Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తన పేరు, ఫోటో, వాయిస్, బిరుదులను (మెగాస్టార్, చిరు, అన్నయ్య) అనధికారికంగా వాణిజ్య లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా నిరోధిస్తూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఇటీవల జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ చర్య వెనుక కేవలం వాణిజ్య దోపిడీని అరికట్టడం మాత్రమే కాక, ఇటీవల రాజకీయ పరిణామాలు కూడా ఉన్నాయనే చర్చ జోరుగా నడుస్తోంది.
కోర్టు ఆదేశాలు – దేనికి రక్షణ?
సెప్టెంబర్ 26, 2025న కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఎవరైనా చిరంజీవి వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘిస్తే, వారిపై సివిల్, క్రిమినల్ చట్టాల కింద కఠిన చర్యలు తప్పవు. ముఖ్యంగా డిజిటల్, ఏఐ వేదికల ద్వారా జరుగుతున్న తప్పుడు ప్రాతినిధ్యం, దుర్వినియోగం ఆయన ప్రతిష్ఠకు, ఆర్థిక ప్రయోజనాలకు హాని కలిగిస్తున్నాయని కోర్టు గుర్తించింది.
Also Read- Australia Cricketers: ఇండోర్‌లో షాకింగ్ ఘటన.. ఆసీస్ మహిళా క్రికెటర్లను అసభ్యకరంగా తాకిన ఆకతాయి
బాలకృష్ణ వ్యాఖ్యల రగడ
అయితే, చిరంజీవి ఈ చట్టపరమైన నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం, నందమూరి బాలకృష్ణ ఇటీవల ఏపీ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలేనని సినీ వర్గాల్లో ఒక బలమైన టాక్ వినిపిస్తోంది. వైఎస్ జగన్ (YS Jagan)ను సినీ పరిశ్రమ తరపున కలవడానికి చిరంజీవి వెళ్లినప్పటి అంశంపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ (Nandamuri Balakrishna)… చిరంజీవిని అసందర్భంగా ‘వాడు, వీడు’ అంటూ మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారాన్నే లేపాయి. పద్మ భూషణ్, పద్మ విభూషణ్ బిరుదాంకితుడైన చిరంజీవిని అలా అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం ఏంటని, చిరంజీవి అభిమాన సంఘాలు కూడా ఫైర్ అయ్యాయి. ఈ ఘటన తర్వాత వైసీపీ అభిమానులు చిరంజీవిని టార్గెట్ చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. జగన్ అలా దండం పెట్టించుకోవడం అవమానించడమే అని చిరంజీవి తన నోటితో చెబుతాడా? చూస్తుంటే తెలియడం లేదా? జగన్ అవమానించలేదని ఇన్నాల్లు ఎందుకు చెప్పలేదు? అంటూ చిరుపై వైసీపీ బ్యాచ్ టార్గెట్ చేయడం కూడా చిరు ఈ నిర్ణయానికి కారణంగా చెప్పుకోవచ్చు.
Also Read- Megastar Chiranjeevi: ఇకపై చిరంజీవి పేరు, ఫొటోలను ఎలా పడితే అలా వాడారో..!
అభిమానులకు హెచ్చరిక?
ఈ వివాదం తర్వాత సోషల్ మీడియాలో, ముఖ్యంగా యూట్యూబ్ ఛానెళ్లలో, చిరంజీవిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్లుగా ట్రోల్స్, అభ్యంతరకర వ్యాఖ్యలు పెరిగిపోవడం గమనించిన చిరంజీవి, బాలకృష్ణ వ్యాఖ్యలతో మొదలైన ఈ నోటి దురుసు ట్రెండ్‌కు అడ్డుకట్ట వేయడం కోసమే న్యాయపరమైన రక్షణ పొందాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఒక స్టార్ హీరోగా తన పేరును, ప్రతిష్ఠను కేవలం వాణిజ్య ప్రయోజనాల నుంచి కాపాడుకోవడమే కాకుండా, రాజకీయ లేదా ఇతర విమర్శల సందర్భంలో అసందర్భంగా వాడేవారికి, దురుసుగా మాట్లాడేవారికి చట్టపరమైన హెచ్చరిక ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే చిరంజీవి ఈ కీలక అడుగు వేశారని టాలీవుడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కోర్టు ఉత్తర్వులు ఇప్పుడు కేవలం చిరంజీవికి మాత్రమే కాక, ఇతరులకు కూడా తమ వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణకు ఆయుధంగా ఉపయోగపడతాయని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా చిరంజీవి తీసుకున్న ఈ నిర్ణయంపై ఆయన అభిమానులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పని ఎప్పుడో చేయాల్సిందంటూ వారు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తుండటం విశేషం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
