Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ షోతో తెలుగు ఆడియెన్స్ హృదయాల్లో మంచి స్థానం సంపాదించుకున్నాడు. మేజిక్ షోలతో తన కెరీర్‌ను ప్రారంభించిన సుధీర్, జబర్దస్త్‌లో నెక్స్ట్ లెవెల్లో పెర్ఫార్మెన్స్ చేసి తక్కువ సమయంలో మంచి పేరు సంపాదించుకున్నాడు.
Also Read: Sekhar Kammula: ఇలాంటి సినిమాలు నిర్మించడానికి ధైర్యం ఉండాలి.. యంగ్ హీరో సినిమాపై ప్రశంసలు
ఆర్టిస్ట్‌గా అడుగుపెట్టి, టీమ్ లీడర్ వరకు ఎదిగాడు. అక్కడి నుంచి యాంకరింగ్, కామెడీ, హీరోగా సినిమాల్లోకి దూసుకెళ్లాడు. కానీ, గత కొన్నేళ్లుగా సుధీర్ జబర్దస్త్‌ను వదిలేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల జబర్దస్త్ రీ-యూనియన్ జరిగినప్పుడు అందరూ వచ్చారు కానీ, సుధీర్ మాత్రం రాలేదు. అయితే, జబర్దస్త్ నటుడు మహీధర్ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై షాకింగ్ కామెంట్స్
చేశాడు.
మహీధర్ మాట్లాడుతూ.. ” జబర్దస్త్ షో నుంచి కొంతమంది వదిలేసి వెళ్లిపోయారు. కానీ, సుధీర్‌కు ఇక్కడే వేరే షోలు ఉన్నాయి, అదికి అగ్రిమెంట్లు ఉన్నాయి కాబట్టి వెళ్లలేదు. అయితే, ఇక్కడ సుధీర్ చేస్తుండగానే వేరే ఛానల్‌లో సింగింగ్ షోకి యాంకర్‌గా ఛాన్స్ వచ్చింది. అది కామెడీ షో కాదు కాబట్టి, సుధీర్ ఆ షో ను ఒప్పుకున్నాడు. కానీ, జబర్దస్త్ మేనేజ్‌మెంట్ దానికి ఒప్పుకోలేదు.. ‘కామెడీ అయినా, కాకపోయినా ఆ షో చేయొద్దు’ అని గట్టిగా చెప్పారు. దీంతో, సుధీర్ బయట షో కే ఎక్కువ విలువనిచ్చి, జబర్దస్త్‌ను వదిలేసి వెళ్లిపోయాడు” అని వెల్లడించాడు.
అలాగే, సుధీర్ గురించి మహీధర్ మాట్లాడుతూ, ” సుధీర్ చాలా రిజర్వ్డ్ టైప్.. ఎవరి ఫోన్‌లు తియ్యడు.. లిఫ్ట్ చేసినా ఆన్సర్ కూడా ఇవ్వడు. సెట్‌లో షూటింగ్ లేకపోతే కారవాన్‌లోనే ఉంటాడు. ఎవరితో కూడా ఎక్కువ ఉండడు. అలాగే, ఎక్కువ మాట్లాడడు. ఎవరితోనూ కాంటాక్ట్‌లో ఉండడు. బయటకు ఫంక్షన్‌లకు కూడా వెళ్ళడు. ఆది , గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్‌లతో మాత్రమే కాంటాక్ట్‌లో ఉంటాడు. మొదటి నుంచి సింగిల్ గానే ఉంటాడు. సుధీర్‌తో ఏమైనా చెప్పాలంటే.. గెటప్ శ్రీను అన్న ద్వారానే అతన్ని కాంటాక్ట్ చేయాలి” అని చెప్పాడు. ఈ కామెంట్స్ జబర్దస్త్ ఫ్యాన్స్ లో కొత్త చర్చలకు దారితీస్తున్నాయి.