Kaantha Controversy: ‘కాంత’ సినిమాను బ్యాన్ చేయాలంటూ.. కోలీవుడ్‌లో ఫస్ట్ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఎంకే త్యాగరాజ భగవతార్ (M.K. Thyagaraja Bhagavathar) మనవడు ఉపాసన సంజీవ్ (Upasana Sanjeev) చెన్నై హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తమ అనుమతి తీసుకోకుండా త్యాగరాజ భగవతార్ బయోపిక్‌ను తెరకెక్కించారని ఆయన హైకోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై తాజాగా చిత్ర నిర్మాతలైన రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ క్లారిటీ ఇచ్చారు. దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పీరియాడికల్ డ్రామా ‘కాంత’ (Kaantha). సెల్వమణి సెల్వరాజ్ (Selvamani Selvaraj) దర్శకత్వం వహిస్తున్నారు. రానా, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ‘వేఫేర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్’, రానా దగ్గుబాటి (Rana Dabbubati) ‘స్పిరిట్ మీడియా’ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు మంచి స్పందనను రాబట్టుకుని, సినిమాపై మంచి బజ్‌ని ఏర్పాటు చేశాయి. నవంబర్ 14న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైన ఈ చిత్రం ఇప్పుడు కాంట్రవర్సీలో చిక్కుకుంది.
Also Read- Bigg Boss Telugu 9: కింగ్, క్వీన్స్.. నన్ను తొక్కి నువ్వు లేవకు.. దివ్యపై రీతూ ఫైర్!
ఇది ఎవరి తాత, నాన్నల కథ కాదు
ఈ కాంట్రవర్సీపై తాజాగా రానా, దుల్కర్ క్లారిటీ ఇచ్చారు. వారు మాట్లాడుతూ.. ‘‘ఇది కంప్లీట్‌గా ఫిక్షనల్ కథ. ప్రజంట్ స్టూడియోలలో ఏదైనా జరిగితే.. వెంటనే అందరికీ తెలిసిపోతుంది. కానీ ఇలాంటి కథలు చాలా జరిగాయి. చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసేవి. ఆ కాలం నుంచి ఇన్స్పిరేషన్ పొంది రాసిన కథ ఇది. ఇది ఒక ఇన్సిడెంట్ అని చెప్పలేం. డార్క్ సైడ్ ఆఫ్ గ్రేట్ పీపుల్ అని చెప్పొచ్చు. ఒక ఇద్దరు గొప్ప వ్యక్తులు.. వాళ్ళ ఆర్టిస్ట్ బ్రిలియన్స్ కోసం ఎలాంటి గొడవలు పడ్డారు? వారి గొడవలకు కారణం ఏంటి? చివరికి వారి గొడవలు ఎటు దారి తీశాయి? అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది ఎవరి తాత, నాన్నల కథ కాదు. ఈరోజు (బుధవారం) మద్రాస్‌లో సినిమా చూపించేస్తున్నాం. తర్వాత అన్ని కాంట్రవర్సీలు క్లియర్ అయిపోతాయి.
Also Read- Kajol: పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్, రెన్యువల్ ఆప్షన్ ఉండాలి.. బాలీవుడ్ నటి కాజోల్ షాకింగ్ కామెంట్స్
‘పాతాళ భైరవి’ ఇలాంటి కెమెరాల్లో తీశారా..
ఇందులో 50s బ్యాక్ డ్రాప్‌ని ఎంచుకోవడానికి ఓ కారణం ఉంది. ఆ కాలంలో లిటరేచర్, మ్యూజిక్‌కి చాలా ప్రాముఖ్యత ఉండేది. ఈరోజు షార్ట్ కంటెంట్‌లో వున్నాం, మ్యూజిక్ ఎలా ఉన్నా, సాహిత్యం ఎలా ఉన్నా.. ఓకే అనని సర్దుకుపోతున్నాం. కానీ అప్పట్లో అలా ఉండేది కాదు. ప్రతి దానిలో పర్ఫెక్షన్ ఉండేది. ఆ టైంలో జరిగిన కథ అంటే తెలియని రొమాన్స్ వస్తుంది. సినిమా మాత్రమే టైమ్‌ని రీ క్రియేట్ చేయగలదు. మేము మద్రాస్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు.. ఇక్కడ ఎలాంటి స్టూడియోస్ లేవు. మద్రాస్‌లో ఉండే స్టూడియో కల్చర్ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా ఆసక్తికరంగా అనిపించింది. అలాంటి టైమ్‌ని రీ క్రియేట్ చేయడం చాలా ఎక్సైటింగ్ థింగ్. ఆ కాలంలో వాడిన చాలా అరుదైన పరికరాలు ఈ సినిమాలో కనిపిస్తాయి. చాలా గొప్ప గొప్ప సినిమా సెట్స్‌లో తిరిగిన వస్తువులు మా సెట్లో ఉన్నాయి. అవి స్క్రీన్ మీద కనిపించినప్పుడు అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. ‘పాతాళ భైరవి’ ఇలాంటి కెమెరాల్లో తీశారా? అని సర్‌ప్రైజ్ అవుతారు’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
