆర్, నీల్ ‘డ్రాగన్’పై ఈ రూమర్స్ ఏంటి? అసలు విషయం ఏమిటంటే?

Private Buses: కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో తనిఖీలు.. తెలంగాణలో తొలిరోజే 4 బస్సులు సీజ్