Priyanka Chopra Mandakini (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

SSMB29: ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ వచ్చేసింది.. ఆమె పాత్ర పేరేంటో తెలుసా?

SSMB29: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి (SS Rajamouli), సూపర్‌స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) కాంబినేషన్‌లో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక గ్లోబల్ ప్రాజెక్ట్ గ్లోబ్‌ ట్రాటర్‌ (Globe Trotter) SSMB29పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘బాహుబలి’, ‘RRR’ వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా తన ఖ్యాతిని చాటుకున్న రాజమౌళి, ఈ సినిమాను భార‌త‌దేశం గర్వించదగ్గ స్థాయిలో తెర‌కెక్కిస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్‌పై అప్‌డేట్ల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ మరో అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. తాజాగా, ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనస్ (Priyanka Chopra Jonas) ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రియాంక ఇందులో ‘మందాకిని’ (Mandakini) అనే శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నట్లు ఈ పోస్టర్‌తో అధికారికంగా ప్రకటించారు.

Also Read- Kaantha Controversy: ‘కాంత’.. ఎవరి తాత, నాన్నల కథ కాదు.. కాంట్రవర్సీపై రానా, దుల్కర్ క్లారిటీ!

సరికొత్త అవతారంలో ప్రియాంక

తాజాగా విడుదలైన పోస్టర్‌లో ప్రియాంక చోప్రాను చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఎల్లో (పసుపు) రంగు శారీ, దానికి మ్యాచింగ్‌గా ఉన్న డిజైనర్ బ్లౌజ్‌లో ఆమె కనిపించారు. అయితే, ఇది కేవలం సంప్రదాయ లుక్ కాదు. ఓ అగాధంలో, చుట్టూ మంటలు, రాళ్లు పడుతున్న ప్రమాదకరమైన లొకేషన్‌లో, గాలిలో తేలుతున్నట్లుగా ఉండి.. చేతిలో పిస్టల్‌తో కాల్పులు జరుపుతున్న పవర్ ఫుల్ యాక్షన్ పోజులో ప్రియాంక చోప్రా కనిపిస్తున్నారు. ఆమె కళ్లల్లోని తీక్షణత, శారీలోనూ యాక్షన్ డోస్ చూపించిన విధానం ఈ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో చెప్పకనే చెబుతోంది. రాజమౌళి తన సినిమాలోని హీరోయిన్ పాత్రలను ఎంత వైవిధ్యంగా, బలంగా డిజైన్ చేస్తారో మరోసారి ఈ పోస్టర్ నిరూపించింది. ఎస్‌.ఎస్‌. రాజమౌళి ఫిల్మ్ అనే లోగో పోస్టర్ పైభాగాన ఉండగా, కింద ‘ప్రియాంక చోప్రా జోనస్ యాజ్ మందాకిని’ అని స్పష్టంగా ఉంది. పోస్టర్‌లోని బ్యాక్‌గ్రౌండ్, యాక్షన్ సెటప్ ఈ సినిమా అత్యున్నత సాంకేతిక విలువలతో, ఊహించని యాక్షన్ సీక్వెన్సులతో ఉంటుందని తెలుస్తోంది.

Also Read- Prakash Raj: ‘తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే’.. ప్రకాష్ రాజ్ కీలక వ్యాఖ్యలు

‘కుంభ’ తర్వాత ‘మందాకిని’

ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌లు వరుసగా వస్తుండటం ప్రేక్షకులలో ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రియాంక చోప్రా ఫస్ట్‌లుక్‌కు ముందు, మరో కీలక పాత్రలో నటిస్తున్న మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ ఫస్ట్‌లుక్‌ను రాజమౌళి స్వయంగా విడుదల చేశారు. పృథ్విరాజ్ ఇందులో ‘కుంభ’ అనే ఇంటెన్స్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుపుతూ.. వీల్ ఛైర్‌లో ఆయన కూర్చుని ఉన్న లుక్‌ని విడుదల చేయగా, ఒక్కసారిగా అది వైరలైంది. పృథ్విరాజ్ ‘కుంభ’, ప్రియాంక చోప్రా ‘మందాకిని’ వంటి పవర్‌ఫుల్ టైటిల్స్‌ చూస్తుంటే మహేష్ బాబు పాత్ర టైటిల్ ఎలా ఉంటుందో అనే ఆతృత అభిమానుల్లో పెరిగిపోతోంది. భార‌త‌దేశ సినిమాను మ‌రో స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో రాజమౌళి తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాలోని ప్ర‌తి అప్‌డేట్ రికార్డులు సృష్టిస్తోంది. మహేష్ బాబు పాత్ర పరిచయం మాత్రం నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే గ్లోబ్ ట్రాట‌ర్ ఈవెంట్‌లోనే ఉంటుందనేలా టాక్ నడుస్తుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Jupally Krishna Rao: పర్యాటక ప్రదేశాలను దత్తత తీసుకోండి : మంత్రి జూపల్లి కృష్ణారావు

Uttam Kumar Reddy: కాళేశ్వరం ప్రాజెక్టు తప్పుడు నిర్ణయాలతోనే బ్యారేజీలు కూలాయి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

AV Ranganath: చెరువుల పూర్తి స్థాయి పునరుద్దరణే అసలైన పరిరక్షణ : హైడ్రా కమిషనర్ రంగనాధ్

SSMB29: ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ వచ్చేసింది.. ఆమె పాత్ర పేరేంటో తెలుసా?

Agricultural Market: వ్యవసాయ మార్కెట్‌లో పిచ్చి మొక్కలు.. రైతుల వోడ్లకు స్థలమే లేక ఇబ్బందులు