Prakash Raj: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) సీఐడీ విచారణకు హాజరైన సందర్భంగా, బెట్టింగ్ యాప్ (Betting Apps)ల గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. యువత తప్పుదోవ పట్టవద్దని, ఇలాంటి అడ్డదారులకు దూరంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. బెట్టింగ్ యాప్స్ కేసులో టాలీవుడ్ సినీ ప్రముఖులపై ఇటీవల కేసులు నమోదైన విషయం తెలిసిందే. రానా దగ్గుబాటి (Rana Daggubati), ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మంచు లక్ష్మి (Manchu Lakshmi) వంటి వారందరూ విచారణకు హాజరు కావాలని, వారికి సమన్లు జారీ అయ్యాయి. రీసెంట్‌గా విజయ్ దేవరకొండ విచారణను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ప్రకాష్ రాజ్ సీఐడీ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయన మీడియా మాట్లాడారు.
Also Read- Kajol: పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్, రెన్యువల్ ఆప్షన్ ఉండాలి.. బాలీవుడ్ నటి కాజోల్ షాకింగ్ కామెంట్స్
సీఐడీ విచారణపై ప్రకాష్ రాజ్
తాను నోటీసులు ఇచ్చిన విధంగానే సీఐడీ విచారణకు హాజరైనట్లు ప్రకాష్ రాజ్ తెలిపారు. ‘గతంలోనే నా బ్యాంక్ స్టేట్‌మెంట్స్ అన్నింటిని సమర్పించానని, ప్రస్తుత విచారణలో.. బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు సంబంధించిన సమాచారాన్ని అధికారులకు అందించానని ఆయన వెల్లడించారు. ‘‘నేను 2016లో ఒక బెట్టింగ్ యాప్‌కి ప్రమోట్ చేశాను. అయితే, ఆ యాప్‌ను 2017లోనే నిషేధించారు. ఆ సమయంలో అది గేమింగ్ యాప్‌గా భావించాను. అందుకే ప్రమోట్ చేశాను. ఆ తర్వాత అది బెట్టింగ్ యాప్ అని తెలిసి.. తర్వాత దానిని కొనసాగించలేదు. అంతే, ఆ తర్వాత ఇలాంటి ఏ ఇతర కంపెనీలకు ప్రమోట్ చేయలేదు. ఆ విషయాన్నే విచారణలో చెప్పాను’’ అని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు.
Also Read- Bigg Boss promo: సుమన్ శెట్టితో స్టెప్పులేయించిన బిగ్ బాస్ మహారాణులు.. ఏంది భయ్యా ఆ టాస్కులు..
యువతకు ప్రకాష్ రాజ్ సందేశం
బెట్టింగ్ యాప్‌ల గురించి మాట్లాడే సందర్భంలో ప్రకాష్ రాజ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘బెట్టింగ్ యాప్స్ రాంగ్ వే.. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే అవుతుంది. యువత బెట్టింగ్ యాప్‌ల జోలికి అస్సలు వెళ్లవద్దు. ఈజీగా డబ్బులు సంపాదించాలని అడ్డదారిలో వెళ్లకండి. ప్రజలు, యంగ్ స్టర్స్ అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. బెట్టింగ్ యాప్స్‌లో డబ్బులు పెట్టి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. ఈ బెట్టింగ్ యాప్స్ కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది చాలా బాధాకరం. దయచేసి ఎవరూ వీటి జోలికి వెళ్లకూడదని కోరుకుతున్నాను’’ అని ప్రకాష్ రాజ్ సందేశమిచ్చారు. మొత్తంగా చూస్తే.. ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు, బెట్టింగ్ యాప్‌ల ద్వారా జరుగుతున్న అనర్థాలపై దృష్టి సారించాలని సమాజానికి, ముఖ్యంగా యువతకు ఒక హెచ్చరికగా నిలుస్తున్నాయని భావించవచ్చు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ పలు సినిమాలతో బిజీ నటుడిగా కొనసాగుతున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
