Jatadhara Movie Opening
ఎంటర్‌టైన్మెంట్

Jatadhara: థ్రిల్లింగ్, మిస్టరీ అంశాలతో నవ దళపతి ‘జటాధర’.. ప్రారంభం

Jatadhara: నవ దళపతి సుధీర్ బాబు హీరోగా ఓ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ రూపుదిద్దుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘జటాధర’ అనే టైటిల్‌ను ఇప్పటికే ఫిక్స్ చేసి.. టైటిల్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ మూవీ పూజా కార్యక్రమాలను శనివారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశానికి బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ క్లాప్ కొట్టగా.. మైత్రీ నిర్మాత రవిశంకర్, దర్శకుడు మోహన ఇంద్రగంటి, దర్శకుడు వెంకీ అట్లూరి, శిల్పా శిరోద్కర్ వంటి వారంతా హాజరయ్యారు. ఈ సినిమాను జీ స్టూడియోస్ సమర్పణలో ఉమేష్ కె.ఆర్.బన్సాల్, ప్రేరణ అరోరా నిర్మిస్తున్నారు. వెంకట్ కళ్యాణ్ దర్శకుడు.

Also Read- Vishwambhara: మెగాస్టార్‌తో మేనల్లుడు.. ‘విశ్వంభర’ తాజా అప్డేట్ ఇదే!

చిత్ర పూజా కార్యక్రమాల సందర్భంగా జీ స్టూడియోస్ సీఈవో ఉమేష్ కేఆర్ బన్సాల్ మాట్లాడుతూ.. మా బ్యానర్‌లో తెరకెక్కబోతోన్న ‘జటాధర’ థ్రిల్లింగ్ సూపర్ నేచురల్‌గా ఉండబోతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం మరోసారి ప్రేరణ అరోరాతో కలిసి పని చేస్తున్నందుకు హ్యాపీ. ప్రేక్షకులకు ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ని అందించేలా ఈ సినిమా ఉంటుంది అని తెలిపారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి హాజరైన ప్రముఖులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Jatadhara Movie Opening
Jatadhara Movie Opening

‘జటాధర’‌లో ఏం చూపించబోతున్నారంటే..
‘జటాధర’ మూవీ కథని మూవీ టీమ్ క్లుప్తంగా తెలియజేసింది. అదేంటంటే.. అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అక్కడి సంపద, దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు, నేపథ్యం, చరిత్ర ఇలా అనేక అంశాలను ఈ చిత్రంలో ఆసక్తికరమైన కోణంలో చూపించబోతున్నట్లుగా తెలిపారు. అక్కడి నిధిని మాత్రమే కాకుండా అనంత పద్మనాభ స్వామి ఆలయ చరిత్ర, ఆలయంపై ఉన్న పురాణ కథల్ని కూడా ఇందులో చూపించబోతున్నారు. ఈ సినిమాలో సుధీర్ బాబు పాత్ర‌ చాలా భిన్నంగా ఉండబోతోందని తెలుస్తోంది. యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా ఆడియెన్స్ ముందుకు రానున్న ఈ మూవీ థ్రిల్లింగ్, మిస్టరీ అంశాలతో ఉత్కంఠభరితంగా ఉండబోతోంది. ఓ నిధి కోసం జరిగే పోరాటంలో కొన్ని శాపాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఆ పోరాటం ఏంటి? ఆ శాపాలు ఏంటి? అనేది తెలియాలంటే మాత్రం ఇంకొన్ని నెలలు వేచి చూడాల్సిందేనని అంటున్నారు మేకర్స్.

ఇవి కూడా చదవండి:

 Klin Kaara: మెగా ప్రిన్సెస్ క్లీంకారా ఫేస్ రివీలైంది.. ఎంత క్యూట్‌గా ఉందో!

Balakrishna: థమన్‌కు బాలయ్య కాస్ట్‌లీ గిఫ్ట్.. ఊహించలేదు కదా!

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ